కొంటె కోణాలు--7
కష్టం
పాతికేళ్ళ సులోచన పరిగెత్తుకుంటూ వచ్చి రైలెక్కింది. చేతిలో వున్న బేగ్ సీట్ లో పడేసి కూలబడిపోయింది. హమ్మయ్య. మొత్తానికి ట్రైన్ మిస్ కాలేదు. ఆ మేనేజరు వెధవకి ఆఫీసు పని తప్పితే ఇంకో గోల లేదు. వాడి సంగతి తెలిసే వారం రోజుల ముందే సెలవు పెట్టి, ఈ లోపల కావాలంటే ఎక్ర్స్టాఅవర్స్ వుండి పని పూర్తి చేస్తాను, వూరెళ్ళే రోజు మాత్రం ఒక్క గంట పర్మిషనిమ్మంది.... ట్రైన్ అందుకోవటానికి వీలుగా వుంటుందని. అలాగే అంటూనే చివరి నిముషందాకా ఏదో ఒక పని చెప్తూనే వున్నాడు. వేధ్ధ సేడిస్టు.
పోన్లే. ఇప్పుడు కూడా వాడి గోలెందుకు? ఒక నాలుగు రోజులు ఆఫీసు గోల మర్చిపోయి హాయిగా అమ్మా నాన్నతో గడపచ్చు. అయితే చాలా అలసటగా వుంది. పడుకుంటే బాగుండును. పొద్దున్న ఫ్రెష్ గా లేవచ్చు. కానీ ఎలా/ అంతా కూర్చుని వున్నారు. సాయంత్రం 4 గం. లకే అందర్నీ సర్దుకోండి..నేను పడుకుంటానంటే బాగుండదుకదా.
చుట్టూ చూసింది. బకరాలెవ్వరూ కనబడలేదు. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు తగిలేవాళ్ళు. వాళ్ళ ముందు తనో పేధ్ధ త్యాగశీలి అన్నట్ల పోజు పెట్టటానికీ అవకాశం వచ్చేది. ఇవాళ ఏంటి రైలు కదిలి అరగంటయినా ఎవరూ అడగటంలేదు?. అసలిక్కడి వాళ్ళకెవరికీ అలాంటి అవసరాలు లేవా? చుట్టూవున్న మసుషుల్ని మళ్ళీ పరిశీలించింది. ఎందుకు లేరూ వున్నారు. మరి అడగరేం? తొందరగా అడగండిరా బాబూ. బాగా అలసటగా వుంది. పడుకుంటాను. పోనీ నేనే అడిగితే.?....ఊహూ...ఎప్పుడూ అడగలేదు. వద్దులే... అనుకుంటూనే అలాగే వెనక్కివాలి కళ్ళు మూసుకుంది.
అమ్మాయ్..బెర్త్ వేద్దాం లేస్తావా అంటూ పక్కనే కూర్చున్న పెద్దావిడ లేపితే లేచింది. అలాగేనంటూ మిడిల్ బెర్తు పైకెత్తటానికి ఆవిడకి అడక్కుండానే సహాయం చేసింది. ఆవిడ మిడిల్ బెర్తూ, వాళ్లాయన పై బెర్తు కొంచెం కష్టంగానే ఎక్కి పడుకున్నారు.
సులోచన వాళ్ళని ఆశ్చర్యంగా చూసింది. ఇదివరకు ఇలాంటివాళ్లు మాలాంటివాళ్ళని లోయర్ బెర్తుకోసం బతిమిలాడేవాళ్ళు. మాకూ అప్పర్ బెర్తయితే రైలెక్కన వెంటనే రెస్టు తీసుకోవటానికుండేది. ఇప్పడో...కాలం మారింది అనుకుంటూ తన లోయర్ బెర్తులో పడుకుంది పాతికేళ్ళ సులోచన సీనియర్ సిటిజన్లు మిడిల్, అప్పర్ బెర్తులు కష్టపడి ఎక్కితే.
అసలు సంగతి

ఈ మధ్య రైల్వే వాళ్ళు అస్సలు సీనియర్ సిటిజన్స్ ని ఖాతరు చెయ్యటంలా. కంప్యూటరు లో సీట్ల కేటాయింపు వంకతో వాళ్ళకి సాధ్యమైనంతమటుకూ మిడిల్, అప్పర్ బెర్తులిచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. అడిగినా ఉపయోగం లేనప్పుడు ఈ పిల్లకాయలని బతిమాలి తమ మూడ్ ఎందుకు ఖరాబు చేసుకోవాలని రిజర్వేషను సమయంలో అడగటం మానేశారు. రైల్లో సర్దుకుందామనుకున్నా, ఈ మధ్య అందరూ సర్దుకోవటానికి ఇష్టపడటంలేదు కారణాలు ఏమైనా, నిర్మొహమాటంగా చెప్పేవాళ్లు కొందరయితే, ఏదో ఒక వంకతో మర్యాదగా చెప్పేవాళ్లు కొందరు. ఈ గోలంతా పడటంకన్నా కష్టపడి అప్పర్ బెర్తులు ఎక్కటం తేలిక అనుకుంటున్నారు కాస్తో కూస్తో ఓపికవున్న సీనియర్ సిటిజన్స్ .
కొంటె కోణం
కానీ ఎంతయినా పెద్దవాళ్లుకదా. ఎక్కేటప్పుడో, దిగేటప్పుడో బేలన్సు తప్పితే... ఆ పాపం ఫలితం ఎవ్వరిదీ..!?????..
0 comments:
Post a Comment