Wednesday, April 25, 2012

పిల్లలకి వస ఎప్పుడు పోయాలి

Wednesday, April 25, 2012


పిల్లలకి వస ఎప్పుడు పోయాలి

చిన్నపిల్లలకి వస పోస్తే మంచిదని ఇదివరకువారు పసిపిల్లలకి వస పోసేవారు.  అది ఎందుకు పోయాలో, ఎప్పుడు పోయాలా, ఎలా పోయాలో, ఏ వయసులో పోయాలో సంగతి అటుంచి  అసలు వస అంటే ఏమిటో, దాని ఉపయోగాలేమిటో ఈ కాలం తల్లులకు తెలియచేసే ఉద్దేశ్యమే ఇది.

వస ఏ ఆయుర్వేద మందులు తయారుచేసే పదార్ధాలుండే షాపులోనైనా దొరుకుతుంది.  దీనిని తీసుకొచ్చి గంధం తీసే సాన మీద 2, 3 చుక్కల నీరువేసి ఈ వసకొమ్ముని దానిమీద మూడుసార్లు తిప్పి దానిని పిల్లలకి నాకించాలి.

పిల్లలకి 4 – 6 నెలల మధ్య వస పోస్తే మంచిది.  దీనిని 2, 3 సార్లు పోస్తే చాలు.  వసపొయ్యటం ఎప్పుడుపడితే అప్పుడు చెయ్యకూడదు.  దానికీ  సమయముంది.  ఆదివారంగానీ, బుధవారంగానీ వసపొయ్యాలి.  ఆదివారంనాడుపోస్తే ఆయుష్షు పెరుగుతుందనీ, బుధవారంనాడు పోస్తే మంచి బుధ్ధిమంతులూ, తెలివితేటలుకలవాళ్ళూ అవుతారని అంటారు.

వసవల్ల ఉపయోగాలు  ..  వోకల్ కార్డ్స్ ని శుభ్రపరుస్తుంది.  స్వరం చక్కగా వస్తుంది.  నాలుక మందంపోయి చక్కగా మాట్లాడతారు.  మేధో శక్తి పెంచుతుంది.  మెదడులో వుండే నరాలని ఉత్తేజపరుస్తుంది.  జీర్ణశక్తి పెంచుతుంది.  క్రిమి సంహారిణిగా కూడా పని చేస్తుంది.  పిల్లలు చురుకుగా చక్కగా పెరిగేటట్లు చేస్తుంది.

ఇన్ని ఉపయోగాలున్న వసని మీ బిడ్డలకూ ఇవ్వండి.  అయితే తగు మోతాదులో మాత్రమే ఇవ్వాలనే విషయం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం విన్న తర్వాత)



0 comments: