Tuesday, March 2, 2010

ఏ శివ లింగాలకు పూజ చేస్తే ఎలాంటి ఫలితం వుంటుంది?

Tuesday, March 2, 2010



జ్యోతిర్లింగాలకు పూజ చేస్తే విశేష ఫలితం వుంటుంది.  అలాగే సిధ్ధులు, పురాణ పురుషులు, మహిమాన్వితులు ప్రతిష్టచేసిన లింగాలను పూజించినా మంచి ఫలితం వుంటుంది.  స్వయంభూ లింగార్చన కూడా.

లింగాలలో అనేక రకాలు వున్నాయి.  వాటిని పూజిస్తే వివిధ రకాల కామ్యాలు సిధ్ధిస్తాయంటారు.  అవేమిటో తెలుసుకుందామా?                        

వజ్ర లింగాన్ని పూజిస్తే ఆయుః వృధ్ధి,  ముత్యం లింగాన్ని సేవించటం రోగ నాశకరం, పద్మరాగ లింగం లక్ష్మీ ప్రాప్తినిస్తుంది, పుష్యరాగం లింగాన్ని పూజిస్తే యశస్సు, నీలం లింగం ఆయుః వృధ్ధి, మరకత లింగం పూజ సుఖ ప్రాప్తి, స్ఫటిక లింగార్చన సర్వకామనలనూ సిధ్ధింపచేస్తుంది.  లోహ లింగ పూజ శతృనాశనాన్ని చేస్తుంది, ఇత్తడి లింగార్చన తేజస్సునిస్తుంది.  గంధం లింగార్చన స్త్రీలకు సౌభాగ్యాన్నిస్తుంది, వెన్న లింగం మోక్షాన్ని ప్రసాదిస్తుంది, ధాన్యపు పిండితో చేసిన లింగార్చనవల్ల ఆరోగ్యం బాగుపడుతుంది.

ఇలా రక రకాల లింగార్చనలవల్ల రకరకాల ఫలితాలున్నాయి.  రసలింగం, అంటే పాదరసం వున్న లింగానికి అభిషేకం చేసి ఆ తీర్ధం సేవిస్తే సర్వవ్యాధులు నాశనమవుతాయని ప్రసిధ్ధి.  ఇది పరిశోధనల ద్వారా కూడా నిర్ధారింపబడినది. ఈ తీర్ధాన్ని సేవించటంవల్ల కేన్సర్ వగైరా పెద్ద వ్యాధులు పోవటమే కాకుండా మానసిక చింతలు దూరమయి మనశ్శాంతి కలుగుతుంది.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

మనలో మాట

ఈ పాదరస శివ లింగం గురిచి నేను సేకరించిన మరికొన్ని విశేషాలు చదవండి

పాదరస శివ లింగాన్ని పూజించిన వారికి నెరవేరని కోరికలు వుండవు అని బ్రహ్మ పురాణంలో చెప్పబడింది.  ఈ లింగం చిన్నగా వున్నా చాలా బరువుగా వుంటుంది.  దీన్ని ఇంట్లో వుంచి కూడా నిత్యం పూజ చేసుకోవచ్చు. 

మన దేశంలో పాదరస శివలింగం వున్న ఒకే ఒక దేవాలయం ఉజ్జయినిలో సిధ్ధాశ్రమం.  ఇక్కడి శివ లింగం బరువు సుమారి 1500 కిలో గ్రాములు.  ఫ్రపంచంలో ఎక్కడా ఇటువంటి శివలింగం లేదంటారు.  భక్తులు ఈ లింగాన్ని తాకి దర్శనం చేసుకోవచ్చు.  మనిషిలోని నెగటివ్ ఎనర్జీ తగ్గించే శక్తి ఈ లింగానికి వుంది.  ఈ శివ లింగానికి కొంతసేపు తల ఆన్చితే తలలో నరాలకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయని అక్కడివారి నమ్మకం.



0 comments: