Saturday, February 14, 2009

డా. డి. రామానాయుడు నాటక పరిషత్

Saturday, February 14, 2009
శేషార్ధం నాటికలో ఒక దృశ్యం

సభలో డా. డి. రామానాయుడు, డా. సి. నారాయణ రెడ్డి, మొదలగువారు


డా. డి. రామానాయుడు నాటక పరిషత్

అభినయ, జాతీయ నాటక రంగ మాస పత్రిక, ఆధ్వర్యంలో డా. డి. రామానాయుడు నాటక పరిషత్, ప్రధమ రాష్ట్ర స్ధాయి ఆహ్వాన నాటిక పోటీలు ఫిబ్రవరి 13 2009 న డి. రామానాయుడు కళామండపం, ఫిల్మ్ నగర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కాంప్లెక్స్, ఫిల్మ్ నగర్, హైదరాబాదులో ప్రారంభించబడ్డాయి.

ప్రముఖ రచయిత డా. సి. నారాయణ రెడ్డి సభను ప్రారంభిస్తూ, నాటకం సినిమాకి తల్లిలాంటిది. ఫిల్మ్ నగర్ లో సినీ కళాకారులు చాలామంది నివసిస్తున్నారు. ఇంతమంది సినీ కళాకారులున్న ఇక్కడ నాటకాలు వెయ్యటమంటే కొడుకు తల్లిని గుర్తుపెట్టుకోవటంలాంటిదన్నారు. డా.డి. రామానాయుడు జ్యోతి ప్రజ్లలన చేసిన తర్వాత ఉపన్యసిస్తూ సినిమాలవాళ్ళకి నాటకాలు చూసి కళాకారులను సినిమాలలోకి తీసుకోవటం అలవాటేనని, తను వాణిశ్రీగారిని చిల్లర కొట్టు చిట్టెమ్మ నాటకం చూసే సినిమాల్లో సెలెక్టు చేసుకున్నానన్నారు.

నాటక ప్రియులకు శుభవార్త
సభలో ఫిల్మ్ నగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ, శ్రీ కాజా సూర్య నారాయణ మాట్లాడుతూ ఇక్కడ ఎవరు ఎన్ని నాటకాలు వేసినా హాలు, కరెంటుతో సహా ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేశారు. సభలో ఇంకా శ్రీయుతులు బలరామయ్య, I.A.S., సినీ డైరెక్టర్లు రాఘవ, పి. చంద్ర శేఖర రెడ్డి, గోరంట్ల రమేష్ పాల్గొన్నారు.

తదనంతరం కల్పన కళా నికేతన్, నర్సరావుపేట వారిచే శ్రీ నాగరాజు గంధం వ్రాసిన శేషార్ధం అనే నాటిక శ్రీ యస్.యం. బాషా దర్శకత్వంలో ప్రదర్శింపబడింది. భార్యా భర్తలు విడిపోయినా పరవాలేదుగానీ తల్లి దండ్రులు విడిపోకూడదు అనే సందేశాన్ని అందించిన ఈ నాటికలో నటీనటులు బాగా రాణించారు.

తరువాత స్యూ స్టార్స్ మోడరన్ ధియేటర్స్, విజయవాడ వారిచే శ్రీ ఎం.ఎస్. చౌదరి రచన, దర్శకత్వంలో అశ్రువులు అనే నాటిక, కళానికేతన్, వీరన్నపాలెం వారిచే నవ్వకండి అనే నాటిక శ్రీ కాటా సుబ్బారావు రచించగా వై.బి. చౌదరి దర్శకత్వంలో ప్రదర్శింపబడ్డాయి.

14-2-2099 శనివారం

సా. 6-00 గం. లకు ఇదే నా తీర్పు చైతన్య కళా స్రవంతి, విశాఖపట్నం వారిచే
రచన కాశీ విశ్వనాధ్ దర్శకత్వం పి. బాలాజీ నాయక్

7-20 గం. లకు ఆన్సర్ సాగరి, చిలకలూరిపేట వారిచే
రచనః భరతుల రామకృష్ణ దర్శకత్వం ఐ. రాజ్ కుమార్

8-40 గం. లకు తెలుగు దొంగలు సవ్యసాచి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాదు వారిచే
రచన, దర్శకత్వంః సమ్మెట గాంధీ


15-2-2009 ఆదివారం

సా. 6-00 గం. లకు జ్వాలా కుసుమం కళావాణి, ఉభయ గోదావరులు వారిచే
రచనః వై. సాయిబాబా, దర్శకత్వంః ఎం. ప్రసాదమూర్తి

7-20 గం. లకు తలుపు విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాదు
రచన ఆకెళ్ళ, దర్శకత్వం బి.యం. రెడ్డి

8-30 గం. లక బహుమతి ప్రదానోత్సవం అందరూ ఆహ్వానితులే

ఈ కార్యక్రమంలో అనేకమంది సినీ కళాకారులు పాల్గొంటారు.

0 comments: