Saturday, January 31, 2009

పరిపూర్ణ మహిళ

Saturday, January 31, 2009




















రంజనిలో ప్రచురింపబడి పలువురి మెప్పు పొందిన నేను వ్రాసిన ఇంకో కధ













5 comments

Tuesday, January 27, 2009

మన భాషమన ఆత్మ గౌరవం

Tuesday, January 27, 2009
మన భాష మన ఆత్మ గౌరవం

శారద గారు నవంబరు 17న వ్రాసిన శీర్షిక లేని పోస్టుకి జనవరి చివరిలో వ్యాఖ్యలు వచ్చాయి. దానికి కారణం సమాజం పట్ల తనకుగల బాధ్యతను చక్కగా నెరవేర్చిన శ్రీ మురళీధర్ నామాల గారికి ముందు కృతజ్ఞతలు. ఆయన గూగుల్ గుంపుకి వ్రాసిన లేఖతో బ్లాగర్లలో కదలిక వచ్చింది. నేనూ ఇప్పుడే చూసి ముందు వ్యాఖ్య వ్రాయబోయాను కానీ మాతృభాషలో మొదలుపెట్టటంతో మదిలోని భావాలు నా గురించి చెప్పు, నా గురించి చెప్పు అని ఎగిరెగిరి పడటంతో విడిగా పోస్టు వ్రాస్తున్నాను.

సుధాశ్రీగారి వ్యాఖ్య చదివాక
కొత్తపాళీగారి వ్రాసిన మాట వుపయోగించినది బ్లాగరేకదా. వ్యాఖ్యలు వ్రాసేటప్పుడు పోస్టులో వాడిన మాటలు వాడుకుంటారు కదా. అంటే వ్యాఖ్యలలో డిగ్నిటీ ఆశించేటప్పుడు మన పోస్టు కూడా డిగ్నిఫైడ్ గా వుండాలన్నమాట.
ఇంక చదువరిగారి వ్యాఖ్య ... సందర్భం వచ్చిందికనుక ఒక బాపతు జనాన్ని గురించి చెప్పారు ఆయన. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకోవటం ఎందుకు ఆలాంటి వాళ్ళు ఒకరిద్దరిగా మొదలయి తెలియ చెప్పేవారులేక, విలువలు తెలుసుకోక ఆ సంఖ్య ఇప్పుడు వందలు, వేలు, లక్షలు దాటింది. కోట్లు కాకుండా కాపాడుకుంటే మనం కాపాడుకునేది మన ఆత్మ గౌరవాన్ని మాత్రమే.
వెంకట్ గారి వ్యాఖ్య నిజం కాదా. ఇంగ్లీషులో ఒక మాటని ఎంతమంది ఒకే విధంగా పలుకుతారు.

ఇంక నా అభిప్రాయం
శారద గారు ఆంధ్రాలో కాక తమిళనాడులో పుట్టి వుంటే వారికి ఈ పోస్టు వ్రాయటానికి ఆవకాశం వచ్చేదికాదు. ఎందుకంటే వారికి వేరే భాషరాదు వచ్చినా మాట్లాడరు, వ్రాయరు. దాని వలన నష్టపోతున్నది వాళ్ళే. ఎందుకంటే వారి సంస్కృతీ, వారికున్న అపురూప దేవాలయాలు, శిల్ప సంపద వారికే పరిమితమవుతోంది కానీ తాజ్ మహల్ లాగా ప్రపంచ వ్యాప్తం కావటంలేదు. తమిళనాడులో వున్నన్ని విశాలమైన, ప్రాచీనమైన, అద్భుతమైన దేవాలయాలు ఇంకెక్కడా వుండవేమో. వాటి చరిత్ర అందరికీ తెలుస్తే ప్రపంచ వింతల సంఖ్య కూడా పెరుగుతుంది దానికి కారణం తమిళ రాష్ట్రమవుతుంది.

తమిళనాడులో ఎక్కడికన్నా వెళ్ళి చూడండి. తమిళ భాష, తమిళ బోర్డులు, తమిళ ఆచార వ్యవహారాలు, అంతా తమిళమే. అంతగా తమిళాన్ని ఆరాధించిన వారు దానిమూలంగా ఎక్కువ ఏమీ నష్టపోలేదు. ఆ రాష్ట్రంలో అత్యంత మేదావులున్నారు, విదేశాలలో ఉద్యోగాలు చేసే వారున్నారు, అనేక రంగాలలో అభివృధ్ధి చెందినవారున్నారు. నేను తమిళ గానం పాడటం లేదండీ. నేను అర్ధం చేసుకున్న విషయాలు అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. అవేమిటంటే మాతృ భాషని మర్చిపోకూడదు... వేరే భాషలను కూడా అవసరమయినంత వరకు ఆదరించాలి. అంతే.

