ఈ భూదేవికి మనం కృతజ్ఞతలు తెలిపే విధానాలు ఎన్నో. నాట్యం చేసేవారు, అమ్మా నా పాదఘాతంతో నిన్ను నొప్పిస్తున్నాను, క్షమించు అని నాట్యం ప్రారంభించే ముందు భూవందనం చేస్తారు. ఆలాగే పంటలు వేసేటప్పుడు, ఇళ్లు కట్టేటప్పుడు ముందు భూమి పూజ చేస్తాము కదా. అలాగే మనం ఇంటిముందు చిమ్మి నీళ్ళుజల్లి ముగ్గు వేస్తాముకదా. అదికూడా భూమి పూజే. పెద్దలు ఎమి చెప్తారంటే జీవితంలో మనమీద ఆధారపడినవారిని ఆదరించాలి, అలాగే మనం వేటిమీద ఆధారపడి వున్నామో వాటికి వందనం చెయ్యండి, కృతజ్ఞతలు తెలుపుకోండి.
మన జీవితంలో మనకు అనుకూలంగా వుండేవాటికీ, మనకి మంచి చేసేవాటికీ మనం శిరస్సు వంచి నమస్కరించాలి, కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం కార్యక్రమం ఆధారంగా)
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం కార్యక్రమం ఆధారంగా)
1 comments:
సముద్రవసనే దేవీ పర్వతస్తనమండలే
విష్ణుపత్నీ నమస్తుభ్యం పాదస్పర్షం క్షమస్వ మే.
Post a Comment