Thursday, December 3, 2009

అయ్యప్ప దీక్షా సమయంలో భూ శయనం ఎందుకు చెయ్యాలి?

Thursday, December 3, 2009
ఒక్క అయ్యప్ప దీక్షలోనే కాదు, మన సాంప్రదాయంలో అనాదినుంచీ ఏ దీక్షలో వున్నవారయినా భూ శయనం చెయ్యటం, అంటే నేలమీద చాప మాత్రం వేసుకుని నిదురించటం ఆనవాయితీగా వుంది. పూర్వం గురుకులాలలో విద్యాభ్యాసం చేసేవాళ్ళు నేలమీదే నిద్రించేవారు. అలా ఎందుకంటే నేల కఠినంగా వుండటంతో అలిసిన శరీరానికి ఎంతమటుకు నిద్ర అవసరమో అంత మటుకే నిద్ర పోగలరు. తర్వాత అటూ ఇటూ కదిలేటప్పుడు నేల గట్టిగా వుండి ఎక్కువ సేపు పడుకోలేక లేచి తమ పనులు చూసుకుంటారు. పూర్వం బ్రహ్మచారులకు, గురుకులవాసులకు అనేక కార్యక్రమాలు వుండేవి. ఉపాసన, గురు శుశ్రూష, ఇలా అన్ని పనులూ పూర్తి చేసుకుని ఉదయం చదువుకు కూర్చోవాలి. అందుకే వాళ్ళు అవసరమైనంతమటుకే నిద్రపోవాలి.

ఆ నియమాన్ని ఏ దీక్షలోవున్న వాళ్ళయినా పాటిస్తారు. వారి మనసు సుఖాలవైపు ఆకర్షింపబడకూడదు. దీక్ష ఫలితాన్ని పూర్తిగా పొందాలంటే వారికి బధ్ధకం వుండకూడదు. అందుకే నియమాలు.

ఈ భూ శయనం వల్ల ఇంకొక గొప్ప ఉపయోగం ఏమిటంటే నడుం నొప్పి రాదు. నొప్పులు సవరింపబడతాయని వైద్య శాస్త్రం చెబుతోంది. అలాగే కామ క్రోధాలు అణిగి పోతాయని ధర్మ శాస్త్రం చెబుతోంది. అందుకే దీక్షా సమయంలో భూ శయనం.


(జీ టీ వీ ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

0 comments: