Tuesday, May 5, 2009

శ్రీ మహలక్ష్మీ

Tuesday, May 5, 2009
శ్రీ మహలక్ష్మీ

చాలాకాలం క్రితం అర్ధరాత్రి ఆసువుగా వచ్చిన భావాలు పుస్తకంలో వ్రాశానుగానీ తర్వాత మర్చిపోయాను. ఇవాళ ఎందుకో ఆ పుస్తకం తిరగేస్తూ మళ్ళీ ఒకసారి చదివితే బాగానే వున్నాయనిపించింది. అందుకే అప్పుడప్పుడూ ఒక్కొకటి ఇలా టపాలో వ్రాస్తాను. వీటిని ఏమంటారో, ఏ పేరు పెట్టాలో తెలియలేదు. అందుకే నా పేరే పెట్టేశాను. పండితులు వ్యాకరణ సూత్రాలు వెతకవద్దని మనవి. మరి చిత్తగించండి.

బాధ బాధంటూ బరువునెత్తుకుంటావు
భవ సాగరాల బాధ ఆ భవునికే వదిలితే
నీకింక చింతేల శ్రీ మహలక్ష్మీ!!


పుట్టెడిది గిట్టెడిది సత్యమని తెలిసి
నట్టనడుమ నాలుగు క్షణాలకోసం
వెంపర్లాటెందుకే ఓ మహలక్ష్మీ!!

0 comments: