మన పూర్వీకులు క్రమశిక్షణకోసం, సక్రమమైన జీవన
విధానానికి ఏ వేళకి ఏమి చెయ్యాలో నియమాలు, ఎన్నో పరుధులు ఏర్పాటుచేసి, ఎక్కడెక్కడ
ఎలా నడుచుకోవాలో కొన్ని విధులు ఏర్పరచారు.
వాటిని నెరవేరిస్తే మనిషి సంతోషకరమైన జీవనం గడపగలడుచ
ప్రపంచంలో ప్రతి ప్రాణీ దైవ స్వరూపమే. మనిషి ఆ సద్భావంతో సత్ఫ్రవర్తన కలిగి వుండాలి. లేకపోతే మనం ఇప్పుడు ఏ అవయవంతో ఏ దోషం చేస్తామో
మరు జన్మలో ఆ అవయవాలకి అలాంటి దోషాలుకలిగి బాధపడాల్సివస్తుంది. పాపం అంటే ఎక్కడో మనకు కనబడకుండా
వుండేదికాదు. మన నిత్యజీవితంలో మన ఎదురుగా
కనబడే అడ్డంకులు, రోగాలు, చికాకులే. మనం
ప్రశాంతమైన జీవితం గడపాలంటే మనమీద ఆధారపడినవారికి, ప్రకృతికి మనం ఎలాంటి హానీ
చెయ్యకుండా జీవించాలి.
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)
0 comments:
Post a Comment