Friday, January 21, 2011

స్నేహానికి ద్రోహం

Friday, January 21, 2011


 అవును ప్రియ మరణంవల్ల జరిగిన ద్రోహం స్నేహానికి.  ప్రమదావనానికిగానీ దానిలోని సభ్యులకుగానీ కాదు.  ఎందుకంటే ఆడపేరుతో వస్తే అమ్మాయి అని నమ్మాము.  సరదాగా మాట్లాడాముగానీ, చెప్పకూడని సంగతులూ, ఇంట్లో రహస్యాలూ ప్రమదావనంలో ఎవరూ చర్చించుకోరు.  ఎందుకంటే అందరికీ మంచీ చెడూ తెలుసు.  ఇంతమంది ఆడపేర్లుపెట్టుకున్నవారితోనూ అంతా సరదాగా మాట్లాడారు, ఆత్మీయతని పంచుకున్నారు.  అంతమాత్రాన నష్టమేమీలేదు.  అయితే బాధంతా నమ్మించి స్నేహాన్ని మోసం చేశాడని, ఇంత ఆత్మీయంగావుండి ఇలా దగాచేశారని.  చనిపోయిందని తెలిసినప్పుడు, మోసాన్ని పసిగట్టలేక, మనసున్న మనుషుల్లాగా బాధపడ్డాము.  అది తప్పా?  ఆ వార్త చెప్పటం జ్యోతి చేసిన పొరపాటెలాఅవుతుంది?.  అనేక కారణాలవల్ల తనుకూడా ఈ మోసాన్ని గుర్తించివుండకపోవచ్చు.  ఒక విధంగా తను రాంగ్ ఫోటో పెట్టటం మంచిదయింది.  అసలు మోసం బయటపడింది. 

 ప్రమదావనంలో  ఇంగింత జ్ఞానం లేనివారూ,  ఒకళ్ళు ఆడించినట్లు ఆడేవారూ ఎవరూ లేరు.  ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇంకముందు ఆడపేర్లు పెట్టుకునేవాళ్ళతో అందరూ జాగర్తపడతారు.  ఇప్పుడూ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాము.   అయితే ఈ జాగ్రత్తలనుకూడా అధిగమించి అతి తెలివితేటలుగలిగినవాళ్ళు చేసే మోసాలకు అప్పుడప్పుడూ ఇలా బలికాక తప్పదు.  దీనితో మేము పోగొట్టుకున్నది మనుషులమీద నమ్మకాన్ని.  దానివల్ల మాకు పెరిగేది ముందు జాగ్రత్త మాత్రమే.

నేను అర్ధం చేసుకోలేని విషయం గురించి అడుగుతున్నాను.  దయచేసి తెలిసినవారు చెప్పండి.  బ్లాగులు మన మనోభావాలు రాసుకోవటానికి.  సరే.  కానీ మన మనోభావాలు ఇంత ఛండాలమయిన భాషలో రాసుకోవాలా?  ఇంత దిగజారిపోయి తిట్టుకోవాలా?  మనం సంఘంలో బాధ్యతగల పౌరులంకాదా?  యుక్తాయుక్త వివేచన లేకుండా మన అక్కసు తీర్చుకోవటానికి ఎవరో ఒకరిని తిట్టాలా?  నిజంగా మనం మెచ్చని విషయం వుంటే మంచి భాషలో చెప్పి మన సంస్కారం చాటుకోలేమా???

చాలా చోట్ల కామెంట్లల్లో ప్రమదావనంలో ఆడోళ్ళకి పర్సనల్ విషయాలు మాట్లాడుకోవటం తప్పితే పనిలేదు అన్నట్లు రాశారు.  ఆడవాళ్ళు మరీ అంత ఫూల్స్ కాదు ఇంటిగుట్టు రచ్చకెక్కించటానికి.  శుభకార్యాలకి విషెస్ చెప్పుకున్నంతమాత్రాన పర్సనల్ విషయాలన్నీ చెప్పేసుకున్నట్లు కాదు.  అది తప్పితే ప్రమదావనం కార్యక్రమం ఇంకేమీ లేదనుకోవటం పొరబాటు. 

