మనకి శకున శాస్త్రం వున్నది. దాని ప్రకారం కన్నే కాదు మగవారికి కుడివైపు
శరీర భాగం, ఆడవారికి ఎడమ వైపు శరీర భాగం అదిరితే మంచిదంటారు. రామాయణంలో కూడా దీనికి ఒక కధ చెప్తారు. శ్రీరామచంద్రుడు వానర సేనని తీసుకుని రావణుడి
మీద యుధ్ధానికి బయల్దేరినప్పుడు రావణాసురుడికి కుడి కన్నూ, సీతమ్మవారికి ఎడమ కన్నూ
అదిరాయట. సీతమ్మవారికి ఎడమ కన్ను అదిరిన
ఫలితం కనిపించింది రాముడు ఆవిడని చెరనుంచి విడిపించాడు. అలాగే రావణాసురుడుకి కీడు జరిగింది.
అలాగే ప్రతిసారి శరీర భాగాలదిరినప్పుడు మనకి
అనుకూలమైన సూచన అయితే ఏదో మంచి జరుగుతుదని పొంగిపోనక్కరలేదు, కానప్పుడు ఏదో కీడు జరుగుతుందని
భయపడక్కరలేదు. కేవలం కొన్ని లిప్తలు
మాత్రమే అదిరితే అది శకునం కావచ్చు.
కొందరు పొద్దన్ననుంచీ రాత్రిదాకా అదిరిందంటారు, కొందరికి శరీర భాగాలు తరచూ
అదరవచ్చు...అది నరాల బలహీనతకు సూచన. ఆయుర్వేద
శాస్త్రం ప్రకారం వాత, పిత్త గుణాలు ప్రకోపించినప్పుడు శరీరంలో భాగాలు
అదురుతాయంటారు. కళ్ళ వ్యాధులున్నాకూడా
కంటి భాగాలు తరచూ అదరవచ్చు. అలాంటప్పుడు
డాక్టరుని సంప్రదించాలిగానీ నమ్మకాలని పట్టుకుని వేళ్ళాడకూడదు.
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)
0 comments:
Post a Comment