Saturday, May 16, 2009

కొంటె కోణాలు-8

Saturday, May 16, 2009
వామ్మో


సూర్యకాంతంగారు అర్ధగంటనుంచీ వాళ్ళ ఇంటి గొప్పదనం

గురించి చెప్పినమాట చెప్పకుండా అనర్గళంగా

మాట్లాడుతున్నారు. ఇంతకీ నేను చేసిన పొరపాటు

వాళ్ళింట్లో టులెట్ బోర్డు చూసి అద్దె ఇంటికోసం వెళ్ళటమే.

పెద్ద పెద్ద గదులు, ధారాళమైన గాలి, లైట్లు, ఫేన్లు అస్సలు

అవసరం లేదన్నారు. కరెంటు ఛార్జీలు మాత్రం ప్రత్యేకంగా

నెలకి వెయ్యి రూపాయలన్నారు. మరి లైట్లు, ఫాన్లు

అవసరం లేకపోతే కరెంటుకి ప్రత్యేకం వెయ్యి రూపాయలు

కూడా అవసరం లేదుగదండీ అన్నాను కొంచెం

నసుగుతూనే. నువ్వంటున్నది బాగానే వుందయ్యా. అంతా

నీలాంటి వాళ్ళే వుండరుగా. అవసరమున్నా లేకపోయినా

లైట్లు వెలుగుతూనే వుంటాయి, ఫాన్లు తిరిగుతూనే

వుంటాయి, బిల్లలు మేము కట్టుకోవద్దూ. అందుకే. అదీ

నిజమేననిపించింది. పవర్ కట్ తో ప్రజలు ఎంత అవస్ధ

పడుతున్నా ప్రభుత్వానికి పగలు వీధి దీపాలు ఆర్పే

ప్రక్రియ చేతకాదు. ఇంక ప్రజల సంగతి చెప్పాలా కరెంటు

బిల్లులు కట్టేవాళ్ళు తప్పితే మిగతా వాళ్ళల్లో 99 శాతం

విద్యుత్ దుర్వినియోగం చేసేవాళ్ళే.



సరే ప్రస్తుతానికొస్తే ఇంటి వాస్తుగురించీ, సౌకర్యాలగురించీ,


తక్కువ అద్దెగురించీ ఎంతో బ్రహ్మాండంగా వివరించి చెప్తూ

పనిలో పనిగా గడచిన ఆరు నెలల్లో ఆ పోర్షనులో వుండి

వెళ్ళిన ఏడు కుటుంబాల వాళ్ళూ తనతో ఎంత ఒద్దికగా

కలిసిపోయి వున్నారో కూడా వివరించారు.


కొంటె కోణం

ఏది నచ్చినా నచ్చకపోయినా ఆవిడతో ఒద్దికగా కలిసి

వుండటం వాళ్ళెవరికీ నచ్చి వుండదు. అందుకే ఆరు

నెలల్లో ఏడు కుటుంబాలు మారాయి అనుకుంటూ

బయటపడ్డాను.



0 comments: