Wednesday, December 22, 2010

ప్రమదావన జ్యోతికి పుట్టిన రోజు జేజేలు

Wednesday, December 22, 2010

 ప్రమదావన జ్యోతికి పుట్టినరోజు జేజేలు

ఈరోజు మన జ్యోతి పుట్టిన రోజు.  రెండేళ్ళ క్రితం ఈ జ్యోతి ఎవరో తెలియదు.  ఎక్కడ వుంటుందో తెలియదు.  అసలు ఏం చేస్తుందో తెలియదు.  కానీ ఇప్పుడు బ్లాగర్లల్లో చాలామందికి మిత్రురాలు.  ప్రమదావనంలో అందరికీ ఆప్త మిత్రురాలు,  వెరసి మన జ్యోతి.  అంతేకాదు.  మొన్న మొన్నటిదాకా ఏమీ తెలియని ఈ గృహిణి కంప్యూటర్ కీ బోర్డుమీద చెయ్యి పెట్టినదగ్గరనుంచీ  ఆ కంప్యూటర్ విద్యల లోతుపాతులు, ముఖ్యంగా బ్లాగులకు సంబంధించి, ఇట్టే అవుపోసనపట్టి నాలాంటి ఎందరో బ్లాగర్ల బ్లాగుల డిజైనర్ అయింది, ఎందరో కొత్త బ్లాగర్లకు బ్లాగ్ గురు అయింది.  అందుకే మా బ్లాగ్ డిజైనర్ కి, బ్లాగ్ గురుకి పుట్టిన రోజున  శుభాకాంక్షలు ఈ చిరుకానుకతో. 


తొలి పూజలందుకునే ఆ విఘ్ననాయకుడు తన తల్లి దండ్రులతో సహా సదా మీపై తమ కరుణా  కటాక్ష వీక్షణాలు ప్రసరింప చెయ్యాలని ఆకాంక్షిస్తున్నాను.


రోజంతా హాయిగా గడిపి సాయంత్రం కుటుంబ సభ్యులతో సంతోషంగా షికారుకెళ్ళిరండి.  మరొక్కసారి పుట్టినరోజు  శుభాకాంక్షలు.




2 comments:

SRRao said...

లక్ష్మి గారూ !
జ్యోతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీద్వారా ..............

జ్యోతి said...

లక్ష్మిగారు, ఫోనులో, బ్లాగులో, ఇంటికొచ్చి మరీ నన్ను అభినందించినందుకు ధన్యవాదాలు తప్ప ఏమివ్వగలను.. థాంక్స్..