Saturday, May 23, 2009

మైల్ దొంగలు

Saturday, May 23, 2009
మైల్ దొంగ


రెండు రోజుల క్రితం నా యాహూ మైల్ కి ఒక మైసేజ్

వచ్చింది. యాహూ యాక్టివ్ గా లేని మైల్ ఐడిలని

తీసివేస్తోంది, మీ మైల్ యాక్టివ్ గా అస్ ఇంటరెప్టడ్ గా

రావాలంటే మీ డీటైల్స్ ఇవ్వండి అని. వాళ్ళు అడిగిన

డీటైల్స్ పేరు, మైల్ ఐడి, పాస్ వర్డు, దేశం. నేనేమో

యాహూనుంచి వచ్చింది అని డీటైల్స్ ఇచ్చేశాను.

అంతేనండీ బాబూ. ఇవాళ పొద్దున్ననుంచీ నా మైల్ నాకు

ఓపెన్ కావటంలేదు. పైగా, నా అడ్రస్ బుక్ లో వున్న

వాళ్ళందరికీ మైల్స్ వెళ్ళాయి నేను కాన్ఫరెన్సు గురించి

లండన్ కి వెళ్తే అక్కడ దొంగలబారినపడి నా డబ్బు, సెల్

అన్నీ పోగొట్టుకున్నాను కనుక అర్జంటుగా నాకు డబ్బు

వెస్ట్రన్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా పంపమని. దయచేసి

మీకెవరికైనా అలాంటి మైల్స్ వస్తే డిలీట్ చేసెయ్యండి.



దురదృష్టమేమిటంటే నేను తరచూ చేసే మైల్

అడ్రసులుకూడా నా దగ్గర లేవు. పొద్దున్ననుంచీ గూగుల్

గ్రూప్ కీ, జ్యోతికీ చేసిన మైల్స్ చాలా నేను తప్పు అడ్రసు

చేయటం వల్లననుకుంటాను వెళ్ళలేదు.



ఇప్పుడే మా ఫ్రెండ్ యుయస్ నుంచి ఫోను చేసింది.

ఎక్కడున్నారంటూ.

ఇందుమూలంగా అందరికీ తెలియజేయునది ఏమనగా

నేను లండన్ వెళ్ళలేదు. ఇండియాలో మా ఇంట్లోనే

క్షేమంగా వున్నాను. నా యాహూ ఐడి తో మీకేమైనా

మైల్స్ వస్తే పట్టించుకోవద్దు.



ఇంకో విషయం. మీలో చాలామందికీ విషయం తెలుసు.

కానీ నాలాంటి వాళ్లకోసం చెప్తున్నాను. మీ మైల్ పాస్ వర్డ్

దొంగలచేతికివ్వద్దు. అది ఎంత జెన్యూయిన్ గా

అనిపించిందంటే అర్జంటుగా బుట్టలో పడిపోయాను.



నాకింకో సలహా ఇవ్వండి. నా బ్లాగు యాహూ ఐడితో

వుంది. దాన్ని గూగుల్ ఐడికి మార్చటం ఎలా

ప్రస్తుతం నా మైల్ అడ్రసు

Psmlakshmi1202@gmail.com


1 comments:

Indian Minerva said...

మీరు మరీను... ఎంత జెన్యూయిన్ గా అనిపిస్తే మాత్రం mail active గా వుందో లేదూ తెలుసుకోవడానికి password తో పనేంటండి?
By the way regarding your blog thing. It can be done. Mail me your gmail details to my gmail id and most importantly DON'T forget to include your password :) Trust me I am not after your password.