క్రేజీ యూత్
ప్రేమ యాత్రలకు బృందావనమూ నందనవనమూ ఏలనో....అప్పుడెప్పుడో భార్యా భర్తలు పాడుకున్న పాటను ఇప్పటికీ ఆ బాపతువాళ్ళే పాడుకుంటుంటే ఆ పాత మధురాలని తలచుకుని మురిసిపోయేవాళ్ళెంతమందోకదా.
కానీ ఇప్పుడు యూత్ లో ఇంకో హల్ చల్ మొదలయిందండీ. మా ముందు తరాల వాళ్ళకి అస్సలు బుఱ్ఱలేదు..అన్నీ ఓల్డ్ ధాట్స్..పాడుకున్న పాటలే పాడుకుంటూ వుంటారు..మేము చూడండి, ఏ సమయంలోనైనా ఎంత జాలీగా వుంటామో. మాడిపోయిన మూడ్స్ ఎలా మార్చేసుకుంటామో అని యాడ్స్ ద్వారా చెప్పేస్తున్నారు. నిన్ననే టీవీలో ఈ యాడ్ చూశానండీ.
గోవా వెళ్ళాల్సిన ఫ్రెండ్స్ గ్రూప్ ఫ్లైట్ మూడు గంటలు డిలే అవుతుంది. ఫ్లైట్ డిలే వల్ల గోవాకెళ్ళటానికయ్యే ఆలస్యాన్ని భరించలేక అర్జంటుగా గోవా సముద్రతీరాల్లో సేద తీరాలని ఆరాట పడేవాళ్ళు కొందరయితే, రాగాలు తీసే రాలుగాయిలు కొందరు. పాపం..తెలివైన అమ్మాయిలు ఏం చేస్తారు? ఏం చేస్తారు??!! స్నేహితుల కోర్కెలు తీర్చక చస్తారా!? వాళ్ళ తెలివితేటలుపయోగించి ఆందర్నీ మెస్మరైజ్ చేస్తారు. ఎలాగంటారా? ఫలానా కంపెనీవారి డియోడరెంట్ స్ప్రే చేసుకుని ఆ వాసన అందరికీ తగిలేలా ఎగిరితేసరి..మీతోబాటు అందరూ గోవా సముద్ర తీరాల్లోవున్నట్లే ఫీలయిపోతారు. కాలేదంటారా వెళ్ళి ఆ కంపెనీ వాళ్ళనే అడగండి...డియోడరెంట్ లో మార్పులు చేర్పులు చేసుకుంటారేమో.
కొంటె కోణం
కడుపే కైలాసం..ఇల్లే వైకుంఠం, ప్రేమే పరమార్ధం ఇలాంటివేవో విన్నాముగానీ, డియోడరంట్లే గోవా సముద్ర తీరాలని ఎక్కడా వినలేదండీ అంటారా. అందులోనూ అసలే రిసెషన్ రోజులు..ఇవి స్ప్రే చేసుకుని ఎక్కడివాళ్ళు అక్కడే వుంటే పర్యాటక రంగం ఏమయిపోతుందా అని దిగులు పడుతున్నారా? అంత సీనుందంటారా!???
5 comments:
హ హ హ మన వాళ్ళు మరీ ఎక్కడికో వెళ్ళి పోతున్నారు..
మరీ ఈ మద్య ఈ ఆడ్ లు చిరాకు పుట్టిస్తున్నాయి.
ఫేర్ అండ్ లవ్ లీ వాడితేనే పెళ్ళైతుందని, డిటర్జెంట్ తో వుతుకుతేనే ఏర్ హోస్టెస్ వుద్యొగం వస్తుందని .
తీసేవాడికి చూసేవాడు లోకువ !
భావనా, మాలా
స్పందనకు ధ్యాంక్స్
psmlakshmi
ఆవును . క్రియేటివిటీ అంటూ చెత్త కాన్సెప్టులతో మన బుర్రలు తినటమే కాకుండా కుర్రకారుని తప్పుదోవ పట్టిస్తున్నారు. యాడ్స్ కి పనిచేసే సెన్సార్ బోర్డు ఒకటి ఉంటే బాగుండు.
"Creativity" in media.. has crossed its borders long time ago.. and we have no other go other than watching, enjoying, and laughing at that impossible practicality in our practical lives.. :D
Post a Comment