జ్యోతిష్య శాస్త్రం
ప్రకారం, పరాశరుడి వింశోత్తరి ప్రకారం, మనిషి ఆయుః ప్రమాణం 120 సంవత్లరాలు. నవ గ్రహాలకివున్న దశలన్నీ కలిపితే 120
సంవత్సరాలు. దీని ఆధారంగా మనిషి ఆయుష్షు ప్రమాణం
నిర్ణయించి వుండవచ్చు. మానవుడు పూర్ణాయుర్దాయంతో
మృత్యుదోషాలు లేకుండా శాంతిగా బ్రతకాలనే ఉద్దేశ్యంతో ఈ ఉత్సవాలు జరుపుతారు.
బ్రతికున్నన్నాళ్లూ
అందరూ ఆరోగ్యంగా వుండాలనే అనుకుంటారు.
కానీ మనిషికి 59 సంవత్సరాలు పూర్తయి, 60 వ సంవత్సరం రాంగానే ఉగ్రరధ అనే మృత్యుపీడ పీడిస్తుందట. అందుకే 60 సంవత్సరాలు పూర్తికాగానే షష్టిపూర్తి
చేస్తారు (ఆ మృత్యు పీడనుంచి తప్పించుకున్నందుకా)
అలాగే 70 వ సంవత్సరం ప్రారంభం కాంగానే భీమరధ అనే మృత్యు పీడ. వీటిబారిన పడకుండా ఆయురారోగ్యాలతో వుండాలని
శాంతి జరుపుతారు. 70 వ
సంవత్సరాలకు చేసే ఈ శాంతి ప్రక్రియ గురించి సమాజంలో ఎక్కువమందికి తెలియదు. చాలా తక్కువమంది చేసుకుంటారు ఈ ఉత్సవం. 84 సంవత్సరాల 3 నెలలు పూర్తి చేసుకున్నవారికి
సహస్ర చంద్ర దర్శనం అని (వారు వెయ్యి పౌర్ణమిలు చూశారని) చాలా పెద్ద ఎత్తులో శాంతి
ఉత్సవం చేస్తారు. ఈ ఉత్సవాలన్నీకూడా
మనిషికి ఆయా వయసుల్లో వచ్చే మృత్యుపీడలు
పోయి ఆరోగ్యంగా వుండాలనే ఉద్దేశ్యంతో చేసేవి.
ఇంకా కొన్ని
ఉత్సవాలు వున్నాయి. మనిషి పోయాక కూడా
జయంతి, వర్ధంతి, శత జయంతోత్సవం లాంటివి.
ఇవి సమాజానికి గొప్ప సేవలు చేసినవారిని గుర్తు చేసుకోవటానికిగానీ, వారి
వారి రంగాలలో గొప్ప నైపుణ్యాన్ని సంపాదించి తద్వారా సమాజ శ్రేయస్సుకు దోహద
పడ్డవారిని గుర్తుచేసుకోవటానికిగానీ
ప్రజలు చేసే ఉత్సవాలు ఇవి. ఈ
ఉత్సవాలు వారు సమాజానికి చేసిన సేవలు గుర్తుచేసుకుని వారిని భక్తిపూర్వకంగా
సంస్మరిస్తూ చేసే ఉత్సవాలు. వీటివల్ల ఆ
మహనీయులు సాధించిన విజయాలు గుర్తుచేసుకుని అందరూ ప్రేరణ పొందవచ్చు.
మరి కొన్ని
ఉత్సవాలు...అవేనండీ...సినిమా శత దినోత్సవాలు, వజ్రోత్సవాలు వగైరా. మరి ఇవి ఎందుకు చేస్తారు? ఒక సినిమా
మొదలు పెట్టిన దగ్గరనుంచీ పూర్తయ్యేదాకా ఎంతోమంది సమిష్టి కృషి, ఇంకెందరో
సహకారం, అందులో పని చేస్తున్నవారందరి
మధ్యా సఖ్యతా అవసరమవుతాయి. అలాగే ఆ సినిమా
విజయవంతమవటానికి ప్రజల ఆదరణ చాలా అవసరం.
ఇలా ఎందరో సమిష్టి కృషి, ఆదరణ, ప్రోత్సాహం కారణంగా విజయవంతమయిన ఆ సినిమా శత
దినోత్సవం వగైరా ఉత్సవాలమూలంగా వారి ఉత్సాహం ఇంకా పెరిగి ఇంకా ఇలాంటి మంచి
చిత్రాలు తియ్యటానికి బలాన్ని
చేకూర్చుకుంటారు.
ఒక విధంగా ఈ
ఉత్సవాలు టానిక్కులలాంటివి.
(జీ తెలుగు ప్రసారం
చేసిన గోపురం ఆధారంగా)
1 comments:
70 సంవత్సరాలు నిండినప్పుడు చేసే ఉత్సవం గురిచి ఎప్పుడూ వినలేదండి . షష్టి పూర్తి , సహస్ర చంద్ర దర్శనం ఉత్సవాలు చూసాను .
Post a Comment