Friday, December 4, 2009

నిద్ర లేవగానే పక్క దిగకుండా దైవ ప్రార్ధన చెయ్యాలంటారు. ఎందుకు?

Friday, December 4, 2009
నిద్ర లేవగానే పక్క దిగకుండా దైవ ప్రార్ధన చెయ్యాలంటారు. ఎందుకు?




ఏ మనిషైనా నిద్ర లేవగానే హడావిడిగా పనులలోకి దిగకుండా, అలా పడుకునే కొద్దిసేపు కళ్ళు మూసుకుని భగవంతుని తలుచుకోవాలి అంటారు. భగవంతుడంటే, ఎవరిని తలుచుకోవాలోకూడా చెప్పారు. ఇష్టదైవం, గణపతి, కుల దైవం, గురువు, లక్ష్మీ దేవి, సప్త సముద్రాలు, సప్త ఋషులు, పర్వతాలు, ఆంజనేయ స్వామి లాంటి చిరంజీవులు, నవగ్రహాలు, అష్ట దిక్పాలకులు, పంచ భూతాలు, జీవ నదులు, తల్లిదండ్రులు ఇలా అందరినీ తలుచుకోవాలి.






ఇలా తలుచుకోవటంవల్ల లాభం ఏమిటి? మనం మానవమాత్రులం. మన జీవితాల్లో ఏ కొంచెం సాధించినా చాలా గొప్పగా భావిస్తాము. కొన్నిసార్లు లేనిపోని అహంభావాలకుకూడా తావిస్తాము. కానీ ఉదయమే లేవగానే ఇలా మహనీయులందరినీ తలుచుకోవటంతో ఆధ్యాత్మికంగా మనకు వారందరి ఆశీస్సులూ లభిస్తాయి, మనసు ప్రశాంతంగా వుంటుంది. లౌకికంగా చూస్తే అంతటి మహనీయులముందు మనం సాధించినది ఎంత, ఇంకా ఎంతో సాధించాల్సింది వుంది అనే భావం కలుగుతుంది. మనకి మనం ఎంత గొప్పవారమైనా, ఎంత సాధించినా, వీరందరి ముందు మనం పరమాణువులకన్నా తక్కువ వారమని, మనం సాధించాల్సింది ఇంకా చాలా వుందని తెలుసుకుని మన అహంభావాన్ని పక్కనబెట్టి ఇంకా ఎదగటానికి ప్రయత్నిస్తాము. అంతేకాదు. కాసేపు ప్రశాంతంగా వుండి మనం ఏమిటి? మన స్ధాయి ఏమిటి? మనం రోజు ఎక్కడనుంచి మొదలు పెట్టాలి? వగైరా ఆలోచించి, పధ్ధతి ప్రకారం ప్రణాళిక వేసుకుని ఆరోజు మొదలు పెట్టచ్చు. దాని మూలంగా అనవసరమైన కంగారు, గందరగోళం లేక ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు.






ఇవ్వన్నీ ఏదో బాగానే వున్నట్లున్నాయి కదా. పోనీ ప్రయత్నించి చూస్తే పోలా. రేపటినుంచి మీరూ ప్రయత్నించండి.






(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


0 comments: