Thursday, June 25, 2009

పొగడపూలు

Thursday, June 25, 2009




పొగడపూలు మీకోసం

నా పొగడ మల్లె పోస్టుకి స్పందన బాగా వచ్చిది. చాలా మందికి ఆ పూలు ఎలా వుంటాయో తెలియలేదు. Z గారు వీలయితే ఫోటోలు పెట్టమన్నారు.

శ్రీమతి మాలా కుమార్ గారు పొగడపూల కొమ్మలు పూలతో సహా సంపాదించి వాళ్ళ కోడలిగారి చేత ఫోటోలు తీయించి పంపించారు. ఆవిడకి, వాళ్ళ కోడలికి ప్రత్యేక కృతజ్ఞతలతో ఆ ఫోటోలు మీ అందరికోసం ఇక్కడ పబ్లిష్ చేస్తున్నాను.

ఇంత చక్కని టాపిక్ ఇచ్చి మరుగు పడి పోతున్న కొన్ని చెట్లని అందరికీ పరిచయం చెయ్యటానిక స్ఫూర్తి శ్రీమతి జ్యోతి వలబోజు గారికి ప్రత్యేక అభినందనలు.






7 comments:

చందా said...

ఇంత త్వరగా పెట్టేస్తారు ఫోటోలు అనుకోలేదు ! ఫొటోస్ పెట్టినందుకు థాంక్స్ లక్ష్మి గారు ! రెండో ఫోటో అంత క్లియర్ గా లేదు గానీ, మొదటిది క్లియర్ గానే ఉండటంతో చూడగలిగాను !

అసలెప్పుడు చూసినట్టు గుర్తు లేదు, ఈ పూలని ! బహుశా మా ముందు తరానికి తెలుసేమో ?

ఏమిటో ఇప్పుడు సంపంగి పూలు కూడా కరువైపోతున్నాయి ! మా ఇంట్లో సంపంగి చెట్టు నెలకో పువ్వు పూస్తుంది, మా స్నేహితులకి సంపంగి పూలంటే ఏంటో తెలీదు ! నాకు పొగడపూలు తెలియనట్టు అన్నమాట !

psmlakshmiblogspotcom said...

Z గారూ,
ఫోటోలు తొందరగా పెట్టటానికి కారణం తోటి బ్లాగరు శ్రీమతి మాలా కుమార్ గారి శ్రధ్ధ. ఆవిడ పంపిన ఫోటోలే నేను పబ్లిష్ చేశాను.
ఈ చెట్లు ఇండియాలో తక్కువవుతున్నా అసలు వున్నాయండీ. వారింటి దగ్గర రోడ్డుమీద వున్న చెట్టు కొమ్మల ఫోటోలే శ్రీమతి మాలా కుమార్ గారు పంపారు.
psmlakshmi

చందా said...

శ్రీమతి మాలా కుమార్ గారికి కూడా నా ధన్యవాదాలు ! ఇక ఈ చెట్టు ఎక్కడ కనిపించినా వదిలే సమస్య లేదు ! :-) వెళ్లి అంటు తెచ్చేసుకోవడమే !

psmlakshmiblogspotcom said...

Z గారూ,
ఇవి అంట్లు రావనుకుంటానండీ. ఆ పూలు కాయలవుతాయి. ముదురు ఆరెంజ్ కలర్ పండ్లవుతాయి. చిన్న నేరేడుపళ్ళ సైజు వుంటాయి. ఆ పండ్లని తినచ్చుకూడా. కొంచెం వగరుగా వుంటాయి. ఆ పండులో ఒక గింజ వుంటుంది. దానిని పాతిపెడితే మొక్క వస్తుంది. బహుశా నర్సరీల్లో మొక్కలు దొరకచ్చు.
psmlakshmi

చందా said...

లక్ష్మి గారు, నాకు మొక్కల గురించి చాలా తక్కువ తెలుసండీ ! నా కంటే, మా ఇంట్లో వాళ్ళకే ఎక్కువ ఇష్టం, మొక్కల పెంపకం ! ఏదో ఒకసారైనా ఉడతా భక్తిగా, ఆశ్చర్యపరిచేద్దాం అని ఆశతో అడిగాను !

మంచి సమాచారం అందజేశారు, ధన్యవాదాలు !

తెలుగుకళ said...

పొగడ పూలు అనటం వినటమే కానీ ఎప్పుడూ చూడలేదు.
భలే ఉన్నాయి. చక్కటి ఆలోచన.
మీ ఆసక్తి కి , అభిరుచికి హాట్సాఫ్...

పరిమళం said...

పిట్టకొంచెం కూత ఘనం అన్నట్టు పూలు చిన్నవైనా మంచి పరిమళం వెదజల్లుతాయి .ఈపూలు నేను చూశాను .దగ్గర్లోని ఓ గుడిలో ఉంటాయి .ఫోటోలు పంపించిన మాలా గారికీ మీకూ థాంక్స్ !