Wednesday, June 16, 2010

బంతిపూలు పూజకి పనికి రావా?

Wednesday, June 16, 2010




మనం అనేక రకాల పూలతో దేవునికి పూజ చేస్తాం.  మరి బంతి పూలతో ఎందుకు పూజ చెయ్యకూడదు?  బంతి పూలు పెద్దగా వుంటాయి, రకరకాల రంగుల్లో వుంటాయి, అందంగా, ఆకర్షణీయంగా వుంటాయి,  సువాసనలు వెదజల్లుతూ వుంటాయి, మరి అవి చేసుకున్న పాపం ఏమిటి?  వాటితో ఎందుకు పూజ చెయ్యకూడదు  అన్ని శుభ కార్యాలకూ పనికి వస్తాయిగా.  పండగకానీ, ఏ శుభకార్యమయినా వచ్చిందంటే బంతిపూల దండలు గుమ్మాలనలంకరించాల్సిందే.  మరి శుభ కార్యాలకు పనికి వచ్చినప్పుడు దైవ పూజకెందుకు పనికి రావు?  పండగల్లో, ఇంట్లో శుభ కార్యాలు జరిగినప్పుడు ఇంటికి మనుషులు ఎక్కువగా వచ్చి పోతూ వుంటారు.  అలాంటి సందర్భాలలో ఎక్కువ బాక్టీరియా ఇంట్లోకి ప్రవేశించరాదని బంతి పూలని గుమ్మానికి కడతారు.  వాటికి క్రిమి కీటకాలను ఆకర్షించి, నాశనం చేసే శక్తి వుంది.  అందుకు.  మరి అలాంటి పూలని దేవతా విగ్రహాలకి వాడితే మంచిదేనా?  గుళ్ళో విగ్రహాలకు బంతి పూల మాలలు వేస్తే చుట్టుప్రక్కల వున్న క్రిమి కీటకాలు అక్కడ చేరుతాయి.  దేవాలయాలలో దేవుని దగ్గర వుపయోగించే పూలు, అగరుబత్తి, ధూపం, హారతి, గంట అన్నీ క్రిమి కీటకాలని పారద్రోలేవిగా వుంటాయి.  మరి క్రిమి కీటకాలను ఆకర్షించే బంతిపూలు దేవుడికి వేస్తే వాటి వల్ల దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందికదా?  అందుకే బంతి పూలతో పూజ వద్దంటారు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

2 comments:

astrojoyd said...

అసలు కారణం అది కాదు.బంతి -కామ్పోజిటే, కుటుంబానికి చెందిన మొక్క.సూర్యకాంతం లేదా సన్-ఫ్లవేర్ కూడా ఈ తరగతికి చెందినదే.ఈ తరగతి మొక్కలన్నింటికి ఒక చిత్రమైన లక్షణం ఏమంటే ,వీటిలో ఎదీకూడా ఒకే పువూ కాదు ,పలు పువ్వులు కలసి ఒకే పువ్వుగా కనిపిస్తాయి ,అంటే ఇవి సంయుక్త పుష్పాలు. [ కామ్పోజిటే -అనే మాటకు అర్ధం ఇదే /కలసిఉన్న అని]ఆగమ పూజా విధానంలో 'బంతి/చామంతి/సూర్యకాంత వంటి సంయుక్త పుష్పాలు పూజకు అనర్హమైనవిగా చెప్పబడి ఉన్నాయి.ఐతే కామ ప్రధానమైన ,అంటే -సంతానం/వివాహం వంటి కోర్కెలను తీర్చుకునేతందుకు చామంతులను వాడవచ్చును అని 'పుష్పసిన్ధువు"గ్రంథం పేర్కొన్నది -ఈ కారణంగా పై రెండు పుష్పాలు పూజకు పనికిరాని పువ్వులైనాయి --జయదేవ్.చల్లా/చెన్నై-౧౭

psm.lakshmi said...

ధన్యవాదాలు జయదేవ్ గారూ
psmlakshmi