Friday, June 25, 2010

................................ అంతరంగ తరంగాలు: నా పోస్టులో శ్రీ జయదేవ్ గారి ఆసక్తికర వ్యాఖ్యలు

Friday, June 25, 2010
................................ అంతరంగ తరంగాలు: నా పోస్టులో శ్రీ జయదేవ్ గారి ఆసక్తికర వ్యాఖ్యలు

http://3psmlakshmi.blogspot.com/2010/06/25/blog-post_22.html

0 comments

నా పోస్టులో శ్రీ జయదేవ్ గారి ఆసక్తికర వ్యాఖ్యలు

దీనికి ముందు నేను ప్రచురించిన పోస్టు పూర్వకాలంలో పిల్లల బొడ్డుతాడు దాచిపెట్టేవాళ్ళు నిజమేనా అన్నదానిమీద శ్రీ జయదేవ్, చెన్నై వ్రాసిన కామెంట్స్ ఆసక్తికరంగా వున్నాయి.  నాకు లింకు ఇవ్వటం రాలేదు.  దీనికి ముందు పోస్టు చూడండి.

3 comments

Tuesday, June 22, 2010

పురాతన కాలంలో పిల్లల బొడ్డు తాడు దాచి పెట్టేవాళ్ళు. నిజమేనా?

Tuesday, June 22, 2010



అతి ప్రాచీన కాలంలో కూడా పిల్లల బొడ్డుతాడుని దాచి పెట్టేవాళ్ళు.  కారణాలు మాత్రం ఎవరికీ తెలియవు.  చెప్పగలిగిన పెద్దవాళ్ళు కనిపించలేదు.  పూర్వ కాలంలో అలా ఎందుకు చేసేవాళ్ళో తెలియదు.  అందుకేనేమో ఆ తర్వాత మూఢ నమ్మకాలు ప్రబలాయి.  పిల్లల్లేనివాళ్ళు ఈ బొడ్డు తాడు మింగితే వారికి సంతానం కలుగుతుందని కొందరు సంతానం కోరి దీనిని మింగేవాళ్ళు.  కొందరు దీనిని తాయత్తులలో వేయించి పిల్లలకి కట్టేవాళ్ళు.

అనేక పరిశోధనల తర్వాత ఈ మధ్య బొడ్డు తాడు విలువను గుర్తించి వాటిని దాచి పెట్టటానికి ఒక బేంక్ పెట్టారు.  దీనిలో 40 సంవత్సరాల వరకూ బొడ్డుతాడుని దాచిపెట్టవచ్చు.  అ.యితే ఇప్పుడు మనకు కారణాలు తెలుసు.  ఆధునిక పరిశోధనలలో తేలింది ఏమిటంటే, బొడ్డు తాడులో వున్న మూల కణాల సహకారంతో ఆ వ్యక్తికి భవిష్యత్ లో ఏదైనా పైద్ద వ్యాధి వచ్చినప్పుడు వైద్య చికిత్స చెయ్యవచ్చు, దానితో అద్భుతమైన ఫలితాలు రాబట్టచ్చని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. 

పూర్వకాలంలో (అప్పుడు మన దగ్గర కేవలం ఆయుర్వేద వైద్యం మాత్రమే వుండేది) మన పెద్దలు, మన వైద్యులు ఎంత శాస్త్ర జ్ఞానాన్ని కలిగి వున్నారో తెలుస్తోంది.  బహుశా వాళ్ళు ఈ వైద్యం చేసేవాళ్ళేమో.  అయితే మనకి ఆధారాలు లేవు.

(జీ తెలుగులో ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



8 comments

Monday, June 21, 2010

బిడ్డ పుట్టిన తర్వాత జాతకం ఎప్పుడు వేయించాలి?

Monday, June 21, 2010



ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం.  కొందరు అనేక అపోహలతో బిడ్డలకి 12 ఏళ్ళదాకా బాలారిష్టాలుంటాయి,  అందుకే 12 ఏళ్ళు దాటితేగానీ జాతకం వేయించకూడదంటారు.  కొందరు బిడ్డ పుట్టగానేనో, పురిటి స్నానం కాగానేనో,  లేదా వీలయినంత తొందరగా వేయిస్తారు. 

బిడ్డ పుట్టిన తర్వాత 12 సంవత్సరాల వరకూ బాలారిష్టాలుంటాయంటారు.  నిజమే.  మరి 12 సంవత్సరాలదాకా జాతకం వేయించకపోతే ఏమైనా గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు వుంటే శాంతులు ఎప్పుడు చేయిస్తారు.  అఫ్ కోర్స్ ఇవ్వన్నీ నమ్మకాలున్నవాళ్ళకేననుకోండి.  కొన్ని సార్లు జన్మ నక్షత్రం బాగా లేదని శాంతి చేయిస్తారు. 

