అంటు అనగానే పెద్దవాళ్ళు
చాదస్తంగా అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు అంటారని, అంటు ముట్టుకుంటే చెయ్యి కడుక్కోమంటారని
చిన్నవాళ్ళు విసుక్కుంటూంటారు. పూర్వీకులు
చెప్పినవెప్పుడూ, మన జీవన విధానాలను గుర్తుపెట్టుకని, మన మంచికే చెప్పారు. కాల క్రమేణా వాటికి ఎవరికి తోచిన రంగులు వాళ్ళు
పులిమి భయంకరంగా తయారు చేస్తున్నాము.
అసలు అంటు అంటే ఏమిటో తెలుసా? అంటుకునేది.
తడి పదార్ధాలను ముట్టుకున్నప్పుడు చేతికి అంటుకుంటాయి. అదే చేత్తో ఇంకో వస్తువుని ముట్టుకుంటే, పొరపాటున
వీటిమీదికి చేరిన బాక్టీరీయా ఏమైనా వుంటే దానికీ వ్యాపిస్తుంది. అందుకే అలా ఏదైనా చేతికి అంటుకుంటే
కడుక్కోమన్నారు. ఆ పదార్ధంమీద ఏ
బాక్టీరియా లేకపోయినా, మన చేతులకో, వేళ్ళ గోళ్ళుకో వున్నా ఆ పదార్ధంద్వారా
అన్నింటికీ వ్యాపించవచ్చు. అలాగే ఏ పదార్ధాన్నీ, ముఖ్యంగా తినేవాటిని ఎడమ చేత్తో
పట్టుకోవద్దంటారు. సరిగ్గా శుభ్రం
చేసుకోకపోతే చేతి గోళ్ళల్లో వుండే బాక్టీరియా ప్రమాదకరంగా పరిణమిస్తుందని. పిల్లలికి వచ్చే పోలియోకి ఈ బాక్టీరియా ముఖ్య
కారణం.
ఆలోచిస్తే ఈ అంటులో చాదస్తం
లేదు. సైన్స్ వుంది. మన శరీరం, చేతుల మీద వుండే బాక్టీరియా ఆహార
పదార్ధాలకు పాకకుండా తీసుకునే జాగ్రత్త వుంది.
మరి ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో సగం రోగాలను దూరంగా వుంచినట్లేగా.
(జీ తెలుగు ప్రసారం చేసిన
గోపురం ఆధారంగా)
2 comments:
మనకు ఉన్న ఆచారాల్ని ప్రశ్నించకుండా ఆచరిస్తూ ఉంటె ఎంత బాగుంటుంది.
మనవాళ్ళు అంత గొప్పగా ఆకాలం లో ఎలా అలోచించి పెట్టారో తలుచుకుంటే వారి తెలివితేటలకి నిజంగా ఆశ్చర్య మేస్తుంది. ఇంకా మీకు నమ్మకము లేక పోతే అమెరికా లో ఇప్పుడు ఏ షాపు కు వెళ్ళినా "యాంటి బాక్టిరియాల్ నాప్కిన్స్" ఉంటాయి షాపింగ్ కార్టుల దగ్గర.
నిజమే రావుగారూ
మన పూర్వీకులు అపూర్వ జ్ఞానంతో భావి తరాలకోసం నిర్దేశించిన మార్గదర్శకాలు, మధ్య తరాల చేతిలో తెలిసో తెలియకో కొన్నిచోట్ల పక్కదోవలు పట్టాయేమోననిపిస్తుంది. అందుకే నాకు మంచిది అనిపించింది నలుగురికీ తెలియపరచాలనే తాపత్రయం. ఆంగీకరించటం, అంగీకరించకపోవటం ఎవరి ఇష్టం వారిది.
psmlaklshmi
Post a Comment