ఒకటి మాత్రం నిజం.  ఒకరి కుటుంబ సభ్యులు పోయారంటే అందరూ ఒకటై వారిని ఓదార్చి తిరిగి మామూలు మనిషిని చెయ్యాలని ప్రయత్నంచెయ్యటం..అనారోగ్య సమయాల్లో మానసిక అండగా నిలవటం, కంప్యూటరుగానీ ఇంకా ఏమైనా తెలియని విషయాలు తెలుసుకోవటంకూడా ఆడవాళ్ళ ముచ్చట్లుగా తీసేస్తే అది ఆడవారిపట్ల మీకున్న చిన్నచూపు మాత్రమే.  ప్రమదావనం గురించి కామెంటు చేసేవారు జ్యోతిమీద అక్కసుతోగాక దానిలో సభ్యులనెవరినన్నా అడిగి నిజానిజాలు తెలుసుకుని చెయ్యండి. 

ఒకరు ఒక సబ్జెక్టు చెబితే దానిమీదే అంతా పోస్టులు రాస్తున్నారన్నారు.  ఇదికూడా దూషించే విషయమేనా?  ఇది  ఏ విధంగా తప్పో చెప్పగలరా?  ఒక సబ్జెక్టు మీద అనేకుల భావాలు, ఒకే సమయంలో వాటిని చెప్పే పధ్ధతి ఎలావుంటుందో విశ్లేషించవచ్చుకదా?  నచ్చలేదనుకోండి. చదవటం మానెయ్యండి.  

చివరిగా నా విజ్ఞప్తి ఒక్కటే.   ఆడవాళ్ళని అలుసుగా చూడకండి.  తేలికగా మాట్లాడకండి.  మీ జీవితంలోనూ ఆడవారు వున్నారు.   భావ వ్యక్తీకరణ స్వేఛ్ఛ మీకుంది.  అయితే చదువూ సంస్కారాలు కలవారిగా  భాషమీద కంట్రోల్ పెట్టుకోండి.  మడి కట్టుకుని రాయక్కర్లేదు...కుళ్ళులో దొర్లకండి.

28 comments:

Praveen Mandangi said...

గీతాచార్య గారు గుంటూరులో యూనివర్శిటీ ప్రొఫెసర్. వృత్తిరీత్యా అధ్యాపకుడు. చేసే పని ఏమిటి? ఆయన గూగుల్ బజ్‌లోనూ ఫాస్టిన్ డొన్నేగల్ లాంటి duplicates పెట్టుకుని కామెంట్లు వ్రాసాడు. సృజన గోవిందరాజు ఫొటో ఒక మూతపడిన బ్లాగ్‌లోనిది. కొంత మంది కుటుంబ ప్రైవసీ కోసం బ్లాగులు ముయ్యడం జరుగుతుంది. ఆ బ్లాగ్‌లోని ఫొటో పట్టుకుని పెట్టాడు.

చెప్పాలంటే...... said...

కొద్దిగా ఆలస్యం అయిందండీ కోపం తెచుకోకండి. నమ్మిన పాపానికి చేసిన మోసానికి ఎవరు బాధ పడరు చెప్పండి. మిగతా బ్లాగర్లు వారి కామెంట్లల్లో ప్రమదావనాన్నీ, ఆడవారినీ అవహేళన చేస్తూ మాట్లాడటం అది వాళ్ళ ఇష్టానికి వదిలేయడమే....కాని తప్పుని సమర్ధించడం కుడా చాలా పెద్ద తప్పు. నమ్మక ద్రోహానికి శిక్ష తప్పకుండా పడుతుంది. మనం జాగ్రత్తగా ఉండటమే...
ఏదైనా టపా నచ్చితే ఓ అభినందన లేదా నచ్చక పొతే దూరం గా వుంటే బావుంటుంది అయినా అందరూ ఒకలా వుండరు కదా అది వాళ్ళ సంస్కారం మీద ఆధారపడి వుంటుంది

Maitri said...

