Thursday, March 31, 2011

దేవాలయంలో ఇంకెవరికీ నమస్కరించకూడదా?

Thursday, March 31, 2011

దేవాలయంలో దైవ దర్శనానికి కూడా కొన్ని పధ్ధతులున్నాయి. వరుసగా గణపతి, ఉపాలయాలు, తర్వాత ప్రధాన దైవాలు. ప్రధాన దైవ దర్శనం తర్వాత, ఆ దైవాన్ని పూజించిన తర్వాత ఆ దైవానికన్నా శక్తివంతులు ఆ ఆలయంలో ఇంకెవరూ దర్శనీయులుగానీ, పూజనీయులుగానీ వుండరు. అందుకనే ఆ దైవంముందు ఇంకెవరికీ నమస్కరించకూడదు. కొందరు, పరిచయస్తులకీ, ప్రముఖులకీ, దేవాలయాల్లోకూడా నమస్కరిస్తారు. దైవం కన్నా అంతా అన్నివిధాలా చిన్నవారే. అందుకనే దైవం ముందు మానవులకు నమస్కరించటం ఇరువురికీ మంచిదికాదు. మరి ఎలాగండీ తెలిసినవారు కనిపిస్తే పలకరించవద్దా అంటారా? పలకరింపులకు అనేక మార్గాలున్నాయి…చేతులు జోడించి నమస్కారమే అక్కరలేదు.

కొందరు అక్కడవున్న అర్చకులపాదాలకు నమస్కరిస్తారు. అదికూడా మంచి పధ్ధతికాదు. నమస్కరించినవారు దైవంకన్నామానవులకు ఎక్కువ గౌరవాన్నిచ్చినట్లు..అలా చేయటంవల్ల వారికి పాపం. నమస్కారం అందుకున్నవారుకూడా దైవంకన్నా తాము అధికులమని అహంకరించినట్లు..వారికీ మంచిది కాదు. తప్పనిసరి పరిస్ధితుల్లో ఎవరికైనా నమస్కరించాల్సివస్తే అక్కడవున్న దైవం పేరు చెప్పి నమస్కరించాలి. అంటే ఆ నమస్కారం ఆ దైవానికే చెందుతుంది.

ఆలయాల్లోనేకాదు, కొన్ని ప్రధాన ఆలయాలున్న కొండలమీదకూడా…అంటే తిరుపతి, శ్రీశైలం లాంటి ఆధ్యాత్మికంగా మహోన్నతమైన ఆలయాలున్న కొండలమీద ఆ ఆలయాల్లోనే కాదు, ఆ కొండలమీదకూడా ఎవరికీ నమస్కరించకూడదు. అవసరమైనప్పుడు మార్గం వుందికదా..అక్కడి దైవం పేరుచెప్పి నమస్కరించాలి..అంటే వారిలోకూడా ఆ స్వామినే చూసి ఆ స్వామికి నమస్కరించినట్లు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



1 comments:

రావెమ్మెస్సారెల్ said...

అంతే కాదు, లక్ష్మిగారూ!
గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ,
దైవం వెనుకవైపు భాగంలో గోడను తాకి, నమస్కరిస్తారు.
ఇది ఎంతమాత్రం సరిగాదు.
ఆగమశాస్త్రం ఈ నమస్కారం కూడదంటుంది.
అంతే కాదు వెనుకభాగంలో కొంత దూరం వదలి ప్రదక్షిణ
చేయాలి.
raomsrl28@gmail.com