Tuesday, June 22, 2010

పురాతన కాలంలో పిల్లల బొడ్డు తాడు దాచి పెట్టేవాళ్ళు. నిజమేనా?

Tuesday, June 22, 2010



అతి ప్రాచీన కాలంలో కూడా పిల్లల బొడ్డుతాడుని దాచి పెట్టేవాళ్ళు.  కారణాలు మాత్రం ఎవరికీ తెలియవు.  చెప్పగలిగిన పెద్దవాళ్ళు కనిపించలేదు.  పూర్వ కాలంలో అలా ఎందుకు చేసేవాళ్ళో తెలియదు.  అందుకేనేమో ఆ తర్వాత మూఢ నమ్మకాలు ప్రబలాయి.  పిల్లల్లేనివాళ్ళు ఈ బొడ్డు తాడు మింగితే వారికి సంతానం కలుగుతుందని కొందరు సంతానం కోరి దీనిని మింగేవాళ్ళు.  కొందరు దీనిని తాయత్తులలో వేయించి పిల్లలకి కట్టేవాళ్ళు.

అనేక పరిశోధనల తర్వాత ఈ మధ్య బొడ్డు తాడు విలువను గుర్తించి వాటిని దాచి పెట్టటానికి ఒక బేంక్ పెట్టారు.  దీనిలో 40 సంవత్సరాల వరకూ బొడ్డుతాడుని దాచిపెట్టవచ్చు.  అ.యితే ఇప్పుడు మనకు కారణాలు తెలుసు.  ఆధునిక పరిశోధనలలో తేలింది ఏమిటంటే, బొడ్డు తాడులో వున్న మూల కణాల సహకారంతో ఆ వ్యక్తికి భవిష్యత్ లో ఏదైనా పైద్ద వ్యాధి వచ్చినప్పుడు వైద్య చికిత్స చెయ్యవచ్చు, దానితో అద్భుతమైన ఫలితాలు రాబట్టచ్చని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. 

పూర్వకాలంలో (అప్పుడు మన దగ్గర కేవలం ఆయుర్వేద వైద్యం మాత్రమే వుండేది) మన పెద్దలు, మన వైద్యులు ఎంత శాస్త్ర జ్ఞానాన్ని కలిగి వున్నారో తెలుస్తోంది.  బహుశా వాళ్ళు ఈ వైద్యం చేసేవాళ్ళేమో.  అయితే మనకి ఆధారాలు లేవు.

(జీ తెలుగులో ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



8 comments:

Anonymous said...

//ఎంత శాస్త్ర జ్ఞానాన్ని కలిగి వున్నారో తెలుస్తోంది.... అయితే మనకి ఆధారాలు లేవు.//
ఆధారాలు లేనపుడు ఎంత శాస్త్రవిజ్ఞానం కలవారో అని ఎలా తేల్చేయగలము? బహుశ మీరన్నట్టు వూరగాయ వేసి మింగడానికో , తాయత్తు కట్టుకోడానికో అయ్యుండే అవకాశం ఎక్కువ అని నా ప్రఘాఢ విశ్వాసం.
పూర్వీకుల విజ్ఞానాన్ని తృణీకరించడం కాదు గాని, అంత విజ్ఞానము వుండి వుంటే ఏమాత్రం మిగలకుండా జస్ట్ కొన్ని శతాబ్దాల్లో అకస్మాత్తుగా ఎలా అంతరించిపోతుందనేది నన్ను వేధించే ప్రశ్న. అందుకే ' అన్నీ మన గ్రంధాల్లో వున్నాయిష ' అనేవారితో అటు ఏకీభవించలేక, ఇటు తృణీకరించి సాంప్రదాయ వ్యతిరేక, దురహంకార జాతిద్రోహిగా ముద్రవేయించుకోలేక సతమతమయ్యే నాలాంటి వాళ్ళ మూగవేదన ఎవరికి అర్థమవుతుంది? అందుకే వీలున్నప్పుడల్లా , తీరిక వున్నప్పుడల్లా మూసుకొని ముసుగేసుకుని కాసేపు ఏడ్చి , ముక్కు చీదేసుకోవడం అలవాటు చేసుకుంటున్నాం. ఇదో అంతులేని కథ కాదు వ్యథ అని నేనంటాను మీరు కాదనక నాతో ఏకీభవించాలి, మరేమంటారు?