అంతేకాదు.  బిడ్డకి 12 సంవత్సరాలు వచ్చేదాకా ఏ చెడ్డ పని చేసినా దాని బాధ్యత తల్లిదండ్రులదే.  అందుకే బిడ్డ పుట్టిన తర్వాత వీలయినంత త్వరలో జాతకం వేయిస్తే, ఏవైనా గ్రహ శాంతులు వగైరాలు అవసరమైతే చేయించవచ్చు.  అదీగాక జాతకం ప్రకారం బిడ్డ ఎలాంటి మనస్తత్వం కలవాడై వుంటాడో కూడా తెలుస్తుంది.  ఆ విషయాలు ముందు తెలుసుకోవటం ద్వారా ఆ బిడ్డని ఉత్తమ వ్యక్తిత్వం కల వ్యక్తిగా తీర్చి దిద్దటానికి తల్లిదండ్రులకి సహాయంగా వుంటాయి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



1 comments

Saturday, June 19, 2010

రాగి పాత్రలో పాలు పూజకి పనికి రావా?

Saturday, June 19, 2010


పనికిరావనే పెద్దలు చెప్తారు.  రాగి పాత్రలోని పాలతో అభిషేకం చేస్తే మద్యంతో చేసిన దోషం వస్తుందంటారు.  బంగారు పాత్రలో పాలు, నీళ్ళు పోసి పూజా కార్యక్రమాలకు వినియోగిస్తే విశేషమైన ఫలితాలుంటాయి.  వెండి పాత్రలు వుపయోగిస్తే ఆ ద్రవ్యాలు సత్వ గుణం కలిగి వుంటాయి.  మనలో ఉష్ణ తత్వ దోషాలు పోగొడతాయి.  కంచు, మట్టి పాత్రలు వుయోగించినా మంచిదే, మంచి ఫలితాలనిస్తాయి.  మరి ఇన్ని పాత్రలు పనికి వచ్చినప్పుడు ఒక్క రాగి పాత్రే పనికి రాదా?  రాగి పాత్రలో రాత్రి నీళ్ళు నింపి పెట్టి ఉదయం లేస్తూనే ఆ నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని పాటిస్తున్నారు.  రాగి పాత్రలో అంత సేపు వుంచిన నీళ్ళు ఆరోగ్యాన్నిస్తే పాలు పనికి రావా  ఖచ్చితంగా పనికి రావు.  ఎందుకంటే రాగిలో ఉష్ణ తత్వం ఎక్కువ వుంటుంది  పాలు పోస్తే తొందరగా పాడయిపోతాయి.  అలాంటి పాలతో అభిషేకం వగైరాలు దోషమని ధార్మిక శాస్త్రాలు చెబుతున్నాయి.  రాగి పాత్రలో నీళ్ళు పోసి పూజలో వినియోగించవచ్చు.  పాలు మాత్రం రసాయన చర్యల వల్ల పాడయిపోతాయి కనుక రాగి పాత్రలో పోసిన పాలు ఏ విధంగా వినియోగించకూడదు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



3 comments

Friday, June 18, 2010

బిడ్డ పుట్టిన వెంటనే తేనె ఎందుకు నాకిస్తారు?

Friday, June 18, 2010



బిడ్డ (ఆడయినా మగయినా) పుట్టిన వెంటనే తేనెలో నెయ్యి కలిపి బంగారు ఉంగరంతో నాలుకకు నాకిస్తారు.  ఎందుకు?  కొందరు నెయ్యి, తేనె, యవల పిండి, బియ్యం పిండి కలిపి నాకించాలి అంటారు.  ఆయుర్వేదం శాస్త్ర ప్రకారం ఉంగరం తేనెలో ముంచి పెదాలకి తాకించాలి.  అంతేగానీ, ఇంత తినిపించక్కరలేదు.  తేనె వల్ల ఉద్దీపనం కలుగుతుంది.  బిడ్డ పొట్ట లోపల వున్న ఉమ్మ నీరు పోతుంది.  నెయ్యి జీర్ణ శక్తికి మంచిది.  పైగా వాత, పిత్త, కఫ దోషాలని పోగొడుతాయి.  బిడ్డకి చప్పరించటం అలవాటు చేసినట్లుకూడా అవుతుంది.  జీర్ణ క్రియని పరి శుభ్రం చేసే ఈ రెండు వస్తువులనూ బిడ్డ పుట్టగానే బిడ్డ నోటికి తాకించటం బిడ్డ ఆరోగ్యానికి మంచిది.