లక్ష్మిగారూ మీరు చెప్పేదానితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ప్రమదావనం గురించి ఇతరులు ఏదైనా అనుకుంటున్నారంటే అది కేవలం అసూయ మాత్రమే అయి ఉంటుంది. ఎందుకంటే ఈ అనుకునేవారిలో స్త్రీలు కూడా ఉన్నారు గమనించండి. ఇంకా చెప్పాలంటే స్త్రీలే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళని ప్రమదావనంలో చేరకుండ ఎవరాపుతున్నారట? కావాలంటే వాళ్ళు కూడా చేరవచ్చు కదా! అందని ద్రాక్షపళ్ళు పులుపా?
ఇకపోతే ఒక సబ్జెక్ట్ అని ఇక్కడ ఎవరూ ప్రత్యేకంగా సూచించరే!. ఎవరికి తోచినది వాళ్ళు చెప్తారు. మిగతావాళ్ళకి నచ్చితే పాల్గొంటారు. లేకపోతే లేదు.
ఇకపోతే ఈ గీతాచార్య విషయమంటారా? నిన్ననంతా మనమందరం ఆ ప్రియ బ్లోగులో కామెంట్లన్నీ పెట్టేమా? అవన్నీ రాత్రంతా చూసి తెల్లవారున ఒక టపా రాసేడు. కిందన లింక్ ఇస్తున్నాను. చూడండి.
http://thinkquisistor.blogspot.com/2011/01/blog-post.html
పాపం సత్యాన్వేషి. కానీ నోరు తెరిస్తే అబద్ధాలే.
సృజనా ఉందట. ప్రియకీ ఏమవలేదట. తన భార్య సృజనేట. వాళ్ల ఫోటోలని ఎవరైనా దుర్వినియోగపరచుకుంటారేమో అని అసలు ఫోటోలని పెట్టలేదట. అదే అసలు విషయమట. ఈ explanations అన్నీ ఇచ్చేడు తప్పితే తను మారుపేరు పెట్టుకుని ప్రమదావనంలో ఎందుకు చేరేడో, ప్రియ చనిపోయిందని జ్యోతిగారికి ఎందుకు చెప్పేడో అన్న వివరాలు ఏవీ లేవు అక్కడ. వాటిని మాత్రం చక్కగా తప్పించుకున్నాడు.
ఇంతకీ జ్యోతి ఈ ఫోటో పెట్టడం వల్లే కదా నిజం బయటకి వచ్చింది! పెట్టకపోతే అందరూ ఇంకా ఆ గీతాచార్య మీద బోల్డు జాలి పడుతూనే ఉండేవారు. అదీకాక, ఒక అబ్బాయి అమ్మాయి పేరు పెట్టుకుని ఆడవాళ్ల గుంపులో చేరడానికి అతనికి ఏదో మానసికమైన రోగం ఉండే ఉంటుంది. తనకి పెళ్ళవుతోందని, triplets పుట్టబోతున్నారని, దేశవిదేశాలు తిరిగి వచ్చేవాడిననీ అన్నీ అబద్ధాలు తప్పితే ఒక్క నిజమూ నోట్లోంచి రాదు. ఇలాంటి వ్యక్తికి సహకారాన్ని అందించి మనలో ఎవరినో తిట్టడం ప్రమదావనం మీద ఎంతవరకూ న్యాయమో అలా చేసిన వాళ్లకే తెలియాలి. అదీకాక ప్రమదావనంలో చేరుతున్నది నిజంగా ఆడవాళ్ళేనా లేక ఇటువంటి మానసిక రోగులా అని ఎవరు తేల్చగలరు? ఎవరైనా “నా పేరు ఫలానా ఫలానా. నేను ఈ ఫలానా ఊర్లో ఉంటాను. నన్ను చేర్చుకోండి” అంటే అది నిజమో అబద్ధమో అని ఎవరైనా ఎలా నిర్థారించగలరు?
కానీ లక్ష్మిగారూ మీరొక విషయాన్ని మరచిపోతున్నారు. దీనిలో మనకెవరికీ ఏ నష్టం కలగలేదు. మోసపోయేమే అన్న ఒక భావం తప్పితే. ముందు ముందు జరిగే నష్టం అంతా ఆ నకిలీ పేరు పెట్టుకుని ఇక్కడ చేరిన వ్యక్తికే. ఇంక బ్లోగుల్లో కనపడటానికి వీళ్ళలతో వాళ్లతో మాట్లాడటానికీ వాటికీ మొఖం ఎలా చెల్లుతుందో చూద్దాం.

