దేవీ నవరాత్రులు
ఇవాళ్టినుంచి (19-9-2009) దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి.
శైలపుత్రి పూజతో మొదలయ్యే ఈ నవరాత్రులలో తొమ్మిదిరోజులూ ఆ తల్లికి చేసే నివేదనలగురించి నేను తెలుసుకున్నవి క్రింద ఇస్తున్నా
పాడ్యమి, మొదటిరోజు......కట్టు పొంగలి లేదా పులగం
విదియ, రెండవరోజు............పులిహోర
తదియ, మూడవరోజు.........కొబ్బరి పాయసం లేదా కొబ్బరి అన్నం
చవితి, నాలుగవరోజు...........గారెలు (చిల్లి లేకుండా), మనపసున్ని వుండలు
పంచమి, ఐదవరోజు............దద్దోజనం లేక పెరుగు గారెలు
షష్టి, ఆరవరోజు.....................కేసరిబాత్, లేదా పెసర పప్పు పునుగులు
సప్తమి, ఏడవరోజు..............శాకాన్నం లేదా అన్నిరకాల కూర ముక్కలతో చేసిన పులుసు అన్నం
అష్టమి, ఎనిమిదవరోజు....చక్కెర పొంగలి లేదా బెల్లంతో పాయసం