(జీ టీ వీ ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


2 comments

Wednesday, June 16, 2010

బంతిపూలు పూజకి పనికి రావా?

Wednesday, June 16, 2010




మనం అనేక రకాల పూలతో దేవునికి పూజ చేస్తాం.  మరి బంతి పూలతో ఎందుకు పూజ చెయ్యకూడదు?  బంతి పూలు పెద్దగా వుంటాయి, రకరకాల రంగుల్లో వుంటాయి, అందంగా, ఆకర్షణీయంగా వుంటాయి,  సువాసనలు వెదజల్లుతూ వుంటాయి, మరి అవి చేసుకున్న పాపం ఏమిటి?  వాటితో ఎందుకు పూజ చెయ్యకూడదు  అన్ని శుభ కార్యాలకూ పనికి వస్తాయిగా.  పండగకానీ, ఏ శుభకార్యమయినా వచ్చిందంటే బంతిపూల దండలు గుమ్మాలనలంకరించాల్సిందే.  మరి శుభ కార్యాలకు పనికి వచ్చినప్పుడు దైవ పూజకెందుకు పనికి రావు?  పండగల్లో, ఇంట్లో శుభ కార్యాలు జరిగినప్పుడు ఇంటికి మనుషులు ఎక్కువగా వచ్చి పోతూ వుంటారు.  అలాంటి సందర్భాలలో ఎక్కువ బాక్టీరియా ఇంట్లోకి ప్రవేశించరాదని బంతి పూలని గుమ్మానికి కడతారు.  వాటికి క్రిమి కీటకాలను ఆకర్షించి, నాశనం చేసే శక్తి వుంది.  అందుకు.  మరి అలాంటి పూలని దేవతా విగ్రహాలకి వాడితే మంచిదేనా?  గుళ్ళో విగ్రహాలకు బంతి పూల మాలలు వేస్తే చుట్టుప్రక్కల వున్న క్రిమి కీటకాలు అక్కడ చేరుతాయి.  దేవాలయాలలో దేవుని దగ్గర వుపయోగించే పూలు, అగరుబత్తి, ధూపం, హారతి, గంట అన్నీ క్రిమి కీటకాలని పారద్రోలేవిగా వుంటాయి.  మరి క్రిమి కీటకాలను ఆకర్షించే బంతిపూలు దేవుడికి వేస్తే వాటి వల్ల దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందికదా?  అందుకే బంతి పూలతో పూజ వద్దంటారు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

2 comments

రాత్రి పూట ఉప్పు అనకూడదా?




మన సంప్రదాయంలో చాలామంది రాత్రి పూట ఉప్పు అనరు.  ఎందుకు అనకూడదు?  ఏమైనా దోషమా?  అన్నంత మాత్రాన వచ్చే నష్టమేమిటి? 

ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఉప్పు బాగా తగ్గించి తినాలి, లేదా మానేసినా పర్వాలేదు.  అల్లోపతిలో కూడా బీ పీ వున్నవాళ్ళు ఉప్పు బాగా తగ్గించాలంటారు.  ఈ మధ్య అందరినీ ఉప్పు వీలయినంత తగ్గించమనే చెబుతున్నారు.  సాధారణంగా ఎవరైనా పగలంతా తమ తమ పనులతో చాలా శ్రమిస్తారు, దానితో స్వేదం ద్వారా శరీరంలో వున్న లవణాలు బయటకి పోతాయి.  అందుకే పగలు ఉప్పు తినటం అవసరం.  రాత్రిళ్ళు విశ్రాంతి సమయం.  శ్రమ వుండదు.  దానివల్ల శరీరంలో వున్న లవణాలు బయటకి వెళ్ళవు.  అలాంటప్పుడు ఉప్పు ఎక్కువ తినటంవల్ల శరీరానికి హాని జరిగే అవకాశాలు ఎక్కువ.  ఉప్పుకి వున్న దుర్గుణం శరీరంలో వున్న నీటినంతటినీ ఒకచోటికి చేరుస్తుంది.  దానితో ఆ అవయవం వాస్తుంది.  కొందరిలో కాళ్ళు, చేతులు వాయటం, నొక్కితే సొట్టలు పడటం చూస్తూంటాం.  వాళ్ళు ఏ రకమైన వైద్యం చేయించుకున్నా వాళ్ళు ముందు చెప్పేది ఉప్పు తగ్గించమనే. 


