Monday, December 1, 2008

హిందుత్వమే అసలైన సెక్యులరిజం

Monday, December 1, 2008
హిందుత్వమే అసలైన సెక్యులరిజం

దివ్యధాత్రి, అక్టోబరు 2008 సంచికలో ప్రచురింపబడిన శ్రీ కార్తికేయ గారి రచన మీ అందరికోసం...............

ఘర్షణలు తలెత్తితే, హింస పెచ్చరిల్లి పరిస్ధితి ప్రభుత్వాలూ, పోలీసుల చేయి జారిపోతే, మత భేదం, వర్గభేదం లేకుండా మనందరమూ సైన్యాన్ని రంగంలోకి దింపమని కోరుకుంటాం. సైన్యం నిజాయితీపైన నిష్పాక్షికత పైన ఎవరికీ సందేహంలేదు.

పెను తుఫానులూ, ప్రకృతి బీభత్సాలూ మనల్ని చుట్టు ముట్టితే రక్షించేందుకు సైన్యం రావాలని కోరుకుంటాం. సైన్యంపై మన నమ్మకం అలాంటిది.

సైన్యం స్ధైర్యంమీద సందేహం లేదు. సైన్యం సామర్ధ్యంమీద సందేహం లేదు. సైన్యం సాహసం మీద సందేహం లేదు. సైన్యం సెక్యులరిజమ్ మీద అంతకన్నా సందేహం లేదు.

సైన్యం సెక్యులరిజమ్ గురించి కధలు కధలుగా చెప్పుకుంటారు. ప్రపంచం యావత్తూ భారతీయ సైన్యాల లౌకిక విలువలను ఆశ్చర్యంతో చూస్తుంది, ఆభినందిస్తుంది.

దేశ విభజన సమయంలో లక్షలాది హిందువులు శరణార్ధులై ప్రాణాలరచేత పుచ్చుకొని వస్తున్న సమయంలోనూ మన జవాన్లు అబ్బురపరిచే సంయమనాన్ని ప్రదర్శించారు.

కార్గిల్ యుధ్ధంలో మన జవాన్లు పట్టుబడితే పాకిస్తానీలు కళ్ళు ఊడబెరికి, మర్మాంగాలను కోసి క్రౌర్యానికి పరాకాష్ఠగా నిలిచిన సమయంలోనూ, చనిపోయిన పాకిస్తానీల భౌతిక కాయాలకు గౌరవంతో, వారి మత విధులను అనుసరించి అంతిమ సంస్కారాలను చేయించారు మన సైనికులు.

మన సైనికుల స్ధైర్య, సాహస, సామర్ధాలకూ, సెక్యులరిజానికీ పునాది ఎక్కడ ఉంది? వారి ధీరోదాత్తత ఏ పేరణా స్రోతస్సునుంచి ధారగా జాలువారుతోంది?

హిందూ భావనలలో నుంచి! నిస్సందేహంగా హిందూ జీవన విలువల్లో నుంచే!

ఆశ్చర్యంగా ఉందా? అయితే ఒక్కసారి మన సైనికులు, వారి వివిధ రెజిమెంట్ల రణ నినాదాలను పరిశీలించండి. అర్ధమైపోతుంది.

వీరత్వానికి మారుపేరైన మరాఠా రెజిమెంట్ వారి రణనాదం ‘హరహర మహాదేవ్’ .

పరాక్రమానికి పట్టుకొమ్మలాంటి గూర్ఖా రెజిమెంట్, సైనికుల రణనాదం ‘ జై మహాకాళీ – ఆయో గూర్ఖాలీ’ – అంటే ‘ జై మహాకాళీ – గూర్ఖావీరులు వస్తున్నారు’ అని అర్ధం. అసలు గూర్ఖా అన్నపదం – గోరఖ్ – అంటే గోరక్ష నుంచి పుట్టింది.

19 బెటాలియన్లతో కూడిన రాజపుటానా రైఫిల్స్ వారు యుధ్ధంలో గుండెనిండా ఊపిరిపీల్చుకొని, ఉచ్చస్వరంతో చేసే నినాదం – ‘రాజా రామచంద్రకీ జై’. 17 బెటాలియన్ల బలగంతో నిలిచే బీహార్ రెజిమెంట్ నినాదం’ జై బజరంగ బలి’ . 18 బెటాలియన్ల డోగ్రా రెజిమెంట్ ‘జ్వాలామాతాకీ జై’ అంటూ యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఒకటైన జ్వాలాముఖిని స్మరిస్తారు.

కుమాయూ రెజిమెంట్ ‘ కాళికా మాతాకీ జయ్’ అంటే, నాగా రెజిమెంట్ ‘ జై దుర్గే నాగా’ అంటారు.

రాజపుట్ రెజిమెంట్ ‘బోల్ బజరంగ బలీకీ జై’ అని నినదిస్తే, మహార్ రెజిమెంట్ ‘బోలో హిందుస్తాన్ కీజై’ (బోలో ఇండియాకీ జై కాదు సుమా) అని గర్జిస్తారు.

