దృష్టి దోషాలు వున్నాయా?
సాధారణంగా పిల్లలకి దిష్టి తగిలిందని దిష్టి తీస్తారు. దిష్టి అంటే చెడు దృష్టి. ఇది ఉన్నదనే చెప్పాలి. అందరూ సాధారణంగా ఒప్పుకుని పాటించే ఈ దృష్టి మన సాంప్రదాయంలో వుంది. శాస్త్రబధ్ధమనికూడా మనవాళ్ళు చెబుతారు.
మన శరీరంలోంచి ప్రతికూల శక్తి (negative energy) విడుదల చేసే అవయవాలు కొన్ని వున్నాయి. వాటిలో కళ్ళు కూడా ఒకటి. Optic nerve లో 1.2 million censury glands (జ్ఞాన తంతువులు) వున్నాయి. ఇవి వివిధ రకాల జ్ఞానాన్ని మెదడుకు చేరవేస్తాయి...చూసిన విషయాన్ని అవగాహన చేసుకుని భావాల్ని తిరిగి మన కళ్ళల్లో ప్రస్ఫుటం చేసే శక్తి వీటికి వుంది. ఏదైనా వస్తువు చూసినప్పుడు ఎంత బాగుదో అనుకోవటం సహజం. అది ఒక్కోసారి ప్రతికూల భావాల్నికూడా పంపించవచ్చు. కంటినుంచి వెళ్ళే ప్రతికూల శక్తి ఎదుటివారిమీద పడ్డప్పుడు ఆ ప్రభావం వారిమీద పడుతుంది. అదే దిష్టి. అందుకే దిష్టి తీయమంటారు. ఈ దిష్టి తగిలిన పిల్లలు వూరికే ఏడవటం, చికాకు పెట్టటం చేస్తారు. పెద్దలకు తలనొప్పి, చికాకు వగైరాలు. కొన్నిసార్లు దిష్టి తీస్తే వీరు వెంటనే మామూలుగా అవటం గమనిస్తాము.
మనకి దిష్టి తీసే శక్తి వుందా? వుందనే చెప్పవచ్చు. కొన్ని దృష్టి దోషాలు రాకుండా ముందే జాగ్రత్త పడతారు. గృహ ప్రవేశం సమయంలో గుమ్మడికాయ పగలగొట్టి, దానికి కుంకుమ పూసి గుమ్మానికి అటూ ఇటూ పెడతారు. ఇది దృష్టిదోష నివారణకే. అందరి దృష్టి ముందు ఇంటిమీద కాకుండా దీనిమీద పడితే దోషాలేమీ వుండవని. ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ వేలాడదియ్యటం కూడా దీనికే. చిన్న పాపాయిలకి దిష్టి చుక్క పెడతారు. పెళ్ళిలో పెళ్ళికూతురుకీ, పెళ్ళి కొడుకుకీ బుగ్గన చుక్క పెడతారు. ఇవ్వన్నీ దిష్టి దోష నివారణకే.
కొందరు ఎఱ్ఱ నీళ్ళు దిష్టి తీసి బయట పారబోస్తారు. దానితో ప్రతికూల శక్తిని బయటకు పంపిస్తారు. ఉప్పు మెరపకాయలు దిష్టితీసి నిప్పుల్లో వేస్తారు. అప్పుడు వచ్చే కోరుతో దగ్గు వస్తుంది. ఆ దగ్గుతో ప్రతికూల శక్తి బయటకు వచ్చేస్తుందని నమ్మకం.
ఇంత రాశానుగానీ నేను ఈ దిష్టిని ఇంతమటుకూ నమ్మలేదండీ. కొందరు చీటికీ మాటికీ దిష్టి తీసేస్తారు. మరీ అంత చాదస్తంకూడా వుండకూడదు.
(జీ టీవీ ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)
Wednesday, December 2, 2009
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
మీరు అంత పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాస్తే మాకు ద్రుష్టి దోషం తగులుతుంది ఖచితంగా !!
డోంట్ డిలీట్ ఇట్
శాస్త్రిగారూ,
అక్షరాలలో మార్పులు కావాలంటే ఎలా చేయాలోకూడా చెప్పాలి. రాయటం, పోస్ట్ చెయ్యటం తప్ప కంప్యూటర్ గురించి తెలియదు, ఇప్పుడు నేర్చుకునే ఓపిక కూడా లేదు. లైన్ల మధ్య ఖాళీ వుంటే బాగుంటుదని నేనూ అనుకున్నా.
psmlakshmi
ఏదో సరదా గా వ్రాసాను లైట్ తీసుకోండి.
మీ బ్లాగ్ లో కి లాగ్ ఇన్ అయ్యిన తర్వాత
డాష్ బోర్డ్ లో కి వెళ్ళండి
layout కి వెళ్ళండి
అక్కడ నాలుగు ట్యాబు లు ఉంటాయి.
వరుసగా
౧.పేజి elements
2 ఫాంట్స్ అండ్ కలర్స్
౩.html
4. choose యువర్ టెంప్లేట్
అందులో రెండవ ఆప్షన్ (ఫాంట్స్ అండ్ కలర్స్ ) సెలెక్ట్ చెయ్యండి
అందులో టెక్స్ట్ ఫాంట్ అని ఉంటుంది. దాని మీద కొడితే కుడి చేతి వైపు smaller larger అని ఉంటాయి.
ఒక్క సారీ smaller అని కొట్టి కింద విండో లో ఫాంటు సైజు చూసుకుంటూ మార్చుకోండి
Post a Comment