Sunday, May 3, 2009

కొంటె కోణాలు-6

Sunday, May 3, 2009
కొంటె కోణాలు-6

మీకు తెలుసా?


పోలీసులు కష్టపడి నేరస్తులను పట్టుకుంటారు. వారిని అట్టహాసంగా మీడియా ముందు ప్రవేశ పెడతారు. వాళ్ళు చేసిన నేరాలను, వాళ్ళను పట్టుకున్న విధానం చెప్తారు. బాగానే వుంది. కానీ ఆ సమయంలో వాళ్ళ ముఖాలకి నల్ల ముసుగులు తొడుగుతారు. వాళ్ళని ఎవరూ గుర్తు పట్టకుండా జాగ్రత్త పడతారు. వాళ్లకాముసుగులు తేకపోతే వాళ్లు నేరస్తులా లేక ఆఫీసర్లా అనే అనుమానం కలుగుతుంది వాళ్ల పోజులు చూస్తుంటే. వాళ్లకాముసుగులు ఎందుకు తొడుగుతారో నాకు తెలియదు. మీకు తెలిస్తే కాస్త చెప్పరూ.

కొంటేకోణం

ప్రజల్లో ఎప్పుడన్నా చైతన్యం వచ్చి నేరస్తులను గుర్తుపట్టి నాలుగు తగిలిస్తే లేనిపోని గోలలు. ముసుగుల మాటున అవసరమైతే నేరస్తులు కానివాళ్ళని నేరస్తులుగా నిరూపించి చేతులు దులిపేసుకోవచ్చు. ఇలా అనేక సౌలభ్యాలు.

2 comments:

సుజ్జి said...

police magzine "Suraksha" chadavandi. u can get good explanatoin there.

psmlakshmi said...

సుజ్జిగారూ,
ఆ మేగజైన్ నేను సంపాదించటం కష్టం అనుకుంటా. శ్రమ అనుకోకపోతే లింకు గానీ, వెబ్ సైట్ అడ్రన్ గానీ ఇవ్వగలరా? కారణాలు ఇక్కడ కామెంటులో పెట్టినా నాలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది.
psmlakshmi