Saturday, April 18, 2009

కొంటె కోణాలు - 3

Saturday, April 18, 2009
కొంటె కోణాలు – 3
ఆశ నిరాశేనా??
అదొక అద్భుతమైన పరిమళం ద్రవ్యం. మగవారికి ప్రత్యేకం. మార్కెట్ లో విడుదల అయిన వెంటనే ప్రజల అభిమానాన్ని పొందింది. అమ్మకాలు పెరిగాయి. కంపెనీ ఆ పెర్ ఫ్యూమ్ ని ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన ఏకైక పెర్ ఫ్యూమ్ గా చేయాలనుకున్నారు. ఆ బాధ్యత ఒక ఎడ్ వర్టయిజ్ మెంటు కంపెనీ మీద పెట్టారు. వాళ్ళ కంపెనీలోని అత్యంత మేధవులంతా కలిసి కొన్ని ప్రకటనలు రూపొందించారు. అందరూ వాటిని పరిశీలించి, ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఈ ప్రకటనలు రిలీజ్ అయిన వెంటనే తమ పెర్ ఫ్యూమ్ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుబోయే ఏకైక పరిమళమవుతుందని సంతోష పడిపోయారు. అత్యంత ఆడంబరంగా ప్రకటనలు విడుదల చేశారు. అందరూ ఫలితాల కోసం ఎదురు చూడసాగారు. కానీ వారు ఆశించినట్లు జరగలేదు. అమ్మకాలు పెరగకపోగా రోజు రోజుకీ తగ్గసాగాయి. చివరికి పూర్తిగా పడిపోయాయి. కారణాలు???

కొంటె కోణం

ఆ ప్రకటనలు చూసిన ఆడవారు తమ కొడుకులు, సోదరులు, ప్రియులు, భర్తలు ఆ పరిమళం వాడకుండా జాగ్రత్త పడ్డారు.....ప్రకటనలలోలాగా పొరపాటున ప్రపంచంలోని ఆడవారంతా ఆ పరిమళం వాడిన వ్యక్తుల వెనక పడితే!!!


1 comments:

ఎస్పీ జగదీష్ said...

హ. హా.. హా. చాలా బాగుంది. వెతకాలే గాని ప్రతీ విషయం లోనూ చక్కటి హాస్యాన్ని వెతుక్కోవచ్చు. మీ నుంచి ఇంకా ఇలాంటి టపాలకోసం ఎదురుచూస్తూంటాము.