ఈ మధ్య మేము తమిళనాడు వెళ్ళివచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మేము వెళ్ళింది ప్రసిధ్ధి చెందిన ఆలయ దర్శనానికి. అక్కడ ఆలయాలలో వున్న దేవతా విగ్రహాలన్నింటికీ బోర్డులు తమిళంలోనే వున్నాయి. దానితో మేము ఎవరికి నమస్కరిస్తున్నామో వారి పేరు కూడా తెలియని పరిస్ధితి. ఒక్కొక్క ఆలయంలో అనేక ఉప ఆలయాలుంటాయి. ఎంతమందిని ఎన్నిసార్లు అడుగుతాం అక్కడ ఏమి వ్రాసివుందో చెప్పండి అని. పోనీ తెలుగులోగానీ, ఇంగ్లీషులో గానీ, ఆ ఆలయాల చరిత్ర వున్నదేమోనని అడిగితే అది కూడా తమిళంలోనే. అలాంటి చోట్ల అతి భాషాభిమానం వుండటంకూడా సరైనది కాదేమో.

కొన్ని ఆలయాల్లో ఆఫీసుల్లోవారికి మా అవస్త చెప్పి ఆలయంలో దేవుళ్ళ పేర్లు, విశేషాలు వ్రాసిన బోర్డులు ఇంగ్లీషులో, హిందీ లో కూడా పెట్టించండి అందరికీ అర్ధమవుతుందని అని చెప్పాము. వారు తమిళనాడు కదండీ, తమిళంలో వుండాలని మాకు ఆర్డర్సు అన్నారు. మేమూ వాళ్ళ భాషాభిమానాన్ని గౌరవించి ముందు మీ తమిళం లోనే వ్రాయించండి, దాని క్రింద మన జాతీయ భాష హిందీ, తర్వాత ఇంగ్లీషులో వ్రాయించండి అన్నాము. వాళ్ళు అర్ధం చేసుకున్నారు. స్వామిమలై దేవస్ధానం ఆఫీసులో వారైతే వారి నోట్ బుక్ లో మా వారి చేత మేమడిగిన విషయం వ్రాయించుకుని సంతకం, అడ్రసు తీసుకున్నారు పై వారికి నోట్ పంపిస్తామని.

మన ఉనికిని చాటి చెప్పే ప్రతి విషయంతో.. అంటే మన భాష, మన నడవడిక, మన వేష ధారణ, మన మాటతీరు, మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాలు, మన సభ్యతా సంస్కారాలూ....వీటన్నిటితో మన ఆత్మగౌరవం ముడిపడి వుంటుంది. మనం వీటిని గౌరవిస్తేనే ఎదుటివారూ గౌరవిస్తారు. మనవాటికి మనమే తాటాకులు కడితే ఎదుటివారు అగ్గివుల్ల గీస్తారు. నాశనానికి నిముషాలు చాలు. కోల్పోయేది మన ఉనికే. ప్రపంచం సాగి పోతుంది. దానికేం నష్టం లేదు.

పైన వ్రాసిన ఐదు పంక్తులూ ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన సత్యం. ఆత్మ గౌరవం లేని మనిషి జీవితం వ్యర్ధం. సాంకేతికాభివృధ్ధితో ప్రపంచమే కుగ్రామయింది. సంఘ జీవనానికీ, మనిషి మనుగడకూ అనేక పరిచయాలు, అనేక భాషలు అవసరమే. అంత మాత్రాన వారి గుర్తింపును పోగొట్టుకుంటే ఎవరికైనా విలువ ఏముంటుంది. ఇప్పడు మనము ఆ పరిస్ధితుల్లోనే వున్నాము. మన భాష అన్నా, మన తోటి వారన్నా, మన ఆచార వ్యవహారాలన్నా మనకి గౌరవం సన్నగిల్లుతోంది. తెలుగు వారికున్న విశాల భావాలతో మనల్ని, మన ఉనికినీ మనం గౌరవించుకోవటం మరచిపోయి ఎదుటి వారికి ఎక్కువ విలువలిస్తున్నాము. మీరు మనుగడ కోసం ఏ చదువైనా చదువుకోండి, ఉన్నతి కోసం ఏ దేశమైనా వెళ్ళండి. అది తప్పు కాదు. కానీ మనం మన సంస్కృతిని గౌరవిస్తే దాని విలువ పెంచినవాళ్ళూ, పంచినవాళ్ళమూ అవుతాము. లేకపోతే మన చేజేతులారా మనమే దాని నాశనంలో భాగస్తులమవుతాము.

ఈ మధ్య అమెరికా వెళ్ళినప్పుడు నేను గమనించిన విషయం. మేము అక్కడ మిచిగన్, చికాగోలలో దేవాలయాలకి వెళ్ళాము. వేరే రాష్టాల వారు వాళ్ళ వాళ్ళని కొత్తవారైనా ఆప్యాయంగా పలకరించుకోవటం, పరిచయం చేసుకోవటం గమనించాను. మరి తెలుగు వారు ఇదేమీ లేదుకదా కనీసం చిరునవ్వయినా లేదు. దయచేసి సరిగ్గా అర్ధం చేసుకోండి. నా ఆవేదన తెలుగువారు తమ ఉనికిని కోల్పోతున్నారని. ఎలాగంటే, కన్నడం వాళ్ళు ఎక్కువ వున్న ఒక గుడికి వెళ్ళాము. అక్కడ డెస్క్ దగ్గర వున్న ఒకాయన మమ్మల్ని చూసి అక్కడే కూర్చున్న వేరే ఆడవారి దగ్గరకు వెళ్ళి కన్నడానా అని అడిగారు. (మేము కన్నడా వాళ్ళమా అని) వాళ్ళు కాదు ఆంధ్రా అని చెప్పిన తీరు మాకు బాధ అనిపించిందు. కారణాలు ఏవైనా వేరే రాష్ట్రాల వారికున్న విలువ తెలుగువారికి లేదా అని వ్యాకుల పడ్డాను. వేరే రాష్ట్రాల వారు తమవారిని కలుసుకున్న ఆనందంతో వారి మాతృభాషలో మాట్లాడుకుంటూ తమ ఉనికిని చాటుకుంటుంటే మనవారు మాత్రం అలాంటి సమయాల్లో ఇంగ్లీషుని వదలకుండా ఏ ఉనికి కోసం పాకులాడుతున్నారు. మనమే మన భాషను కాదంటే ఎదుటివారికి చులకన కాదా. నేను ఇంగ్లీషుకి వ్యతిరేకినికాదు. ఎక్కువమందికి అర్ధమయ్యే భాష అది . అలాంటి భాషల అవసరం ప్రపంచానికి చాలా వుంది.

ఎన్నాళ్ళనుంచో నా గుండెలో గూడుకట్టుకున్న ఇంకొక్క చిన్న అవమానం గురించి చెప్తాను. ఇదివరకు ఆంధ్రా, తెలంగాణా గోలలప్పటి సంగతి. హైదరాబాదులో సిటీ బస్ ఎక్కాను. బస్సు అంటే నానా జాతి సమితి కదా. వేరే రాష్ట్రాలవారిని వారి భాషతో గుర్తించవచ్చుకదా. వారి మాటల్లో ఒకరి మాట all Andhra bastards are here అని. ఆ కామెంటుకి తట్టుకోలేని నేను all other states bastards are here అని గట్టిగా అనేశాను. వాళ్ళూ ఒక్క క్షణం బిత్తరపోయారుగానీ అప్పటికింకా సమాజ పరిస్ధితులు ఇంత దిగజారిపోలేదుగనుక అందరూ నిశ్శబ్దంగా వుండిపోయారు. కానీ నేను మాత్రం ఈ రోజుకీ ఆ విషయాన్ని మర్చిపోలేకపోతున్నాను. మన రాష్ట్రంలో మనకున్న గౌరవం ఇదని.

చివరిగా ఒక్కటే మాట తెలుగు జాతి ఒకటి వుంది అని భావి తరాలవారు చరిత్రలో చదవకుండా నిజంగా తెలుసుకోవాలంటే, మన ఉనికిని మనం కాపాడుకోవాలి. దానికి భాష పట్టు కొమ్మ. జీవనం కోసం ఎన్ని భాషలన్నా నేర్చుకోండి, ఎక్కడన్నా వుండండి, మిమ్మల్నీ, మీ భాషనీ, మీ జాతినీ మీరు గౌరవించుకోండి. ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి. మనిషిలాగా బ్రతకండి.

3 comments

Tuesday, January 6, 2009

ఔన్నత్యమే పురుషత్వం

Tuesday, January 6, 2009
జనవరి 4, 2009 ఆదివారం ఈనాడు అంతర్యామి లో ప్రచురించబడ్డ శ్రీమతి చక్కిలం విజయలక్ష్మిగారి వ్యాసం ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ప్రతి మహిళా చదవాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ ఇస్తున్నాను. చదివి ఒక్క నిముషం ఆలోచించండి.


0 comments