సముద్ర స్నానం ఎప్పుడు చెయ్యాలి?
మన పెద్దలు సముద్ర స్నానానికి కూడా కొన్ని నియమాలు
చెప్పారు. ఈ నియమాలెందుకో తెలుసా? మన ఆరోగ్యం
గురించే. కాలమాన పరిస్ధితులనుబట్టి
సంవత్సరంలో నాలుగు మాసాలు సముద్ర స్నానానికి శ్రేష్టమయినవి అంటారు. అవే ఆ కా మా వై. ఈ భాషేమిటంటారా? ఆషాఢమాసం, కార్తీక మాసం, మాఘ మాసం,
వైశాఖ మాసం. ఈ నెలలే ఎందుకంటారా?
ఈ నెలలలో ఋతువులు మారటం వల్ల వాతావరణంలో
మార్పులొస్తాయి. ఎండాకాలంనుంచి వర్షాకాలంలోకి
అడుగు పెడతాము ఆషాఢమాసంలో. కార్తీక మాసం
వర్షాకాలానికీ చలికాలానికీ మధ్య వారధి.
మాఘ మాసం చలికాలానికీ ఎండాకాలానికీ సంధి సమయం. వైశాఖమాసం తీవ్ర ఎండలుకాసే మాసం. వీటిని సంవత్సరంలో కోణాలంటారు. ఈ నాలుగు నెలలలో ఋతువుల్లో వచ్చే మార్పులను శరీరం
తట్టుకోలేదు. పౌర్ణమి రోజు సముద్రంలో
ఆటుపోట్లు ఎక్కువ వున్నట్లే మానవ శరీరంలో ఉద్వేగాలు ఎక్కువగా వుంటాయి. ఈ మార్పులు తట్టుకోవటానికే ఈ నెలలలో సముద్ర
స్నానం చేస్తే మంచిదంటారు. అందులోనూ
పౌర్ణమినాడు ఇంకా మంచిది అంటారు. శరీరంలో
కలిగే ఉద్వేగాలు సముద్రపు ఆటుపోట్లతో సర్దుకంటాయి.
సముద్ర స్నానం చేసేటప్పుడు తల మొత్తం మునిగేలాగా
మునకవేయాలి. సముద్రంలోని ఉప్పునీటివలన స్వేద
గ్రంధులన్నీ శుభ్ర పడతాయి. శరీరంలో
ఎక్కడయినా చిన్న చిన్న గాయాలువున్నా ఈ ఉప్పునీటికి మానుతాయి. సముద్ర అలలతో ఆడుకోవటంలో ఉల్లాసం, ఉత్సాహం
ఎలాగూ వుంటుంది.
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)
0 comments:
Post a Comment