Thursday, March 10, 2011

చెక్క విగ్రహాలు ఇంట్లో పూజలో పెట్టుకోవచ్చా

Thursday, March 10, 2011


చాలామంది ఏ యాత్రలకో, బజాలో వెళ్ళినప్పుడు అందమైన చెక్క విగ్రహాలు కనబడితే ఇష్టంగా కొనుక్కొచ్చుకుంటారు. ఆ చెక్క బొమ్మలు దేవుడివయితే కొందరు పూజలో కూడా పెట్టుకుంటారు. కానీ అది సరైన పని కాదు. మరి అర్క గణపతిని పూజిస్తారే..అదీ చెట్టునుంచి వచ్చిందేగా అంటారా? మీ పాయింటూ కరెక్టే. అయితే దుకాణాల్లో అమ్మేవన్నీ అర్క గణపతులు కాదు. అసలు అర్క గణపతి ఎలా వస్తుంతో తెలుసా? తెల్ల జిల్లేడు పెద్దగా అయిన తర్వాత, అంటే కనీసం 10 సంవత్సరాల తర్వాత చెట్టు వేళ్ళకి గణపతి ఆకృతి స్వయంసిధ్ధంగా ఏర్పడుతుంది. ఆ చెట్టు పూర్తిగా ఎండాక జాగ్రత్తగా ఆ గణపతి ఆకారాన్ని తీస్తారు. అర్క గణపతి ఆకృతి సంతరించుకోవటం మామూలు విషయం కాదు.

అలాంటి అర్క గణపతికి కూడా అభిషేకం చెయ్యకూడదు. కేవలం పుష్ప పూజ, సంప్రోక్షణ మాత్రమే చెయ్యాలి. భగవంతుడు ఎన్ని మహిమలు చూపించినా ఏ వస్తువుకుండే సహజసిధ్ధ గుణాలు ఆ వస్తువుకి వుంటాయి. చెట్టుకుండే గుణాలు చెట్టునుండి వచ్చిందికనుక అర్క గణపతికుంటాయి.

అలాగే ఇతర చెక్కలతో తయారుచేసిన విగ్రహాలుకూడా. స్వభావ సిధ్ధంగా చెక్కకి పగుళ్ళు రావచ్చు, విరిగి పోవచ్చు, చెదలు, పురుగులు పట్టచ్చు. అలాంటి విగ్రహాలకు పూజ చెయ్యంకదా. అందుకే చెక్క విగ్రహాలు నిత్య పూజలో పెట్టకూడదు.


(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


2 comments:

said...

monna ide gee telugu lo chepparu

psm.lakshmi said...

సాధారణ పౌరుడు గారూ
మీరు చెప్పింది నిజమే. నా పోస్టు కింద చూడండి. జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా అని వుంటుంది. ఆ ప్రసారాలలో నాకు నచ్చిన కొన్నింటిని, ఆ ప్రోగ్రామ్ చూడటం కుదరని వారికోసం గోపురం అనే కేప్షన్ లో ఇస్తున్నాను.
psmlakshmi