జమ్మూ కాశ్మీర్ రెజిమెంట్ (మొత్తం 19 బెటాలియన్లు) ‘ దుర్గామాతాకీ జై’ అంటే జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ సైనికులు ‘ భారతమాతాకీ జై’ అంటారు. ఇక మొక్కవోని ధైర్యసాహసాలకూ, తెగింపునకూ మారుపేరైన జాట్ రెజిమెంట్ ‘జాట్ బలవాన్ – జై భగవాన్’ అంటారు.

గ్రెనెడియర్ లు ‘ సర్వదాశక్తిశాలి’ కి జై కొడితే, పంజాబ్ రెజిమెంట్ ‘ బోలే సో నిహాల్ – సత్ శ్రీ అకల్ ‘ అని విజయధ్వానం చేస్తారు.


ఇక గఢ్ వాలీ రెజిమెంట్ సైనికులు గొంతెత్తి ఉత్తరాంచల్ లోని హిమధామాల నడుమ విరాజిల్లే బదరీనాధుని నామాన్ని ఉచ్చరిస్తారు. 18 బెటాలుయన్లతో కూటిన ఈ రెజిమెంట్ రణనినాదం ‘బద్రీవిశాల్ లాల్ కీ జై’ . గఢ్ వాల్ రెజిమంట్ సైనికులున్నచోట బదరీనాధుని మందిరం ఉండాల్సిందే.

2002 నాటికి మన సైన్యంలో 9,80,000 మంది రెగ్యులర్ సైనికులూ, 8,00,000 మంది రిజర్వస్టులూ ఉన్నారు. వీరందరి గొంతుల్లోనుంచి వెలువడే యుధ్ధ నినాదాలన్నీ హైందవంతో అవినాభావంగా ముడిపడ్డవే. వీరత్వాన్ని ఆవాహన చేయటమే కాక, విలువలను వర్ధిల్ల చేయటమే ఈ నినాదాల లక్ష్యం.

పైగా కొరియన్ యుధ్ధానంతరం ప్రపంచవ్యాప్తంగా సైనికుల మనోదార్ఢాన్ని పెంపొందించే దిశగా జరిగిన విస్తృత పరిశోధనలన్నిటిలోనూ ధార్మిక విశ్వాసప్రతీకల ద్వారా సైనికుల్లోమానసిక ఒత్తిడులను ఎదుర్కొనే స్ధైర్యాన్ని పెంచవచ్చునని, శత్రువు చేసే బ్రయిన్ వాషింగ్ ని తట్టుకోవచ్చని తేలింది.

హిందుత్వాన్ని మతతత్వంగా, ఛాందసంగా, మతోన్మాదంగా చూసే మాయపొర మన రాజకీయులకూ, మేధావులనబడే వారికీ కమ్మి ఉండవచ్చుగాక, మన సైన్యానికి కమ్మతేదు. ఎందుకంటే హిందుత్వమే సిసలైన సెక్యులరిజం కనుక

7 comments:

durgeswara said...

himdutvam lekumte ee deshameppudo mukkalu chekkalugaa vidivadi paraayi paalanalaloki vellede malli' kanukane daanini dvamsham cheyataaniki prayatnaalu teevramayyaayi.

latha said...

Wonderful. Good to know all the details.

nomi said...

Good info.
I worry, if our so called secularist feloows know about the slogans of our army betallians, they may say that all these slogans are praising hindu Gods and need to be banned.

విరజాజి said...

చాలా బాగా చెప్పారండీ..! హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడమే ఈనాటి సెక్యులరిజం అయిపోయింది. మన దేశమే హిందూస్థాన్ అయినపుడు... హిందుత్వాన్ని దూరం చేసుకుని మనం ఎందుకు జీవించాలి? భారత మాత అందరికీ అమ్మే. ఆమెకి ముస్లిములూ, క్రిస్టియనులూ కూడా హిందువులతో సమానమైన బిడ్డలే.... ఈ దేశం మన రాజకీయ నాయకుల కుహనా లౌకిక వాదం నించి బయటపడితే, అసలైన లౌకిక హిందుత్వ జీవనం ప్రపంచంలో అందరికీ అర్ధం అవుతుంది.

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

"హిందుత్వమే అసలైన సెక్యులరిజం"
Excellent post...!!

Anonymous said...

vey good information. thanks.

Vasuki said...

ఇప్పుడే మీ బ్లాగ్ టపాలన్నీ చదువుతున్నాను. బాగున్నాయి. ముఖ్యంగా ఈ టపా బాగుంది. సైన్యం యొక్క నినాదం గురించి ఇప్పటి వరకు తెలియదు. జై భరతమాత అని మాత్రమే అంటారేమో అనుకొనేవాడ్ని. మంచి విషయం తెలియజేసారు. ధన్యవాదాలు.

శ్రీవాసుకి
http://srivasuki.wordpress.com