నాకు చిన్నప్పుడు తొడమీద మిగిల్చిన వాత దృష్ట్యా ఆయుర్వేదం విషయంలో ఇదమిద్ధంగా మీతో ఏకీభవించలేకపోతున్న నా అశక్తతను పెద్ద మనసుతో క్షమించగలరని ఆశిస్తున్నాను :)

psm.lakshmi said...

snkr గారూ
ఎవరో ఏదో చెప్తే నాకు నచ్చితే ఆహా అంటాను లేకపోతే వాళ్ళ అభిప్రాయం వాళ్ళది అనుకుంటాను కానీ ముక్కు చీదేసి నా ఎనర్జీ వేస్ట్ చేసుకోను. ఎవరి అభిప్రాయాలు వారివి. పిల్లలకోసం బొడ్డుతాడు మింగిన వాళ్ళనీ, తాయత్తు చేసి పిల్లలకి కట్టినవాళ్ళనీ నా చిన్నతనంలో చూశాను. అంటే బొడ్డుతాడుకు విలువ వున్నది అని తెలుసుకున్నారు. ఆ విలువ ఇదీ అని తెలుసుకుని వుండక పోవచ్చు. అది ఇప్పుడు పరిశోధనలలో కనుక్కున్నారు. ఏ శాస్త్రజ్ఞానం లేని రోజుల్లో బొడ్డు తాడుకు విలువ వుంది అని తెలుసుకున్నారు. అది పరిశోధనకి ప్రధమ సోపానం కాదా.

నేను రాసిన విషయాలు అందరూ నమ్మాలనీ, ఖచ్చితంగా నాతో ఏకీభవించి తీరాలనే దురాశ నాకు లేదండీ. ఎవరి అనుభవాలు వారివి. నేను దాదాపు 10 ఏళ్ళనుంచీ అవసరమైనప్పుడల్లా హెర్బల్ మెడిసనే వాడుతున్నాను. మధ్యలో ఒక ఆపరేషన్ కి తప్ప. అదీ నేను అలవాటుగా తీసుకునేవారి దగ్గరే తీసుకుంటానుగామీ వైద్యుడు మారితే, ఏమో, అప్పుడు పరిస్ధితులనుపట్టి, రోగ తీవ్రతనుబట్టీ వైద్య విధానం కూడా మార్చవచ్చు. ఇదే వాడతానని ప్రాణంమీదకి తెచ్చుకోనుకదా.
psmlakshmi

Anonymous said...

/ఏ శాస్త్రజ్ఞానం లేని రోజుల్లో బొడ్డు తాడుకు విలువ వుంది అని తెలుసుకున్నారు. అది పరిశోధనకి ప్రధమ సోపానం కాదా./

No, I don't think they did that with such research intentions. Ok, I agree with some of your points. Ayurveda works well than Homeomedicine(sugar pills dipped in spirit).

psm.lakshmi said...