Anonymous said...

లక్ష్మి గారు మీరు చివరిగా చెప్పిన మాటలు చేరాల్సినవారికి చేరి, వారు వాటిని నిజాయితీతో స్వీకరించి ఆచరిస్తే తెలుగు బ్లాగులకి పెద్ద మేలు జరుగుతుంది.
ఎప్పుడు ఏ మోసం బయటపడ్డా దాన్ని, అది చేసినవారిని వదిలేసి వెంటనే విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ ప్రమదావనం మీద బురదచల్లడం ఎప్పటినుంచో చూస్తూనేవున్నాం. నెట్ లో ఎన్నో గ్రూపులున్నాయి. వాళ్ళంతా వాళ్ళకు నచ్చినట్టూ ఉంటారు అది ఆ గ్రూపులోవుండేవారి సొంత విషయం . కానీ ప్రమదావనం అనేసరికి ఎందుకు ఇంత లోకువ చేసి మాట్లాడుతారో అర్ధం కాదు.
పోనీండి ఎన్నిసార్లు మోసపోయినా మనుషుల్ని నమ్మటం , మంచిని పంచటం మన ధర్మం .దాన్నే కొనసాగిద్దాం

Mauli said...

Sorry to comment on this ..he says he knew Priya like other bloggers only ..WE CAN NOT PROVE HE IS Priya..and there is noting wrong in providing wrong photos ...

he said he never entered pramadaavanam, still if you think its lie, time to correct your/our validations ..no one in blog world blaming pramadaavanam ...

Geetaacharya should be the first one to inform about priya ..but he was calm.

In future if I join any woman community, would use same photo used for Priya if they ask for photo in specific ..please don't mistaken me :(

we respect women groups, let be pramadaavanam also ..even few men are part of it.(just in case)

Mauli said...

@Praveen Sarma

This is women specific post..could you please give us some space??? please post your comments at other locations

Mauli said...

@Praveen Sarma

If you have that much interest, you can join Pramadaavanam also ...all you need is photo graph..

శ్రీలలిత said...