సాధారణంగా ఉదయం తీసుకున్న ఉప్పే రోజంతా సరిపోతుంది.  అందుకే రాత్రుళ్ళు ఉప్పు వాడవద్దన్నారు.  పూర్వం దాన్ని ఖచ్చితంగా అమలు చేసే ఉద్దేశ్యంతో అసలు రాత్రిళ్ళు ఉప్పు అనే మాటే అనద్దన్నారు.  రాను రానూ చాదస్తపు మనుషులు కొందరు మూఢ నమ్మకాలతో రాత్రిళ్ళు ఉప్పు అనకూడదు అంటూనే దాని అంతరార్ధం తెలుసుకోకుండా రాత్రిళ్ళు ఉప్పు తిని అనారోగ్యం తెచ్చుకుంటున్నారు. పైగా మనం సాధారణంగా అనే ఉప్పు అని కాకుండా బుట్టలోదనో, లవణం, సాల్ట్ ఇలా నానార్ధాలూ వుపయోగించి మరీ వాడుతున్నారు. 

ఇలాంటివారంతా రాత్రిళ్ళు ఉప్పు అన్నా పర్వాలేదు, ఏ హానీ జరగదు కానీ రాత్రిళ్ళు ఉప్పు ఎక్కువ తింటే మన ఆరోగ్యానికే హాని అని తెలుసుకోవాలి.  పూర్వీకులు నిబంధనలు ఎందుకు పెట్టారు అని తరచి చూస్తే అద్భుతమైన సత్యాలు గోచరిస్తాయి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



4 comments

Wednesday, June 9, 2010

అయ్య బాబోయ్ నిప్పులు

Wednesday, June 9, 2010



నేను చెప్పేది మండిపోతున్న ఎండలు గురించి కాదండీ బాబూ.  నా కాళ్ళకి వున్న నిప్పుల మూటల గురించి.  అదేంటి కాళ్ళకి నిప్పుల మూటలేంటి.  అసలే ఎప్పుడూ గుళ్ళూ గోపురాలూ అంటూ తిరుగుతూ వుంటావు.  ఏ గుళ్ళోనన్నా కొత్త రకం మొక్కు చూసి చేస్తున్నావా అనకండి.  మరీ ఆటపట్టించకండి.  గుళ్ళల్లో కూడా మీకన్నీ సరిగ్గా చెప్తున్నానా లేదా ఏ విషయమైనా మరచిపోతున్నానా అనే యావేగానీ అసలు దేవుడికి సరిగ్గా దణ్ణమయినా పెడుతున్నానా లేదా అనే అనుమానం నాకే కాదు, మా ఆయనక్కూడా వస్తోంది.  అయితే ఆ నిప్పుల మూటల మాటలేమిటంటున్నారా

అక్కడికే వస్తున్నాను.  ఓ నెల రోజులకిందట కాళ్ళు పగిలాయి.  అది చాలామందికి సర్వ సాధారణం.  పైగా ఆ సమయంలో ఇంట్లో చిన్న చిన్న మరమ్మత్తులు జరిగి ఆ దుమ్మువల్ల కాస్త ఎక్కువయినయి, అవ్వే పోతాయ్ లే అని కొంచెం అశ్రధ్ధ చేశాను.  ఆ అశ్రధ్ధే నాకు పెద్ద శిక్ష వేసింది.  ఆ పగుళ్ళు చాలా లోతుగా, ఇష్టం వచ్చినట్లు పెరిగాయి.  అరికాళ్ళకి నిప్పుల మూటలు కట్టుకున్నట్లు కాలు కింద పెడితే సరిగ్గా నుంచోలేక, అడుగు వెయ్యలేక, భరించలేని మంటలు.  అడుగు తీసి అడుగు వెయ్యటమంటే నరకమే.  కాళ్ళు ఓ స్టూలు మీద జాపి కూర్చుంటే ఎక్కువ బాధ లేదు.  ఈవిడకి రోగమేమిటన్నట్లుంటుంది ఆకారం కూడా.  కొన్నాళ్ళు ఆ ముచ్చట కూడా అయ్యాక ఇంక భరించలేక నేను ఎప్పుడూ మందు తీసుకునే శ్రీ యోగనంద్ గారి దగ్గరకెళ్ళాను.  చూస్తూనే ఆయన అన్నారు మేహ ఉడుకు వల్ల వచ్చింది.  నెలపైనుంచీ వుంది కదా అని.  వెంటనే మందులు, మర్నాటినుంచీ ఉపశమనం మొదలు.

ఇంతకూ చెప్పొచ్చేదేమిటంటే మామూలు కాళ్ళ పగుళ్ళే కదా అని అశ్రధ్ధ చెయ్యకండి.  కొంచెం ఎక్కువగా వుంటే వెంటనే వైద్యం చేయించండి నాలాగా అవస్ధ పడక.  అశ్రధ్ధ వల్లే నేను నెలపైన నరకం అనుభవించాను.



0 comments