అక్టోబర్ 1 వ తారీకు సీనియర్ సిటిజన్స్ డే ట. ఈటీవీ-2 సఖి కోసం ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాము, తప్పకుండా రండి అని డైరెక్టరు
శ్రీమతి ఐ..వి. రమాదేవి గారి ఆహ్వానం మేరకు 20-9-10 న కార్ఖానా లోని శ్రీమతి
లక్ష్మిగారింటికి వెళ్ళాము నేనూ, శ్రీమతి మాలా కుమార్. రమాదేవిగారి ఉద్దేశ్యం ప్రస్తుతం సీనియర్
సిటిజన్స్ చాలా అర్ధవంతంగా జీవితాన్ని గడుపుతున్నారని, తమ తీరిక సమయాన్ని చక్కగా
వినియోగించుకుంటున్నారనీ, యువత వీరిని చూసి స్ఫూర్తి పొందాలని.
మేము వెళ్ళేసరికి అక్కడ పదిమందిదాకా మహిళలున్నారు. అందరూ ఈ వయసులో ఉత్సాహంగా తమ జీవితాలనీ,
సమయాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నవాళ్ళే...అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో
పాల్గొన్నారు. నేను, మాలాకుమార్, రమాదేవి
తప్ప మిగతా అంతా మాకు కొత్త. అయినా
ఎంతో ఆత్మీయుల్లా పరస్పరం పరిచయాలు,
అడ్రసులు, ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకోవటాలు,
తమ తమ కార్యక్రమాల గురించి చర్చలు.
ఉదయం 10-30 కి
వెళ్తే మధ్యాహ్నం 1 గం. దాకా సమావేశం, టీవీ కార్యక్రమం చిత్రీకరణ అయ్యాక సమీపంలోని
శ్రీమతి మాలాకుమార్ ఇంటికి వెళ్ళి తిరిగి ఇళ్ళకి చేరాము.
ఈ కార్యక్రమం అక్టోబర్ 1 వ తారీకు మధ్యాహ్నం ఈటీవీ
2 ప్రసారం చేసే సఖి కార్యక్రమం లో వస్తుంది.
మధ్యాహ్నం 2 గం. ల నుంచీ 3 గం. ల దాకా ఆ కార్యక్రమం ప్రసారమవుతుంది. అందులో ఒక పది నిముషాలు మా కార్యక్రమం
వస్తుంది. అవకాశం వున్నవారు తప్పక చూడండి.
ఈ కార్యక్రమానికి శ్రీమతి హైమా శ్రీ గారు ఏంకర్ గా వ్యవహరించి తన ప్రతిభని కనబరిచారు.
డైరెక్టర్ శ్రీమతి రమాదేవి, యాంకర్ శ్రీమతి హైమ శ్రీ తో పాల్గొన్న బృందం
షూటింగ్
డైరెక్షన్ చేస్తూ శ్రీమతి రమాదేవి
షూట్ చేస్తూ కెమేరామేన్ శ్రీ రమేష్
5 comments:
బాగుంది. అభినందనలు
Congratulations to both of you...
Very nice. Congrats.
congratulations!
congratulations to both of you లక్ష్మి garu.... tappakunda chustaamu..
Post a Comment