Thursday, July 8, 2010

కోకిల గొంతు వింటే రోగాలు నయమవుతాయా?

Thursday, July 8, 2010



వసంత ఋతువులో వినిపించే కోకిల గానం ఎంతో మనోహరంగా వుంటుంది.  అసలు వసంత ఋతువు అంటేనే ఆహ్లాదకరమైన ఋతువు.  మల్లెపూలు, పిల్లగాలులు, కోకిల గానాలు మామూలు మనుషులనే ఉత్తేజపరిస్తే మరి భావుకులయిన కవుల సంగతి వేరే చెప్పాలా?  మనసు వుప్పొంగి కవితా జల్లులు కురవవా? 

కోకిల గానం వింటే ఎన్నో రోగాలు వుపశమిస్తాయంటారు.  నిజమేనా?  అసలు సంగతేమిటంటే మృదువుగా వచ్చే శబ్ద తరంగాలలో రోగ నిరోధక శక్తి వుంటుంది.  ఈ మధ్య ప్రచారంలోకి వస్తున్న మ్యూజిక్ ధెరపీ గురించి వినే వుంటారు.  శాస్త్రీయ సంగీతంలో నవ గ్రహాలకు సంబంధించి రాగాలున్నాయి.  ఎవరికైనా ఏదైనా లోపం వున్నా, ఆరోగ్యం సరిగా లేకపోయినా నవ గ్రహాలలో ఏ గ్రహ స్ధితి సరిగా లేకపోవటంవల్ల ఆ దోషం ఏర్పడిందో ఆ గ్రహానికి సంబంధించిన రాగాలు వింటూవుంటే త్వరగా వుపశమనం కలుగుతుంది.

మృదు శబ్ద తరంగాలు వింటే మనసుకి ఆహ్లాదకరంగా వుండి సంతోషం కలుగుతుంది.  ఆ కారణంవల్లనేనేమో మనకి తెలియకుండానే శరీరానికి సాంత్వనం లభిస్తుంది.  అదే సాంత్వన కోకిల గానంలోకూడా లభిస్తుంది.

అసలు కోకిలమ్మ పాట వినగానే మనసులోనైనా తిరిగి దానితో గొంతు కలపని మనిషుంటాడా?

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



1 comments:

astrojoyd said...

సృష్టిలో మెదడు ఒక మిస్టరీ .దీని ఫ్రీ క్వేన్చి ని ౧౨ ఆవ్రుత్హాలకు తీసుకొని వెలితే,మనకు దేహానికి ఉన్న బాహ్యు ప్రపంచం విడిపోతుంది[దీనినే నిద్ర అని మనం అంటే,సమాధి అని యోగులంటారు.]౧౨కి తక్కువగా పోవ్నఃపున్యాన్ని తగ్గిస్తే మనిషి కోమాలోకి వెళతాడు. [అల్ తెస్ ఫాక్ట్స్ వ్రిత్తెన్ ఇన్ మెడికల్ నురోలోజీ బుక్స్].ఇక కోకిల గాన-ఫ్రీ క్వేన్చి౧౮ hertzs కావడం వలన,మన మెదడుకి ఆహ్లాదం గా ఉంటుంది. [బర్డ్స్ నడ్ సౌండ్స్ బై -ఆలీ]--జయదేవ్.చల్లా-చెన్నై-౧౭.