Friday, March 19, 2010

తప్పు చేస్తే కళ్ళు పోతాయి అంటారు. ఎందుకు?

Friday, March 19, 2010




మన ఇళ్ళల్లో సాధారణంగా వింటూ వుంటాం.  పెద్దవాళ్ళు పిల్లల్ని భయపెట్టటానికి తప్పు చెస్తే కళ్ళు పోతాయమ, జాగ్రత్త అంటారు.  ఇది నిజమేనా?  తప్పు చెసినంత మాత్రాన కళ్ళు పోయేటట్లయతే ప్రపంచంలో చాలామందికి కళ్ళుకనిపించకుండా వుండాలికదా.  అలా కాలేదంటే ఈ మాట నిజంకాదా? 

చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు పిల్లల్ని దోవలో పెట్టాలని మాట వరసకు చెప్పినా, పెద్ద తప్పులవల్ల కళ్ళు పోవటం తప్పదు.  ఈ పెద్ద తప్పులేమిటి  అన్నిటికన్నా  పెద్ద తప్పులు మద్యపానం,  పరస్త్రీని తప్పు దృష్టితో చూడటం.  రెటీనాలో 10 పొరలు వుంటాయి.  ఒక్కొక్క పొరకు ఒక్కో వ్యాధి..డయబెటిక్ రెటినోపతి, రే చీకటి, రెటినో ప్రీ మెట్యూరిటీ, రెటీనా బ్లాక్ స్టోమా, దీన్నే ఐ కేన్సర్ అంటారు...ఇది 5 సంవత్సరాల లోపు పిల్లలకి వస్తుంది. ఒక్కోసారి కళ్ళు తీసేస్తారు.

ఇంత చిన్న పిల్లలు ఏ తప్పు చేస్తారని అంత తీవ్ర శిక్షలు అంటారా  మన శాస్త్రాల ప్రకారం పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే అన్నారు.  ఎంత ఆస్తులు సంపాదించినా మనం పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళం అంటారు కానీ, మనం సంపాదించిన పాప పుణ్యాలు తప్పక మనతో తీసుకెళ్తాం ..మరి వచ్చే జన్మలో కూడా వాటిని అనుభవించాలికదా.

వీటిని పక్కన బెడదాం.  సైన్స్ ఏమి చెబుతోంది  సైన్స్ కూడా ఒప్పుకుంటుంది..మనిషి చేసే తప్పులవల్లనే జబ్బులు వస్తాయని.  ఉదాహరణకి మనిషి తన తప్పుడ నడత వల్లనే సుఖ వ్యాధులు తెచ్చుకుంటాడు.  వీటివల్ల కంటి జబ్బులు, ఆయుక్షీణం, అనేక రకమైన వ్యాధులు. ఈ విషయాలలో అధ్యయనం చేసి రాసిన పుస్తకాలు ఎన్నో వున్నాయి.  జ్యోతిష్య శాస్త్రాన్నీ, ధర్మ శాస్త్రలనీ నమ్మక పోయినా  సైన్స్ ని నమ్మేవాళ్ళు అనేకమంది.  అదుపుతప్పిన మద్యపానం కళ్లమీద తీవ్ర పరిణామాన్ని చూపిస్తుంది.  అందరూ కావాలని ఇలాంటి తప్పులు చెయ్యరు.  కొన్ని పరిస్ధితులు, కొందరు స్నేహితులు వగైరా ఎన్నో కారణాలు..చూసి తొక్కినా, చూడకుండా తొక్కినా నిప్పు తొక్కితే కాలుతుంది.  వీటివల్ల వచ్చే బాధలు, వ్యాదులు, మనమొక్కళ్ళమే కాదు, వంశపారంపర్యంగా అనుభవించాల్సివస్తుంది.  అందుకే మన ఆలోచనా పరిధి నియంత్రంచుకోవాలి.  దీనివల్ల మన కళ్ళని, మన ఆరోగ్యాన్నీ మనం రక్షించుకోవటమేగాక తర్వాత తరాల వారి ఆరోగ్యాన్ని కూడా రక్షించిన వారమవుతాము.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)




9 comments:

amma odi said...

Good one.

Unknown said...

"పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే"...
అంటే...పేదరికంతోనూ,ప్రమాదకరమైన వ్యాధులతోనూ బాధపడే వారిని శాస్త్రాల ప్రకారం ఆడిపోసుకోవటమేనా మనం వారికి చూపించే సానుభూతి?

durgeswara said...