ఏ జ్ఞానమూ లేని అనాది మానవుడు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి, అనేక విధాల అభివృధ్ధి చెంది నాగరీకుడయ్యాడు. శాస్త్రం, విజ్ఞానం, పరిశోధన ఇలాంటి మాటలు తెలియకుండానే అనేకం కనిపెట్టాడు. ఏ ఒక్కళ్ళవల్లో ఇది సాధ్యంకాలేదు. అనాదినుంచీ వచ్చిన ఈ తపన బహుశా అంతందాకా సాగుతుందేమో.
psmlalkshmi

astrojoyd said...

in good olden days,every scientific secret kept under GREAT PROTECTION.why?misusing of that secret may takes place.In susrutam,the imp of storing umbelical chord R- /remnents of placental tube[in sanskrit its name is "JAARAAYUVU"]WAS CLEARLY MENTIONED.The smell coming from this stored chord repells ants/flies/mosquitoes/scorpions/snakes.Notonly that,it purifies the air that surrounds the babby which indirectly prevents bacterial nd viral infections from the air in that location.Iam once again strongly saying-indian culture/people/their knowldge is always far higher nd supreemer than any oyher culture in this world.భారత భూమిలో లేనిది/తెలియనిది అంటూ ఏదీ లేదు /.ప్రపంచానికి నేడు తెలిసినది అంతా మన దేశం నుంచే అని బల్లగుద్ది మరీ చెప్పవచ్చును ---jayadev.challa/chennai-17....

astrojoyd said...

sankr jee,mee aavedana lo kaaranam mrugyam.turushkulu/mushkurula daadullo enno viluvaina grandhaalanu tagulapettadam jarigindi.బహుశా తెల్లోడు రాసిన వక్రీకరణ చరిత్ర పుస్తకాలు వల్లే వేసి మీరు ఈ ఆవేదన చెందిఉందవచ్చును.తగులపెట్టగా మిగిలిన గ్రంధాలను జర్మనులు దొంగిలించారు.ఈ నేపధ్యంలో విజ్ఞానం హతాతుఉగా అద్రుస్యంకాక మరేమోవ్తుందో మీరే చెప్పండి ?ఆరోజుల్లో విద్యనూ వినాశనానికి వాడని వారికే భోదించే నియమం ఉండేది,ఈ కారణం వలన కొన్ని అప్పోర్వమైన విద్యలూ/విజ్ఞానం శాశ్వతంగా నేడు లభ్యమ్కావడం లేదు.రెండేళ్ళ కిందట స్వర్గస్తులైన మా గురువులు శ్రీ గుండప్పసాస్త్రి గారికి వారుణాస్త్ర ప్రయోగం తెలుసు అంటే మీరు చచ్చినా నమ్మలేరు కాని ఆయన శిష్యునిగా వారు దాన్ని ప్రయోగం చేసి చెన్నైలో వరుసగా మూడు రోజులపాటు వర్షం కురిపించదాన్ని నేనుకళ్ళారా చూసాను .నేను ఆయన్ని దాని ప్రయోగం నేర్పమని అడిగినపుడు మౌనం వహించారు.అంటే విద్యకు కొన్ని అర్హతలున్తాయని అర్ధం.ఈ విధంగానే మన విలువైన విజ్ఞానం విలుప్తం కావడం సంభవించింది /jayadev.challa -chennai-17

psm.lakshmi said...

జయదేవ్ గారూ,
మీకు తెలిసిన వివరాలు పంచుకున్నందుకు చాలా సంతోషమండీ. మీ కామెంటు మూలంగా మీ గురువుగారు గొప్పతనం గురించి కూడా తెలుసుకున్నాము. అంతటి గొప్ప గురువుగారికీ, ఆయన శిష్యులయిన మీకు నా నమస్కారములు. పూర్వం భారత దేశంలో వెలుగు చూడని ఆణి ముత్యాలెన్నో..మనుష్యుల్లో, ప్రయోగాలలో, గ్రంధాలలో..
ధన్యవాదాలు.
psmlakshmi

astrojoyd said...

మీలాంటి బుధజనులకు నేను సర్వదా విధేయుడను లక్ష్మి గారు.ఇంటువంటి సందేహాలను మరిన్నిటిని మీ బ్లాగ్లో ఉంచడానికి ప్రయత్ని౦చగలరని ఆశిస్తున్నాను-జయదేవ్.చల్లా/చెన్నై-౧౭