జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికీ వాటికి
సంబంధించిన ధాన్యాలున్నాయి. ఎవరికైనా జాతక
చక్రంలో దోషాలేవైనా వున్నా, గ్రహ దోషాలవల్ల అనారోగ్యంపాలయినా, ఆ గ్రహాలకి సంబంధించిన ధాన్యాలను దానం చెయ్యటం,
తినటం వల్ల ఆ దోషాలు పోతాయని, స్వస్ధత చేకూరుతుందనీ అంటారు. అవేమిటో చూద్దామా
రవి -- గోధుమలు
చంద్రుడు -- బియ్యం
కుజుడు -- కందులు
బుధుడు -- పెసలు
గురువు -- శనగలు
శుక్రుడు -- బొబ్బర్లు
శని -- నువ్వులు
రాహువు -- మినుములు
కేతువు -- ఉలవలు
5 comments:
వచ్చే 2-3వారాలకు :( గోధుమలు-నువ్వులుతో చేసే వంటలు ఏమన్నా వుంటే చెప్పండి, ప్లీజ్
గోధుమలతో చపాతీలు, పూరీలు, వగైరాలు, నువ్వులతో చిక్కీ, నువ్వుల వుండలు, నువ్వుల పొడి, ఇంకా కొంచెం వేయించి పొడి చేసుకుని చాలా రకాల కూరలలో వేసుకోవచ్చు. ఇంతకన్నా వివరాలు కావాలంటే వంటల బ్లాగులు చూడండి. ఎందుకంటే నేను పాక శాస్త్ర ప్రవీణురాలినికాదు. sorry snkr garu
psmlakshmi
ధన్యవాదాలండి. వేరు వేరుగా తినవచ్చనే ఐడియానే రాలేదు. కలిపి చేసేవే తినాలనుకున్నా. ఎవరో చెబితే నువ్వులనూనెతో చపాతీలు తింటున్నాము, ఓహ్ చాలా బాగున్నాయి.
మీరు సీరియస్ గా అంటున్నారో, సరదాకి అంటున్నారో తెలియలేదు. సీరియస్ గా అయితే గోధుమ పిండితో ఏమి చేసుకున్నా దానిలో నువ్వులుగానీ, నువ్వుల పొడిగానీ వేసుకోవచ్చు. మీ పర్పస్ సర్వ్ అవుతుంది, రుచి కూడా.
psmlakshmi
Good information psmlakshmi garu😊🙏🎄
Post a Comment