Thursday, July 15, 2010

వాన కురిసిన రోజు

Thursday, July 15, 2010




కమ్ముకొస్తున్న మబ్బులు


మబ్బుల్లో పాపికొండలు
 గాలి వానలో, వాన నీటిలో కారు ప్రయాణం...
  గమ్యమెక్కడో తెలియదు పాపం....
 పాపం మూగజీవులు
 వాన కడిగిన ఊరు

7 comments

Saturday, July 10, 2010

కధా జగత్ లోని కధల విశ్లేషణపై పోటీ

Saturday, July 10, 2010


కధా జగత్ లోని కధల విశ్లేషణపై తురుఫుముక్క బ్లాగువారు పెట్టిన పోటీ లో విశ్లేషించటానికి
నేను ఎంపిక చేసుకున్న కధ  ఏకాంతంతో చివరిదాకా  -అరుణ పప్పు గారిది.  ఇదే ఎంపికి చేసుకోవటానికి ముఖ్య కారణం చూడగానే ఆకర్షించిన కధ పేరు.  ఆ పేరు ఎందుకు పెట్టారా అని కధ చదివాను.  రెండవ ఆకర్షణ రచయిత్రి  పేరు.  తెలుగు బ్లాగు లోకానికి సుపరిచితమైన జర్నలిస్టు.  ఏం రాశారో చదవాలనే కుతూహలంతో చదివాను.

అబ్బాయి, అమ్మాయి రొటీన్ ప్రేమ కధలు కోరుకునేవారికి నచ్చకపోవచ్చీ కధ.  అనుబంధం, ఆత్మీయత అంతా ఒక నాటకం అనుకునేవారికి ట్రాష్ గా అనిపించవచ్చు.  మనసున మనసై అని పాడుకునేవారికి ఇష్టంగా అనిపించవచ్చు.  లోకోభిన్న రుచికదా.

అస్తిత్వంలో వున్న సాంఘిక, నైతిక సరిహద్దులు తనకు తానే సృష్టించుకున్నవన్న సంపూర్ణమైన అవగాహనగలిగినవాడు...వాటినిఅధిగమించటానికిసంశయించనివాడు...కళాకారుడైనప్పుడు....వాడు సంఘంలో ప్రస్ఫుటమైన అరాచకుడిగా కనపడ్డం చాలా చాలా సహజం.  ఉన్నతమైన భావ చిత్రీకరణకు అద్దం ఈ వాక్యం.  అంతరంగంలో ఎంత మధన జరిగివుంటే ఇలాంటి వాక్యాలు బయటకొస్తాయి.  అలాగే రచయిత్రి కళాకారుడి అరాచకత్వానికిచ్చిన అద్భుత నిర్వచనం ఈ కధని ఉన్నత స్ధానంలో నిలబెడుతుంది. 

మనిషి మనసుని చేతనపరిచేది ఆత్మీయుల చిన్ని ప్రోత్శాహాలు.  అలాంటి ప్రోత్సాహాలని, వాటిద్వారా పొందిన చేతనత్వాన్నీ అందంగా మలచారు కధలో...బొబ్బిలి వీణ దుమ్మయినా దులపాలనిపించటం, కార్టూన్లని కాపీ చెయ్యటం మానేశాననటంద్వారా.

మనుషులు వున్నప్పుడు ప్రేమించాలి, వాళ్ళకోసం చెయ్యాల్సిందేమైనా వుంటే బతికున్నప్పుడే చెయ్యాలి ... తనకి తోచిన మంచిని నిర్భయంగా చెప్పారు రచయిత్రి.  అంత సీరియస్ సంభాషణలో  కాళ్ళొకసారి ఫోన్లో పెట్టమ్మా దండం పెట్టుకుంటా...  రచయిత్రి హాస్య చతురతకి నిదర్శనం.

మధ్యలో అంతరాత్మ మందలింపులతో తరచి చూసుకునే వివేకం....ఘనీభవించిన మౌనంలో కూడా దొరికే సమాధానాల గురించి చెప్పిన నేర్పు బాగుంది.

అలాగే ఒక మహాద్భుత అనుభవానికి సంబంధించిన జ్ఞాపకాన్ని బుధ్ధితో బేరీజు వేసుకుని తుడిపేసేంత వెర్రితనం నాకు లేదు మరి......ఉన్నతమైన భావ వ్యక్తీకరణ, చక్కని రచనా శైలి, కధలో అంతర్లీనంగా సాగే మానవత్వ, మమతల విలువలు, అర్ధం చేసుకుంటూ చదవాల్సిన కధ ఇది.  అర్ధమయితే మరచిపోలేని కధ...వెరసి ఒక ఉత్తమ కధ.

కధా జగత్తులోని శ్రీమతి అరుణ పప్పుగారి ఈ ఏకాంతంతో చివరిదాకా మీరు కూడా కొంచెం రుచి చూడండి.  లింకు ఇదుగో.....
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/ekantanto-civaridaka---aruna-pappu

1 comments

Thursday, July 8, 2010

కోకిల గొంతు వింటే రోగాలు నయమవుతాయా?

Thursday, July 8, 2010



వసంత ఋతువులో వినిపించే కోకిల గానం ఎంతో మనోహరంగా వుంటుంది.  అసలు వసంత ఋతువు అంటేనే ఆహ్లాదకరమైన ఋతువు.  మల్లెపూలు, పిల్లగాలులు, కోకిల గానాలు మామూలు మనుషులనే ఉత్తేజపరిస్తే మరి భావుకులయిన కవుల సంగతి వేరే చెప్పాలా?  మనసు వుప్పొంగి కవితా జల్లులు కురవవా? 

కోకిల గానం వింటే ఎన్నో రోగాలు వుపశమిస్తాయంటారు.  నిజమేనా?  అసలు సంగతేమిటంటే మృదువుగా వచ్చే శబ్ద తరంగాలలో రోగ నిరోధక శక్తి వుంటుంది.  ఈ మధ్య ప్రచారంలోకి వస్తున్న మ్యూజిక్ ధెరపీ గురించి వినే వుంటారు.  శాస్త్రీయ సంగీతంలో నవ గ్రహాలకు సంబంధించి రాగాలున్నాయి.  ఎవరికైనా ఏదైనా లోపం వున్నా, ఆరోగ్యం సరిగా లేకపోయినా నవ గ్రహాలలో ఏ గ్రహ స్ధితి సరిగా లేకపోవటంవల్ల ఆ దోషం ఏర్పడిందో ఆ గ్రహానికి సంబంధించిన రాగాలు వింటూవుంటే త్వరగా వుపశమనం కలుగుతుంది.

మృదు శబ్ద తరంగాలు వింటే మనసుకి ఆహ్లాదకరంగా వుండి సంతోషం కలుగుతుంది.  ఆ కారణంవల్లనేనేమో మనకి తెలియకుండానే శరీరానికి సాంత్వనం లభిస్తుంది.  అదే సాంత్వన కోకిల గానంలోకూడా లభిస్తుంది.

అసలు కోకిలమ్మ పాట వినగానే మనసులోనైనా తిరిగి దానితో గొంతు కలపని మనిషుంటాడా?

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



1 comments