పురాణాలలో కధ ప్రకారంకూడా గాంధారి గర్భపాతం
చేసుకున్నప్పుడు ఆ అండాన్ని కుండలలో ఆవునెయ్యిలో భద్రపరిచారుట. ఆయుర్వేదంలో ఎన్నో మందులలో ఆవునెయ్యి
కలుపుతారు. ఘృతం అంటారు ఆవునెయ్యిని. ఆవునెయ్యికి కొన్ని ఏళ్ళవరకు భద్రపరిచే గుణం
వుంది.
ఆరోగ్యానికి కూడా ఆవునెయ్యి మంచిది. ఈ మధ్య ఆరోగ్యంకోసమని చాలామంది నెయ్యి, నూనె
తినటం మానేస్తున్నారు. కానీ ఆవునెయ్యి
తినటంవల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో
వుంటుంది. రోగ నిరోధక శక్తి
పెరుగుతుంది. అల్సర్స్ నయమవుతాయి. జీర్ణక్రియని ఉత్తేజపరిచి జీర్ణకోశాన్ని
కాపాడుతుంది. శరీరంలో దోషాల్ని
కొట్టేసి కురుపులు రాకుండాఆరోగ్యాన్ని
కాపాడుతుంది. అందుకే రోజూ ఆహారంలో నియమిత
రూపంలో ఆవునెయ్యి వాడాలి.
ఆవునెయ్యి మేధస్సును పదునుపరుస్తుంది. కళ్ళకి మంచి చేస్తుంది. మనసును ప్రశాంతంగా వుంచుతుంది. జీర్ణక్రియను బాగుపరుస్తుంది. అందుకే మిగతా నూనెలు మానేసినా రోజూ రెండు
చెంచాలు ఆవునెయ్యిని ఆహారంతో తీసుకుంటే ఎన్నో రోగాలనుంచి దూరంగా వుండవచ్చు.
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)
0 comments:
Post a Comment