అదేంటి,
పాము కాటేస్తే మనుషులు చచ్చిపోరా అని అడుగుతున్నారా? నిజానికి అన్ని పాములూ కాటేస్తే మనుషులు చచ్చిపోరండీ. విషపూరితమైన పాములు కాటేస్తే మాత్రమే చనిపోయే
అవకాశాలున్నాయి...అది కూడా సకాలంలో సరైన వైద్యం అందకపోతేనే.
మరి అధ్యయనాలు ఏమి చెబుతున్నాయి? పాముల్లో కొన్ని వందల రకాలున్నాయి. అవ్వన్నీ కరిచినంత మాత్రాన మనిషికి ఏమీ
కాదు. అయితే విషపూరితమైన పాములు కాటేస్తే,
వెంటనే ప్రధమ చికిత్స, పైద్య సహాయం అందకపోతే ప్రాణాలుపోయే అవకాశం వుంది. పరిశోధనలు ఏమి చెబుతున్నాయంటే, సాధారణ పాములు కరిస్తే ఏమీ కారుకానీ, ఆ పాము
కాటుకన్నా, పాముకరిచిందే, ఇంక నేను బ్రతకను అనే అధైర్యంతో గుండె ఆగి మరణించేవారి
సంఖ్యే ఎక్కువ.
కొందరు పాము కాటేస్తే, కాటేసిన మనిషి గురించి
జాగ్రత్త తీసుకోకుండా, కాటేసింది ఏ పాము...నాగుపామా, కట్లపామా..అనే పరీక్షకోసం
దాని వెనకాలబడతారు. అలా కాకుండా ముందు
పాము కరిచిన వ్యక్తికి ప్రధమ చికిత్స అందించాలి.
పాము కరిస్తే మనమేం చెయ్యగలమని అనకండి.
ఒకవేళ అది విషపూరిత పామైతే ఆ విషం శరీరమంతా ఎక్కకుండా, కరిచిన చోటుకి
కొంచెం పైన ఒక గుడ్డతోగాని, తాడుతోకాని, గట్టిగా కట్టి, ఆ చెడు రక్తం శరీరమంతా
పాకకుండా జాగ్రత్త పడాలి. పాము కరిచిన
వ్యక్తికి గాలి ధారాళంగా ఆడేటట్లు వుంచి వెంటనే వైద్య సహయం అందించాలి. ఆ వ్యక్తికి కరిచింది మామూలు పామేనని, ఏమీ
కాదని ధైర్యం చెప్పాలి. దానితో మామూలు
పామైతే పాముకాటు భయంతో గుండెపోటు అవకాశాలు తగ్గుతాయి, తర్వాత సకాలంలో వైద్య
సహాయంతో ప్రాణాపాయమేమైనా వుంటే దానినుంచీ బయటపడచ్చు.
పామేకాదు, ఏ సమయంలోనైనా, ఏ విషపురుగు కుట్టినా
అన్నింటికన్నా ఆ కరవబడ్డ వ్యక్తికి ధైర్యం, సకాలంలో వైద్యం ఆపదనుంచీ బయటపడటానికి
అత్యవసరం.
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)
2 comments:
లక్ష్మి గారూ,
మంచి టాపిక్ చెప్పారు...కానీ ఎప్పుడూ తాడుతో కట్టటం లాంటివి చెయ్యకూడదు...దానివల్ల ఉపయోగమేమీ లేకపోగా, కాలికి రక్తప్రసరణ అందక అంతవరకి చచ్చిపోయే(GANGRENE)ప్రమాదముంది....కాలుని వీలైనంతవరకు కదలకుండా(IMMOBILISE) ఉంచాలి...వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి....
పాము కరిస్తే ఆ పాముకాటు కన్న ముందు భయం తోనే సగం చచ్చిపోతారు. నిజం గా విషపూరితమైన పాములు చాలా కొద్దిగా ఉంటాయని చదివాను. మీ టపా చాలా ఉపయోగకరం గా ఉంది.
Post a Comment