పనికిరావనే పెద్దలు చెప్తారు. రాగి పాత్రలోని పాలతో అభిషేకం చేస్తే మద్యంతో
చేసిన దోషం వస్తుందంటారు. బంగారు పాత్రలో
పాలు, నీళ్ళు పోసి పూజా కార్యక్రమాలకు వినియోగిస్తే విశేషమైన ఫలితాలుంటాయి. వెండి పాత్రలు వుపయోగిస్తే ఆ ద్రవ్యాలు సత్వ
గుణం కలిగి వుంటాయి. మనలో ఉష్ణ తత్వ
దోషాలు పోగొడతాయి. కంచు, మట్టి పాత్రలు
వుయోగించినా మంచిదే, మంచి ఫలితాలనిస్తాయి.
మరి ఇన్ని పాత్రలు పనికి వచ్చినప్పుడు ఒక్క రాగి పాత్రే పనికి రాదా? రాగి పాత్రలో రాత్రి నీళ్ళు నింపి పెట్టి ఉదయం
లేస్తూనే ఆ నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని పాటిస్తున్నారు. రాగి పాత్రలో అంత సేపు వుంచిన నీళ్ళు
ఆరోగ్యాన్నిస్తే పాలు పనికి రావా
ఖచ్చితంగా పనికి రావు. ఎందుకంటే
రాగిలో ఉష్ణ తత్వం ఎక్కువ వుంటుంది పాలు
పోస్తే తొందరగా పాడయిపోతాయి. అలాంటి పాలతో
అభిషేకం వగైరాలు దోషమని ధార్మిక శాస్త్రాలు చెబుతున్నాయి. రాగి పాత్రలో నీళ్ళు పోసి పూజలో
వినియోగించవచ్చు. పాలు మాత్రం రసాయన చర్యల
వల్ల పాడయిపోతాయి కనుక రాగి పాత్రలో పోసిన పాలు ఏ విధంగా వినియోగించకూడదు.
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)
3 comments:
Once again we proved that our culture already mingled with science so Our heritage is great
మంచివిషయం తెలియచేశారండీ ....ధన్యవాదాలు
రాగి పాత్రలోని పాలు అతివేగంగా పులిసిపోతాయి [FERMENTATION]రకరకాల మ్ద్యాలను ఈ క్రియతోనే చేస్త్తారు.ఈకారణంగానే రాగి పాత్రలోని పాలు మద్యంతో సమానమన్నారు మన పెద్దలు /జయదేవ్.చల్లా/చెన్నై-౧౭
Post a Comment