చాలామందికి చాలా రకాల అపోహలున్నాయి. అందులో ఈ మధ్య ఎక్కువగా కనబడుతున్నది గడియారం
ఆగిపోతే ఇబ్బందులు వస్తాయని. ఎవరింటికైనా
వెళ్ళినప్పుడు అక్కడ ఆగిపోయిన గడియారాన్ని చూస్తే “అయ్యో, ఆగిపోయిన గడియారాన్ని
పెట్టుకున్నారా మంచిది కాదు తీసెయ్యండి” అని ఉచిత సలహాలు కూడాను. సెల్ అయిపోయిగానీ పాడయిపోయిగానీ గడియారాలు
ఆగిపోవాండీ?
ఈ నమ్మకాల విషయంలో మనుష్యులను మూడు వర్గాలుగా
విభజించవచ్చు. అందులో ఒక వర్గంవారు ఏవీనమ్మరు. వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తారు. ఇంకో వర్గంవారు అన్నీ నెగెటివ్ గా ఆలోచించి
ప్రతి దానికీ భయపడతారు. ఇంక మూడో వర్గంవారు
ప్రకృతినుంచి కొన్ని సంకేతాలను తీసుకుంటారు, దాని ప్రకారం జాగ్రత్తలు
తీసుకుంటారు.
పురాతన కాలంలో గడియారాలు లేవు. నీడ ప్రకారం సమయాన్ని లెక్కించేవారు. ఆ గడియారం ఆగదు..కాలం ఆగదు. అది నిరంతరం సాగుతుంది. ఈ నమ్మకాలు ఎలాంటివంటే ఎంత బలవంతులయినా నమ్మకం
ఏర్పడితే, శాస్త్రీయమైనా కాకపోయినా గట్టిగా నమ్మి భయపడతారు. ఎక్కడ పుట్టి ఎలా ప్రచారమయిందో తెలియదు కానీ ఈ
మధ్య ఈ గడియారాల నమ్మకం ఎక్కువైంది.
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)
పొద్దున్న లేవగానే అనేక పనులమీద హడావిడిగా
ఇంటిల్లిపాదీ బయటకు వెళ్ళాల్సి రావటంవల్ల లేచిన దగ్గరనుంచీ మాటి మాటికీ గడియారం
చూడటం అలవాటయిపోయిన వాళ్ళకి గడియారం ఆగిపోతే టైము తెలియక ఇబ్బందే. దానితో
అన్నింటికీ ఆలస్యమయి చికాకు. అలా
ఆలోచిస్తే ఆగిన గడియారాన్ని ఇంట్లో పెట్టుకోవటం మంచిది కాదు కదా. అందుకనే వెంటనే బాగు చేయిస్తే సమస్య
తీరిపోతుంది కదా.
1 comments:
నీడ గడియారం ప్రతి సాయంత్రం , మబ్బులు వేసినపుడలా ఆగుతుందండి. మీరు చెప్పినదాంట్లో సత్యం వుంది, ఇప్పుడే నా గడియారానికి సెల్ వేయించాను. కాలం ఆగదు గాని గడియారాలెందుకు ఆగవండీ? తప్పక ఆగుతాయి
Post a Comment