వాస్తు శాస్త్రం ప్రకారం
గుమ్మాలు, కిటికీలు సరి సంఖ్యలో వుండాలి.
చివర సున్నా వుండే సంఖ్య 10, 20 అలా వుండకూడదని చాలా మంది అపోహ పడతారు. వాస్తు శాస్త్రం ప్రకారం సరి సంఖ్యలో వుండాలంటారు తప్ప ఈ చివర
సున్నా వుండే సంఖ్య వుండకూడదని ఎక్కడా లేదు.
సింహ ద్వారం ఎక్కడ పెట్టాలి అనే
సందేహం కొందరికి వస్తుంది. మనం ఇల్లు కట్టుకునే ప్రదేశాన్ని 9 సమ భాగాలు
చేసి అందులో 4, 5, 6 భాగాలలో సింహ ద్వారం పెట్టవచ్చు. ఒకటే సింహద్వారం అయితే 5వ భాగంలో పెట్టాలి. అందులో కూడా ఆ భాగమెంతవుంటే అంతా కాకుండా,
కొంతమేర, అంగుళం రెండంగుళాలయినా తగ్గించి పెట్టాలి. రెండు సింహ ద్వారాలు పెట్టవలసి వస్తే 4, 6
భాగాలలో పెట్టాలి.
సింహ ద్వారం ఎదురుగా మరో గుమ్మం లోపల వుండాలి సింహ ద్వారం వీధికి ఎదురుగా వుండకూడదు. వీధిశూల అంటారు. సింహ ద్వారానికి రెండు వైపులా
కిటికీలుండాలి. ముఖంలో కళ్ళలాగా. లేకపోతే అంధశూల అంటారు. కిటికీలు
సరిగ్గాలేకపోతే ఇంట్లోకి వెలుతురు బాగా రావాలి కదండీ.
(జీ తెలుగు ప్రసారం చేసిన
గోపురం ఆధారంగా)
0 comments:
Post a Comment