చౌదరిగారు

ఈ బ్లాగర్ శాస్త్రవచనాన్ని చెబుతున్నాడంతే . ఇక అలా బాధలుపడేవారి పట్ల సానుభూతి చూపటం ,సహాయం చేయటం మానవులుగా అన్నీ బాగున్నవాల్లు చేయవలసిన పని. అదేకదా మానవత్వమంటే . అదిఉంటేనే కదా మనిషిగా గుర్తించబడెది ఇహంలో పరం లోకూడా ! కాబట్టి రెండు వేరు వేరుగా పరిశీలిద్దామండి .

మాలా కుమార్ said...

బాగుంది .

psm.lakshmi said...

అమ్మ ఒడిగారూ, మాలా కుమార్ గారూ
ధన్యవాదాలు.
psmlakshmi

psm.lakshmi said...

చౌదరిగారూ
ఎవరినీ ఆడిపోసుకోవటం ఈ బ్లాగు వుద్దేశ్యంకాదండీ. అవ్వన్నీ వున్నాయోలేదో మీకు సోదాహరణంగా నిరూపించలేనుగానీ, ఒక్క విషయం మాత్రం చాలామంది నమ్ముతారు...ఈ నమ్మకాలవల్ల మన ఆలోచనలని సక్రమమైన దోవలో పెట్టగలిగితే మనతోబాటు మన చుట్టూ వాళ్ళందరికీ మేలు జరక్కపోయినా కనీసం కీడు జరగదు. ఆ విధంగా నమ్మకాలవలన లాభమేకదా.
ఏ విషయంనుంచైనా గుడ్డిగా కాకుండా, ఆలోచించి మంచిని స్వీకరించటానికి చాలామంది ఇష్టపడతారు. మంచిని పెంచండి..మంచిని పంచండి..దీనివల్ల, ఏ నమ్మకాలున్నవాళ్ళకైనా, అలాగే ఏ నమ్మకాలూ లేనివాళ్ళకి కూడా మంచే జరుగుతుంది.

దుర్గేశ్వరగారూ
సరిగ్గా అర్ధం చేసుకున్నారు, చక్కగా చెప్పారు, ధన్యవాదాలండీ.
psmlakshmi

Unknown said...

మన కళ్ళని, మన ఆరోగ్యాన్నీ రక్షించుకోవటం కోసం చక్కని విషయాలు చెబుతున్నారు...థాంక్స్! శాస్త్రాల ప్రకారం పూర్వ జన్మ కృతం అంటూ మనలో చాలామంది బాధా సర్పదృష్టుల్ని ఛీత్కరించుకుంటున్నారు...మా అత్తగారు కేన్సర్ వ్యాధివల్ల మృత్యువుతో పోరాడుతున్నప్పుడు ఆమె దగ్గరి బంధువులే అలా అన్నారు...అటువంటి మూఢనమ్మకాలతో లోకాన్ని చూసె వారిని ఉద్దేశించి అలా కామెంట్ వ్రాశానే తప్ప మీ బ్లాగుని ఉద్దేశించి కాదు. (ఈ వివరణ నేను ఆ కామెంట్ వ్రాసిన్నప్పుడే ఇచ్చుండాల్సింది...)

psm.lakshmi said...

చౌదరిగారూ
ఆవిడ బాధను చూడలేనివాళ్ళుకూడా అనుకుని వుండచ్చుకదా, ఇంత మంచి మనిషమ్మా, ఎంత బాధ పడుతోందో, ఏ జన్మలో చేసిన పాపమో అని. ఏది ఏమైనా ఈ నమ్మకాలవల్ల కనీసం కొంతమంది, కొన్నిసార్లయినా చెడు పనుల జోలికి పోకుండా వుంటున్నారని నా నమ్మకం.
psmlakshmi

astrojoyd said...

chowdary jee,dharma saastra vishyallo ento coding[rahasyam]nikshptam iyi untundi.కళ్ళు అనే పదమునకు సంతానము/సంతతి అనే అర్ధాలున్నాయి.ఇక్కడ కళ్ళు పోతాయి అంటే అర్ధం దేహంలోని కళ్ళు అని కాదు.మీరు చేసే తప్పులు మీ సంతానానికి/సంతతికి చేటును కల్గిస్త్తాయని పరోక్షంగా హెచ్చరించడం.ఎవరి సంతతి వారికి ముద్దు గనుక ,ఆ ముద్దుతో అయినా తప్పులు చేయకుండా ఉంటారని.కాలానుగుణంగా దీనిని పిల్లలపైన కూడా మనం వాడుతున్నాము అంతే ---jayadev