లక్ష్మిగారూ,
ఇప్పుడు ఇక్కడి పరిస్థితి చూస్తుంటే "తిలా పాపం తలా పిడికెడు.." అన్నట్టుంది.
తాము చదువుతున్న బ్లాగ్ లన్నీ వేరే పేర్లతో రాస్తున్నవని తెలిసినవారూ మిన్నకున్నారు, తెలియనివారు తెల్లబోయి నెమ్మదిగా జారుకున్నారు.
కాని అసలు బ్లాగర్లందరూ కలిసికట్టుగా చెప్పవలసిన ఈ విషయంలో ప్రమదావనం పేరు తీసుకురావడం శోచనీయం. మిగిలిన బ్లాగర్లందరిలాగే జ్యోతి కూడా ప్రియ మరణం అందరికీ తెలియాలని పోస్ట్ పెట్టారు. ఎవరికి తెలిసిన విషయం వారు చెప్పడం బ్లాగ్ లోకం లో సాధారణమే కదా.. అసలు అలా పెట్టినందువలనే కదా ఈ గొడవంతా పైకొచ్చింది. అందుకు ఆమెని అభినందించ వలసింది పోయి ఇంకా ప్రమదావనం లోని మహిళల గురించి మాట్లాడడం తప్పు. (ప్రమదావనాన్ని ఎవరూ ఏమీ అనలేదని ఎవరో అన్నారు. కాని వారు ఒకసారి కామెంట్స్ చూస్తే బాగుంటుందేమో..) అసలు ఇక్కడ ప్రమదావనం ప్రసక్తి అనవసరం. బ్లాగర్లందరూ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని, ఆ మనిషికి వైద్యం ఎలా చేయాలో ఆలోచించాలి. అంతేకాని ప్రమదావనం లో ఏం మాట్లాడుకుంటారో, ఏం చేస్తారో ఇక్కడ చర్చించడం అనవసరం.
ప్రమదావనంలో ఏం మాట్లాడుకుంటారో అని కుతూహలపడేవారికి అవన్నీ చెప్పి సమర్ధించుకోవలసిన అవసరం మనకి లేదు. మన గ్రూప్... మన ఇష్టం వచ్చింది మాట్లాడుకుంటాం. అవి మంచివో, చెడ్డవో ఇంకొకరికి మనం సంజాయిషీ ఇచ్చుకోవలసిన పని లేదు.
కాని ఇక్కడ బ్లాగుల్లోని వాళ్ళందరూ ఆ పెద్ద మనిషిని ఏం చేయాలో ఆలోచిస్తే బాగుంటుంది.

psm.lakshmi said...

చెప్పాలంటేగారూ
కామెంటు రాయకపోయినా, ఆలస్యంగా రాసినా కోపం తెచ్చుకునే మనస్తత్వంకాదండీ నాది. ఆడవారిని అవహేళనచేస్తూ రాయటం -- జనరల్ గా అయితే అలాగే వదిలేసేవాళ్ళం. నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరిమీదో అక్కసుతో ఒక గ్రూప్ ని అంటుంటే సమాధానం చెప్పకపోవటం సరైనపనికాదనుకుంటా. మాకూ మనసుంటుంది, ఆలోచనలూ, ఆవేశాలూ వుంటాయి. అర్ధం చేసుకుంటారనుకుంటా.
psmlakshmi

psm.lakshmi said...

క్రి గారూ
ధాంక్సండీ. చూశాను.
లలితగారూ ధాంక్సండీ
psmlakshmi

psm.lakshmi said...

మౌళిగారూ
గీతాచార్య ప్రమదావనంలోకి వచ్చారో లేదో నాకు తెలియదు. నాకు తెలిసింది ప్రియ, సృజన, వైష్ణవి. ఇందులో సృజన చాట్ లో వచ్చేది. అయితే తక్కువ సమయం. వీరు వుంటే మాకందరికీ సంతోషం.
psmlakshmi

psm.lakshmi said...

ప్రవీణ్ శర్మగారూ, మౌళిగారూ
అర్ధం చేసుకున్నాను.
psmlakshmi

psm.lakshmi said...

శ్రీలలితా
మీరన్నది నిజం. ఇది అందరు బ్లాగర్లు ఆలోచించవలసిన సమస్య. ప్రమదావనం తలనొప్పి కాదు. ఇలాంటి తలనొప్పులకు మందులు కనిబెట్టటంకూడా కష్టమే.
psmlakshmi

psm.lakshmi said...

గీతాచార్యగారూ
ఇది మీకు సూటి ప్రశ్న. సమాధానం ఇవ్వటం, ఇవ్వకపోవటం మీ ఇష్టం.
.....ఇలాంటివాళ్ళకి సృజన ఎందుకు కనబడాలి ప్రియ తన ఫోటో ఎందుకు ఇవ్వాలి పెళ్ళి సంబంధం పేరుతో ఎవరికో పంపరని గ్యారంటీ ఏమిటి ఆ పిల్ల అదే అడిగితే నేను అవాక్కయ్యాను....
నిజమే. ఎవరి అనుమానాలు వారికుండచ్చు. ఎవరి జాగ్రత్త వారు పడాలికూడా. అయితే ఇలా అడిగిన ప్రియ ఎవరి ఫోటోనో ఎందుకు ఇచ్చింది. అంటే తను కాకపోతే ఆ బాధలు ఎవరుపడ్డా పరవాలేదనా

.....మీ ఎలిగేషన్స్ తప్పయితే నాకు కాంపెన్సేషన్ ఏమిటి.......
ఇంతమంది మనసుల్లో తాము మైల్ లో, చాట్ లో మాట్లాడిన, తమతో అల్లరి చేసిన వాళ్ళు మోసంకాదు, నిజంగానే వున్నారు అనే సంతోషంకన్నా ఎక్కువ కాంపెన్సేషన్ ఏమైనా వుంటుందా

గీతాచార్యా
ఈ వివాదాలెందుకు వున్నవారిని దాయటం ఎందుకు వివాదాలు పెంచుకోవటం ఎందుకు సరైన సమాధానం ఇచ్చి దీనిని ఇంతటితో ఆపెయ్యచ్చుగా.
psmlakshmi

Mauli said...

Srujana (or his wife) exists..about Priya and Vaishnavi he can share what ever he knew ...

and we never trust them because of his friends ....will you agree??

and If you like to talk with srujana..it should be srujana interest also ...and srujana never interfered in Priya episode..


again I mention ...dont blame about photo ...if some girl (real girl in that photo ) upload her photo, it should be her problem ..we have nothing to say in this ...


Srujana did chat with you , and she exists (forget abt real names) ...


Priya and Vaishnavi ...Lets believe they exist ..if not ..Do I know any one exists or not in this post ...its same..

who we are to question him?? we can only when we have proof ...if you have it ...share ..

మాలా కుమార్ said...

లక్ష్మి గారు ,
నేను బ్లాగ్ లలోకి వచ్చిన నాలుగు నెలలనుడి సృజన , ప్రియ చాటింగ్ లో పరిచయము . నాతో చాలా చనువుగా ఇంట్లో పిల్లలా వుండేవారు . నా ద్వారా మా ఇంట్లో అందరికీ వాళ్ళు పరిచయమే . వాళ్ళిద్దరూ అసలు లేనే లేరని తెలిసి నప్పటి నుంచీ చాలా షాక్ గా వుంది . వాళ్ళు వున్నారు ఎక్కడో ఒక చోట క్షేమంగా వున్నారు అనుకోవాలనివుంది .
ఇక జరిగినదాని లో మనం చేసిన పొరపాటు ఏమీలేదనే అందరూ నమ్మినట్లే మనమూ నమ్మాము . కాబట్టి మనం ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను .

Praveen Mandangi said...

ఒక పక్క యాహూ మెసెంజర్, ఇంకో పక్క meebo మెసెంజర్ ఓపెన్ చేసి ఒకేసారి రెండు పేర్లతో చాటింగ్ చెయ్యడం సాధ్యమే.

Raghav said...

ఇది కొత్త విషయం కాదు కాని(బ్లాగులకు కొత్తేమో) విజయ వంతంగా రెండు మూడు కారెచ్టర్లను రెండు సంవత్సరాల పాటు నడిపించినందుకు గీతాచార్య కు నా అభినందనలు.నాకు కొందరిలాగ అప్పుడు ఇప్పుడు ఎలాంటి సందేహాలు రాలేదు గాని, వీళ్ళు మరీ ఇంత ఓవర్ ఎక్స్ ప్రెస్సివ్ ఏంట్రా అనిపించింది అంతే.మరి అప్పుడెందుకు అన్లేదు అంటే, అందరు అహా ఓహో అంటుంటే మనకెందుకులే అనుకున్నా, లైట్ తీసుకున్నా. ఐనా గీతాచార్య కు మాత్రం నా అభినందనలు రెండు మూడు కారెక్టర్లు అదీ సంవత్సరాల తరబడి నడిపించడం అంత సులభం కాదు, నాకైతే వారం రోజులు అమ్మాయి లాగ నా ఫ్రెండ్(మగ ఫ్రెండ్ అండి బాబు ) తో చాట్ చేసేటప్పటికే విసుగెత్తింది. కొంపలు మునిగి పోయే విషయాలు ఏవి షేర్ చేసుకోలేదన్నారు కాబట్టి దీన్ని ఇక్కడితో ఆపెస్తే మంచిది. ఇక పైనా ఆ లేడీసు గుంపుల్లో ఎవరైనా చేర్చుకొనే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి.

