యాత్రలు చాలా చేస్తున్నారు..పుణ్యం చాలా
సంపాదించేశారే. .మోక్షం కోసమా...ఇలాంటి
ప్రశ్నలతో విస్మితురాలినయ్యాను. యాత్రలు
చేసినంతమాత్రాన మోక్షం వచ్చేస్తే నాకు పోటీగా ఎంతమంది యాత్రలు చేసేవాళ్ళుంటారో..కదా...అయినా
నాకెందుకో జన్మ రాహిత్యం ఇష్టం లేదు. జన్మ
వుందో లేదో నాకు తెలియదుగానీ వుంటేమాత్రం మంచి మనిషిగా పుట్టాలనుకుంటాను. స్త్రీ, పురుషులలో ఏ రూపమయినా పర్వాలేదు. ఈ జన్మలో స్త్రీగా పుట్టటంవల్ల నేను పెద్ద
ఇబ్బందులు పడలేదు అనటంకన్నా ఇబ్బందులు పడకుండా ఎప్పుడూ ఏదో రక్ష లభించింది అంటే
సరిగ్గా వుంటుందేమో.. అందుకే మనం చేసే
మంచి మనల్ని కాపాడుతుందనే విశ్వాసం వున్నది.
అదృష్టవశాత్తూ ఈ జన్మలోకూడా అవకాశం వున్నంతవరకూ నాకు చేతయినంతమటుకూ మంచే
చేశాను. ఏ విషయంలోనైనా నాకు నేను సమాధానం
చెప్పుకోగలిగే స్ధితిలోనే వున్నాను.
అందుకే స్త్రీగా పుట్టాలంటే నాకు భయంలేదు.
ఇంకా చెప్పాలంటే కొంచెం గొప్పగా కూడా
వుంటుందేమో. స్త్రీలకున్న ఆప్యాయతలూ,
అభిమానాలూ, అందరూ తనవారనుకునే స్వభావం, తనకోసం చూసుకోకుండా ఎదుటివారిగురించి
ఆలోచిచే నైజం, కుటుంబాన్ని ఒక్క తాటిమీద నడపగలిగే నైపుణ్యం, అంటే ఓర్పు, నేర్ప, త్యాగం, సహనశీలత, మగ పుట్టుకలో వుందా ఏమో.
బహుశా అందరిలో అన్నిగుణాలూ పోతపోసి వుండవేమో. ఎందుకంటే వుంటే వాళ్ళు ఆడవళ్ళల్లాగానే పుడతారు.
అయితే వీటన్నింటితోపాటు భగవంతుణ్ణి ఇంకొక్క వరంకూడా
స్త్రీకి ఇవ్వమని గట్టిగా అడుగుదామనుకుంటున్నా. స్త్రీలందరూ ఈ విషయంలో విప్లవం
చేసయినా సరే సాధించాల్సిన అవసరం ఎంతయినా వుంది.
అదే, దాడిచేసే మగవాడిని అణగదొక్కే శక్తి...ఆలంబనలేని అతివలకి ప్రపంచాన్ని
ఎదుర్కొనే శక్తి యుక్తులు. స్త్రీకి
ప్రేమేకాదు, అవసరమైతే అపర కాళికలాగా అవతరించే శక్తి కూడా కావాలి.
5 comments:
బాగుందండి మీ కోరిక .
ఇది అందరి కోరిక కూడానండీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
మీరు తప్పకుండా శక్తివంతమైన స్త్రీ గానే రూపొందాలి. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
నిజంగా మీరు కోరుకున్నట్టే జరిగితే అంతకన్న కావల్సింది ఏముంది?
"ఈ జన్మలో స్త్రీగా పుట్టటంవల్ల నేను పెద్ద ఇబ్బందులు పడలేదు అనటంకన్నా ఇబ్బందులు పడకుండా ఎప్పుడూ ఏదో రక్ష లభించింది అంటే సరిగ్గా వుంటుందేమో.." ----
ఏ సమస్యలూ లేకుండా జీవితం పట్ల సంతృప్తిగా ఉన్న చాలా మంది మహిళల (నాతో సహా) విషయంలో ఇదే నిజమనుకుంటాను.
మీ కోరిక నెరవేరాలని కోరుకుంటాను.
Post a Comment