ఇదేం ప్రశ్న?
ఇప్పుడు ఎక్కడ చూసినా కనబడుతున్నదే అదికదా అంటారా? నిజమే మరి.
జడవేసుకొమ్మంటే అమ్మాయిలకి పెద్ద అవమానం.
పల్లెటూరి గబ్బిలాయిలాగా ఏమిటంటారు.
శాస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంధాలు జుట్టు విరబోసుకోకూడదంటున్నాయి. మనకి కనిపించని ఎన్నో భూత ప్రేత పిశాచాలు,
దుష్టశక్తులు జుట్టుని ఆవహించే అవకాశంవుంది.
దానితో అలా విరబోసుకుని తిరిగేవారిలో, వారికే తెలియని అనేక మార్పులు
సంభవిస్తాయి. ముఖ్యంగా సాయంసమయంలో ఎన్నో
దుష్ట శక్తులు ఆవహించే అవకాశం వుంది కనుక అసలు విరబోసుకుని వుండకూడదు.
పురాణాలలో
కూడా శపధం చేసినవారు, భర్త చనిపోయిన వారు, దుఃఖసాగరంలో మునిగినవారుఅలా
విరబోసుకున్నట్లు చెప్పబడింది. ఉదాహరణకి
ద్రౌపది, కైక వగైరా.
సైన్సు ప్రకారంకూడా అన్ని సమయాలలో జుట్టు
విరబోసుకోకూడదు. డాక్టర్లు ఆపరేషన్ చేసే
సమయంలో జుట్టు ముడి వేసుకుని దాన్ని దేనితోనన్నా బంధించాలి. ఆపరేషన్ ధియేటర్ లో జుట్టు పూర్తిగా కవర్
చేసుకుని వుండాలి. జుట్టుకి రాలే గుణం
వుంది. ఆపరేషన్ ధియేటర్ లో జుట్టు రాలితే
ఒక్కోసారి రోగికి ప్రాణాపాయంకూడా జరగవచ్చు.
వంటచేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు తినే పదార్ధాలలో
పడితే చాలా ప్రమాదం. అలాగే దేవాలయాలలో పడితే వాటిని అపవిత్రం
చేసినవాళ్ళమవుతాము. మహా దోషం.
పూర్వకాలంలో మనషుల స్ధాయినిబట్టి, ఎన్నోరకాల
కేశాలంకరణలు చేసేవాళ్ళు. మరి ఇప్పటి మన
హైర్ స్టైలిస్ట్స్ కి అలాంటి విద్యలేమీ తెలియవా, పాపం మనవాళ్ళు ఏ సందర్భానికైనా
విరబోసుకోవటమే ఫ్యాషన్ అనుకుంటున్నారు
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)