Thursday, May 20, 2010

మదర్స్ డే గిఫ్ట్

Thursday, May 20, 2010





ఈ మారు మదర్స్ డే న నాకో అద్భుతమైన బహుమానం వచ్చింది.  అదేమిటో ఎవరైనా ఊహించగలరా    ఆద్భుతమైన రంగుల కలయికతో, అపురూపమైన డిజైన్లతో కూడిన చీనీ చీనాంబరాలు కాదండీ.  నక్షత్రాలకన్నా అందంగా మెరిసే వజ్రాల వడ్డాణం కానే కాదు.  దేశదేశాలనుంచీ తెప్పించిన పసందైన పిండివంటలంతకన్నాకాదు.  నాకు ప్రధాన మంత్రి పదవి అస్సలే కాదు.  సరే.  మీరెవరూ గెస్ చెయ్యలేదు కదా.  నేనే చెప్పేస్తాను. 

మదర్స్ డే తోబాటు అమెరికాలో వుంటున్న మా అమ్మాయి చి. దీప్తి మాకు తెలియనివ్వకుండా వచ్చి మమ్మల్ని అద్భుతమైన సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది.  ఇంకో వారం తర్వాత వస్తుందనుకున్న తను అనుకోకుండా మదర్స్ డేన రావటంకన్నా అద్భుతమైన మదర్స్ డే గిఫ్ట్ నాకు ఇంకేముంటుంది.  అర్ధరాత్రి 1-30 కి ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళ్ళిన మా అబ్బాయి వస్తే నిద్ర మెలకువ వచ్చింది.  వెనకే వాడి ఫ్రండ్ క్రాంతి.  నిద్రమత్తులో కళ్ళు మూసుకోబోతుండగా మావారి అనుమానం అక్కడెవరూ అని.  మా వాడి ఫ్రెండే అయ్యుంటారు, ఎవరా అని మూతలు పడుతున్న కళ్ళు చించుకుంటూ....ఎవరూ?  బాగా పరిచయమయినవాళ్ళే! అరే!! తను...తను...నా పాపాయే!!!.  అరె...పాపాయ్!!!!  ఒక్కసారి లేచి నుంచున్నాను.  పాపాయ్...కలా...నిజమా...హేపీ మదర్స్ డే అంటున్న పాపాయిని ఒక్క వుదుటున అమ్మ ప్రేమతో ముంచెత్తాను.

ముందునుంచీ మాకు ఈ నెల 16 వ తారీకున వస్తానని చెబుతోంది. మా అబ్బాయికూడా దానికి వంత పాడుతున్నాడు.  వాళ్ళకి తెలుసు.  కానీ మాకు సర్ ప్రైజ్ ఇవ్వాలని వేరే రోజు వస్తున్నట్లు చెప్పారు.   ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ప్రతి రోజూ ఎదురుచూస్తూ,  ఆ రోజు తను ఈ టైముకు ఇక్కడ వుంటుంది అని ముందునుంచీ  తన రాకని వూహిస్తూ, తనకోసం ఏం చెయ్యాలో ఆలోచిస్తూ, ఓహ్...ఇంకో వారం రోజులు మాకా ఎదురు చూపులు తప్పించింది. 

నిద్ర మత్తులో మదర్స్ డే తొలి ఘడియలలో కళ్ళు తెరిచిన తల్లికి ఎన్నో వేలమైళ్ళ దూరాన వున్న కూతురు అనుకోకుండా కళ్ళ ఎదురుగా కనబడితే అంతకన్నా విలువైనా, అపురూపమైన, అద్భుతమైన బహుమానం ఎక్కడ వుంటుంది.  ఏ వజ్రాల రాసులు ఈ అద్భుతమైన బహుమతికి సరి తూగుతాయి.  మీరే చెప్పండి.

అప్పుడే రాసిన ఈ పోస్టును మీతో పంచుకోవటానికి ఇంతకాలం పట్టింది మా పిల్లల సందడివల్లే.

8 comments:

అశోక్ చౌదరి said...

Yeah.. Its really a nice gift.. :-)

భావన said...

very nice gift mala garu. You are lucky to have a daughter like her. Belated Happy Mothers day.అందరు ఎర్లీ గా చెప్పేసేరు కదా నేను అందుకని లేట్ గా చెపుతున్నా. :-)

Unknown said...

very nice Lakshmi garu.. A true gift on a lovely day.

మాలా కుమార్ said...

చాలా సంతోషం అండి . ఏ అమ్మ కైనా ఇంతకు మించి న బహుమతి ఏముంటుంది ?
ఏయ్ భావనా ఇది రాసింది నేను కాదోయ్ , లక్ష్మి గారు . హి హి హి

చెప్పాలంటే...... said...

intakannaa manchi gift eami vuntundi cheppandi.....me paapai mekichina adbhutamaina gift chalaa chalaa baagundi..

జ్యోతి said...

మీ ఆనందం మాకు కనిపిస్తుంది.. :)

శ్రీలలిత said...

లక్ష్మిగారూ,
అసలు మదర్స్ డే అంటే అదే కదా. అమ్మ తో కలిసి పిల్లలు ఉండడం. మీ అమ్మాయి దానిని బాగా అర్ధం చేసుకుంది. మీ ఆనందమంతా మీ పోస్ట్ లో తెలుస్తోంది. ఎంజాయ్...
శ్రీలలిత..

Unknown said...

psmlakshmiblogspotcom గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.