ఇది చాలా చెడు సాంప్రదాయం. కొన్ని ప్రాంతాల్లో బిడ్డనీ, గుండ్రాయినూ
వుయ్యాల చుట్టూ మూడనసార్లు తిప్పి బిడ్డని తల్లికి, గుండ్రాయిని పిల్లలు లేని
ఆవిడకీ ఇస్తారు. ఇది మరీ అన్యాయం. ఎదుటివారిని అవమానించటమే.
యా దేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్ధితా
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః
అని దేవికి నమస్కరిస్తాము. ఆ పరదేవత సర్వ ప్రాణుల్లోనూ మాతృ తత్వం రూపంలో
వున్నది. అవును. సర్వ ప్రాణుల్లో, పశు
పక్షులలో, జంతువుల్లో, పురుషుల్లోకూడా
మాతృ తత్వం వుంటుంది. తోటి
ప్రాణిని ప్రేమతో అక్కున చేర్చుకునే ప్రతి మనిషికీ మాతృ తత్వం వుంటుంది. వారు పిల్లల్ని కనకపోయినా మాతృమూర్తులే. కొందరు అనాధ పిల్లల్ని పెంచటానికి తమకి
పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని మరీ అనాధ పిల్లల్ని పోషిస్తున్నవాళ్ళున్నారు.
మాతృ తత్వం మనసులో వుండాలికానీ శరీరానికి
కాదు. పిల్లలు లేక పోవటం కేవలం శారీరక
లోపమే. మనం మనిషిలోని తత్వాన్ని గౌరవించాలి. మానసికంగా మాతృభావం కలవారంతా
మాతృమూర్తులే. వారిని ఆదరించాలి,
గౌరవించాలి.
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)
3 comments:
చాలా చక్కని మాట చెప్పారు. :)
ధన్యవాదాలు విజయ్ శర్మగారూ
మీ బ్లాగు ఇప్పుడే చూసి వస్తున్నా. కామెంటు అక్కడ రాద్దామంటే నాకు అవకాశం కనబడలేదు. అందుకే ఇక్కడే రాస్తున్నా. పూజారుల గురించి చక్కగా రాశారు. ