Wednesday, November 25, 2009

మౌనవ్రతం పాటించటంవల్ల లాభం వుందా?

Wednesday, November 25, 2009

మౌనవ్రతం ఎందుకు చేస్తారు?

మునీశ్వరులు ఎక్కువగా మౌన వ్రతం పాటిస్తారు. మౌన వ్రతం పాటించేవారు కనుకే వారికి ముని అనే పేరు వచ్చిది. ఇప్పటికీ చాలామంది చాతుర్మాస దీక్షలోనో లేక వేరో ఏదో కొన్నిరోజులో లేకపోతే ఫలానా వారమనో మౌన వ్రతాన్ని పాటిస్తున్నారు. ఇది ఎందుకు చెయ్యాలి? దీని వల్ల ఉపయోగం ఏమైనా వుంటుందా?

తప్పకుండా వుంటుంది. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా మౌనవ్రతం మనిషికి ఎంతో మేలు చేస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే మౌనవ్రతం వల్ల వాక్శుధ్ది, వాక్ శక్తి పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే మనని మనం ప్రశాంతంగా వుంచుకోవటానికీ, కోపాన్ని అదుపులో పెట్టుకోవటానికి ఈ మౌనవ్రతం ఉపయోగపడుతుంది. సిధ్ధులు వాక్ శక్తిని పెంచుకోవటానికి, వాళ్ళని వాళ్ళు ప్రశాంతంగా వుంచుకోవటానికి ఎక్కువగా మౌనవ్రతాన్ని పాటిస్తారు.

మనకి వచ్చే రోగాలు చాలామటుకు మన ఆవేశాలతో, కోపంతో వస్తాయి. వాటిని నియంత్రించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మనకి ఎదుటివారిమీద వచ్చిన కోపాన్ని చూపించకుండా కొంత సంయమనాన్ని పాటిస్తే గొడవలు పెరగటం, అనవసరమైన పోట్లాటలు, అశాంతి వుండవు. సమస్యలు తేలిగ్గా పరిష్కారమవుతాయి. దీనిమూలంగా సామాజికంగా ఉపయోగం వున్నట్లేకదా. ఈ కలికాలంలో మనకి అంత వాక్శుధ్ధి అక్కరలేకపోవచ్చు...మనం ఏమైనా అంటే వెంటనే అది జరిగేంత వాక్శక్తి మన వాక్కుకి వుండాల్సిన అవసరం కూడా వుండకపోవచ్చు. కానీ ఈ టెన్షన్ల ప్రపంచంలో మన ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం మనకి చాలావుంది. అంటే కోపం వచ్చినప్పుడు మాట తూలకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం చాలావుంది. దానికోసం మౌనవ్రతం పాటించటం చాలా అవసరం. కనీసం కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా వుండటం అలవాటు చేసుకున్నా చాలు. ఏమంటారు?

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం కార్యక్రమం ఆధారంగా).


7 comments:

Anonymous said...

ఖచ్చితంగా ఉంటుంది. జాతకంలో రెండో భావం దనం, వాక్కు రెంటిని సూచిస్తుంది. కావున మౌన వ్రతం ఉంటే దనాదాయం పెరుగును. వాక్ ప్షలితం కూడ సంభవమే

Apparao said...

అస్సలు వాక్సుద్ధి మనకు ఉండకుండా ఉంటే మంచిదేమో. ఒక వేళ మనకు అంత శక్తి ఉంటే ఇతరుల నాశనానికి వాడతాం.
మనస్సుని కూడా మౌనం గా ఉంచితే మరీ మంచిది.

శివ చెరువు said...

మొత్తానికి ఉపయోగకరమని తేల్చారు

psm.lakshmi said...

అందరికీ ధన్యవాదాలు.
శాస్త్రిగారూ, వాక్శుధ్ధి కావాలంటే వచ్చేసేది కాదుకదా. దాని గురించి అంత తాపత్రయపడి సాధించిన మనిషి దాని విలువ తప్పకుండా తెలుసుకుంటాడు. ఏమంటారు?
psmlakshmi

Apparao said...

నిజమే, కానీ కామ క్రోధాలకి లోబడినప్పుడు పిచ్చోడి చేతిలో రాయే.
మంచి మాట చెప్పినందుకు ధన్య వాదములు.

రేణూకుమార్ said...

The power of silence

Speech needs company,
Silence needs solitude.
Speech wants to conquer others,
Silence helps conquer oneself.
Speech makes friends or foes,
Silence befriends all.
Speech demands respect,
Silence commands it.
Speech is earth-bound,
Silence is heaven-bound.
Speech educates,
Silence exalts.
Speech is subjective,
Silence is objective.
Speech has regrets,
Silence has none.
Speech has limitations,
Silence is boundless.
Speech needs effort,
Silence a lot more.
Speech is human,
Silence is Divine.
While speaking you are heard by creatures,
In silence you hear the creator.
Silence leads to a stillness of the mind,
Then to introspection,
Then to self-cleansing,
Finally to liberation.

The definite sign of a spiritually minded person is his silent, tolerant attitude. Bees, until they have found the flower and tasted the honey, make a loud, buzzing noise; but the moment they taste the honey, they become absorbed and cease to make a sound. So it is with us. Before we find the truth, we argue and dispute and challenge others who differ from us; but when we come in contact with something deeper, we grow silent and do not try to force it on other minds. We try to live it in our own life inevitably it reaches other lives.

Spiritual qualities are infectious just as evil qualities are. One bad person can drag down many others by his evil propensities; while those who have noble ideals and loving characters uplift others merely by their silent influence.

When we study external conditions, it is sometimes very discouraging to see how slowly this influence works; but it can never fail absolutely. And if we wish to produce a lasting effect on any character, it is better not to have it work too quickly. When we set fire to hay, it makes a tremendous blaze, then in a moment it is all over; while a log fire, which takes a long time to kindle, burns steadily and is dependable. Similarly in spiritual awakening, if the person is over- enthusiastic and emotionally excited, he exhausts his forces and the effect wears off.

If, on the contrary, his deeper nature is touched, it may not show outwardly, but the result endures.
Limit yourself to observing. Take in everything that comes to your awareness whether big, small, trite or ordinary. Content of awareness is less important than the quality of awareness. As quality improves, so silence deepens, you will experience. You will discover, to your delight that revelation is not knowledge.

It is power: a mysterious power

Practice Creative Silence.

ఇక్కడ వున్న విశేషానికి సంబందించినది అని భావించినందువల్లనే ఆంగ్లమైనా ఇక్కడ కామెంట్ రుపంలొ అందిచాను.

- రేణూ కుమార్

psm.lakshmi said...

Thank you Renu Kumar garu
psmlakshmi