Wednesday, June 16, 2010

రాత్రి పూట ఉప్పు అనకూడదా?

Wednesday, June 16, 2010



మన సంప్రదాయంలో చాలామంది రాత్రి పూట ఉప్పు అనరు.  ఎందుకు అనకూడదు?  ఏమైనా దోషమా?  అన్నంత మాత్రాన వచ్చే నష్టమేమిటి? 

ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఉప్పు బాగా తగ్గించి తినాలి, లేదా మానేసినా పర్వాలేదు.  అల్లోపతిలో కూడా బీ పీ వున్నవాళ్ళు ఉప్పు బాగా తగ్గించాలంటారు.  ఈ మధ్య అందరినీ ఉప్పు వీలయినంత తగ్గించమనే చెబుతున్నారు.  సాధారణంగా ఎవరైనా పగలంతా తమ తమ పనులతో చాలా శ్రమిస్తారు, దానితో స్వేదం ద్వారా శరీరంలో వున్న లవణాలు బయటకి పోతాయి.  అందుకే పగలు ఉప్పు తినటం అవసరం.  రాత్రిళ్ళు విశ్రాంతి సమయం.  శ్రమ వుండదు.  దానివల్ల శరీరంలో వున్న లవణాలు బయటకి వెళ్ళవు.  అలాంటప్పుడు ఉప్పు ఎక్కువ తినటంవల్ల శరీరానికి హాని జరిగే అవకాశాలు ఎక్కువ.  ఉప్పుకి వున్న దుర్గుణం శరీరంలో వున్న నీటినంతటినీ ఒకచోటికి చేరుస్తుంది.  దానితో ఆ అవయవం వాస్తుంది.  కొందరిలో కాళ్ళు, చేతులు వాయటం, నొక్కితే సొట్టలు పడటం చూస్తూంటాం.  వాళ్ళు ఏ రకమైన వైద్యం చేయించుకున్నా వాళ్ళు ముందు చెప్పేది ఉప్పు తగ్గించమనే. 


సాధారణంగా ఉదయం తీసుకున్న ఉప్పే రోజంతా సరిపోతుంది.  అందుకే రాత్రుళ్ళు ఉప్పు వాడవద్దన్నారు.  పూర్వం దాన్ని ఖచ్చితంగా అమలు చేసే ఉద్దేశ్యంతో అసలు రాత్రిళ్ళు ఉప్పు అనే మాటే అనద్దన్నారు.  రాను రానూ చాదస్తపు మనుషులు కొందరు మూఢ నమ్మకాలతో రాత్రిళ్ళు ఉప్పు అనకూడదు అంటూనే దాని అంతరార్ధం తెలుసుకోకుండా రాత్రిళ్ళు ఉప్పు తిని అనారోగ్యం తెచ్చుకుంటున్నారు. పైగా మనం సాధారణంగా అనే ఉప్పు అని కాకుండా బుట్టలోదనో, లవణం, సాల్ట్ ఇలా నానార్ధాలూ వుపయోగించి మరీ వాడుతున్నారు. 

ఇలాంటివారంతా రాత్రిళ్ళు ఉప్పు అన్నా పర్వాలేదు, ఏ హానీ జరగదు కానీ రాత్రిళ్ళు ఉప్పు ఎక్కువ తింటే మన ఆరోగ్యానికే హాని అని తెలుసుకోవాలి.  పూర్వీకులు నిబంధనలు ఎందుకు పెట్టారు అని తరచి చూస్తే అద్భుతమైన సత్యాలు గోచరిస్తాయి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



4 comments:

M Pavan Kumar said...

చెప్పిన తీరు బావుంది. నిజానికి మానవుడి మేధస్సు అభివృద్ది చెందడానికి కారణం ఉప్పు. కాని అది ఎక్కువైతే తప్పు. బీపీల్లాంటి అనారోగ్యాలు మరి. అయితే నా చిన్నప్ప్పుడు మరొక కథ చదివినట్లు గుర్తు. విద్యుత్తు లేని కాలంలో రాత్రి, లాంతరు దీపాలు వెలిగించి భోజనాలు కానిచ్చేవారు. అయితే ఉప్పు అంటే ఆ దీపాలు ఆరిపోతాయని రాత్రి పూట ఉప్పు అనేవారు కాదుట!దీపాలు ఆర్పటానికి మనం 'ఉఫ్' అని ఊదుతాం కదా! :-)


ఏదేమైతేనేం. భోజనంలో ఉప్పు మితంగా తింటే మంచిదే. చక్కని టపా. ధన్యవాదాలు.- ఎం. పవన్ కుమార్.

astrojoyd said...

సాధారణంగా ఎవరైనా పగలంతా తమ తమ పనులతో చాలా శ్రమిస్తారు, దానితో స్వేదం ద్వారా శరీరంలో వున్న లవణాలు బయటకి పోతాయి. అందుకే పగలు ఉప్పు తినటం అవసరం. రాత్రిళ్ళు విశ్రాంతి సమయం. శ్రమ వుండదు. దానివల్ల శరీరంలో వున్న లవణాలు బయటకి వెళ్ళవు/---uppunu samuscrutamlo"SAINDHAVA LAVANAM"antaaru.Raatrillu deenini teesukuntae,woopirithittullo taema saatam perigi ,swaasinchadaaniki koddigaa ibbandi eduru avutundi.E kaaranamgaa raatri poota uppunu vaadavaddani annaaru.Ayitae raatrillu perugu vaadae vaaru tappanisarigaa uppunu vaadaali lekuntae jeernakriya mandangaa saagutundi.---jayadev

psm.lakshmi said...

I think saindhava lavanam and ordinary lavanam are different.
psmlakshmi

astrojoyd said...

saindhava-means the thing that was born from the sea,so they r nt different in nature madam/jayadev