veera murthy (satya) said...

(as usual )ఆడవాళ్ళ బ్లోగ్ లకే ఎక్కువ హిట్స్, ఎక్కువ కామెంట్స్ వస్తాయ్... అందుకే కన్ను కుట్టి నట్టుంది !
Still nobody knows how many virtual bloggers are there among us....

కత పవన్ said...

ప్రవీణ్ నువ్వు అపరా బాబు కామెడి
పిచ్చి కామెంట్లు నువ్వు %$#$##%

వనజ తాతినేని/VanajaTatineni said...

ivvanni.. choosthunte.. chaala asahyamga..undhi.. pramadaavanamlo join ayye vaari phone no,photo thappanisari nibandhana chesthe baaguntundhi.kalam sneham perita mosaalu jaripinatle idhi koodaa. samskaaram lenivaarini thittinaa adhi vrudhaa.aa blogs ni choodakundaa undatame..siksha. kshamayaa dharitri.(pramadaavanam)

Unknown said...

pramadavanam as a group is created for a purpose and it is a pleasure to be part of such a group. Let us not worry about what others have to say about it.. We are all one..

psm.lakshmi said...

మౌళిగారూ
ఒక బ్లాగులో రాసిన విషయాలు గురించి అనేకమంది అనేక కామెంట్లు పెడతారు. అలాగే నాకొచ్చిన అనుమానం గురించి నేనడిగాను. సమాధానం చెప్పటం, చెప్పకపోవటం ఆయన ఇష్టం. సమాధానం చెప్పితీరాలని నేను ఫోర్స్ చెయ్యలేదు. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పటం కష్టం.
psmlakshmi

psm.lakshmi said...

మాలాగారూ
ఇలాంటివాటికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే బాధ పడాల్సిన అవసరంకూడాలేదు. నెట్ ఇలాంటి మోసాలు సాధారణం.
psmlakshmi

psm.lakshmi said...

రాఘవగారూ, సత్యగారూ
ధన్యవాదాలు
psmlakshmi

psm.lakshmi said...

vanajavanamali, praseeda,
for expressing such oneness only I have posted this. most of the people think that ladies will talk only about sarees, families, etc. but they are also human beings, they have their own individualities, and they can achieve anything if they wish.
psmlakshmi

Maitri said...

http://thinkquisistor.blogspot.com/2011/01/blog-post_5456.html
Please see his latest post. He openly accepts that there exist no such characters as the ones he created. Too cinfident for his own good. He brings extraneous issues and diverts every ones attention but fails to mention why he had chosen a fake female identity to get into a group which belongs exclusively to females.

Unknown said...

ప్రవీణు,

నీ ఎగ్జయిట్మెంట్ ఎందుకో తెలుసు కాని, నువ్వు ఆగు. అక్కడ గీతాచార్య అన్నది మోర్ 'రొమాంటిక్' థన్ ఝన్ ఘాల్ట్ కాదు మోర్ 'హీరోయిక్'. నీకు రెండు ఒకటేనేమో కాని ప్రస్తుతానికి దిక్షన్ర్య్లో వేరే అర్ధాలు ఉన్నాయి. ఇంకా, నువ్వు ఎకనామిక్స్ కి దూరంగా ఉంటే ఉత్తమగుణ జాతివాడివి అవుతావు.