Saturday, January 8, 2011

ఒకసారి చేసిన పూజ, జపం వగైరాలవల్ల లక్ష రెట్ల ఫలితం వస్తుందా? (12-1-2011 విశేషం)

Saturday, January 8, 2011


 ఇదేం ప్రశ్న  చేసిన వాళ్ళకి చేసినంత అంటారుకానీ ఒకటికి లక్షరెట్లు అని ఎవరూ అనరుకదా.  మరి ఒక సారి చేసిన పూజ, జపం వగైరాలవల్ల లక్ష రెట్ల లాభం ఎలా వస్తుంది?   ఏదో, మాస శివరాత్రి, ఉత్తరాయణ పుణ్యకాలం, చంద్ర గ్రహణం, సూర్య గ్రహణం, వగైరా పరవడి రోజుల్లో చేసే పూజలు, జపాలు అత్యధిక ఫలితాన్నిస్తాయంటారుకానీ, మరీ ఒకటికి లక్షరెట్లంటే అతిశయోక్తికాదా?

కానేకాదంటున్నారు నిర్ణయసింధు దర్శనకారులు.  వారి ప్రకారం పుష్య శుధ్ధ అష్టమి రోజు చేసే పూజలు, జపాలు వగైరా అత్యధిక ఫలాన్నిస్తాయిట.  ఆ పుష్య శుధ్ధ అష్టమి బుధవారం వస్తే ఆ పూజలు వగైరాలు మిగతా ఏ రోజు చేసే పూజలకన్నా  లక్షరెట్లు అధిక ఫలితాన్నిస్తాయట.  ఇదేదో సూక్ష్మంలో మోక్షంలాగా వుందికదా.

ఇంకో విశేషం తెలుసా?  ఈ నెల 12 వ తారీకు అలాంటి రోజు వచ్చింది.  అంటే 12-1-2011 న, పుష్యమాసంలో శుధ్ధ అష్టమి,  బుధవారం రోజున వచ్చింది. 

మన శాస్త్రాలు ఏ దానం చేస్తే ఏ ఫలితం వుంటుంది, ఏ మంత్రం జపిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది వగైరాలన్నీ తెలియచెప్పాయి.  ఎవరికైనా పెళ్ళికావాలని చేసే జపాలు, హోమాలతో వారికి త్వరగా వివాహం జరుగుతుంది.  సంతానంకోసం సంతాన వేణుగోపాలస్వామి మంత్రం, వగైరా వున్నాయి.  రోగాలతో బాధపడేవారు ఆయారోగాలు వుపశమించటానికి నిర్దేశించబడిన మంత్రాలు జపిస్తే ఫలితం వుంటుంది.  ఋణబాధలు, అనేక అప్పులతో అవస్తలుపడేవాళ్ళు ఋణ విమోచన స్తోత్రం చదువుకోవటం, దానికి  చెప్పబడిన  దానాలు, శాంతులు  చేయిస్తే ఫలితముంటుంది.  

ఎవరైనా ఏదైనా ఫలితాన్ని సత్వరమే పొందాలనుకుంటే ఆయా బాధలకి ఎలాంటి పరిహారాలు చెప్పబడ్డయో వాటిని ఇలాంటి ప్రత్యేకమైన రోజు చేస్తే విశేష ఫలితాలు, తొందరగా పొందవచ్చు. 

ఆసక్తి వున్నవాళ్ళు  వారికే  దోషాలు లోకపోయినా ఆ రోజు ప్రశాంతంగా  కొంచెం సేపయినా భగవన్నామస్మరణ చేస్తే మంచిదికదా. 

మరచిపోకండి  పుష్య  శుధ్ధ అష్టమి, బుధవారంనాడు ఈ ఏడాది జనవరి 12 వ తారీకు వచ్చింది.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



1 comments:

astrojoyd said...

మూడగ్నులు మీకు తెలిసిఉంటాయి,వాటిల్లో ప్రుద్హ్వికీ చెందిన అగ్ని మార్గశిర,పుష్య మాసాల్లో భూమి మీద సంచరిస్త్తాడు.ఈ సమయంలో చేసే ఎటువంటి చిన్న పున్యకార్యమైన కోటిరెట్ల ఫల్లాన్ని ఇవ్వడమేకాదు,మరణం తర్వాత అగ్నిలోక౦లో చోటును కల్పిస్త్తుంది[అగ్నిపురాణం]కేవలం అష్టమి/బుధవారంతో పనిలేదు.