మన ఇళ్ళల్లో సాధారణంగా వింటూ వుంటాం. పెద్దవాళ్ళు పిల్లల్ని భయపెట్టటానికి తప్పు
చెస్తే కళ్ళు పోతాయమ, జాగ్రత్త అంటారు.
ఇది నిజమేనా? తప్పు చెసినంత మాత్రాన కళ్ళు పోయేటట్లయతే
ప్రపంచంలో చాలామందికి కళ్ళుకనిపించకుండా వుండాలికదా. అలా కాలేదంటే ఈ మాట నిజంకాదా?
చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు పిల్లల్ని దోవలో
పెట్టాలని మాట వరసకు చెప్పినా, పెద్ద తప్పులవల్ల కళ్ళు పోవటం తప్పదు. ఈ పెద్ద తప్పులేమిటి అన్నిటికన్నా పెద్ద తప్పులు మద్యపానం, పరస్త్రీని తప్పు దృష్టితో చూడటం. రెటీనాలో 10 పొరలు వుంటాయి. ఒక్కొక్క పొరకు ఒక్కో వ్యాధి..డయబెటిక్
రెటినోపతి, రే చీకటి, రెటినో ప్రీ మెట్యూరిటీ, రెటీనా బ్లాక్ స్టోమా, దీన్నే ఐ
కేన్సర్ అంటారు...ఇది 5 సంవత్సరాల లోపు పిల్లలకి వస్తుంది. ఒక్కోసారి కళ్ళు
తీసేస్తారు.
ఇంత చిన్న పిల్లలు ఏ తప్పు చేస్తారని అంత తీవ్ర
శిక్షలు అంటారా మన శాస్త్రాల ప్రకారం
పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే అన్నారు. ఎంత ఆస్తులు సంపాదించినా మనం పోయేటప్పుడు ఏమీ
తీసుకెళ్ళం అంటారు కానీ, మనం సంపాదించిన పాప పుణ్యాలు తప్పక మనతో తీసుకెళ్తాం
..మరి వచ్చే జన్మలో కూడా వాటిని అనుభవించాలికదా.
వీటిని పక్కన బెడదాం. సైన్స్ ఏమి చెబుతోంది సైన్స్ కూడా ఒప్పుకుంటుంది..మనిషి చేసే
తప్పులవల్లనే జబ్బులు వస్తాయని. ఉదాహరణకి
మనిషి తన తప్పుడ నడత వల్లనే సుఖ వ్యాధులు తెచ్చుకుంటాడు. వీటివల్ల కంటి జబ్బులు, ఆయుక్షీణం, అనేక రకమైన
వ్యాధులు. ఈ విషయాలలో అధ్యయనం చేసి రాసిన పుస్తకాలు ఎన్నో వున్నాయి. జ్యోతిష్య శాస్త్రాన్నీ, ధర్మ శాస్త్రలనీ నమ్మక
పోయినా సైన్స్ ని నమ్మేవాళ్ళు అనేకమంది. అదుపుతప్పిన మద్యపానం కళ్లమీద తీవ్ర
పరిణామాన్ని చూపిస్తుంది. అందరూ కావాలని
ఇలాంటి తప్పులు చెయ్యరు. కొన్ని
పరిస్ధితులు, కొందరు స్నేహితులు వగైరా ఎన్నో కారణాలు..చూసి తొక్కినా, చూడకుండా
తొక్కినా నిప్పు తొక్కితే కాలుతుంది.
వీటివల్ల వచ్చే బాధలు, వ్యాదులు, మనమొక్కళ్ళమే కాదు, వంశపారంపర్యంగా
అనుభవించాల్సివస్తుంది. అందుకే మన ఆలోచనా
పరిధి నియంత్రంచుకోవాలి. దీనివల్ల మన
కళ్ళని, మన ఆరోగ్యాన్నీ మనం రక్షించుకోవటమేగాక తర్వాత తరాల వారి ఆరోగ్యాన్ని కూడా
రక్షించిన వారమవుతాము.
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)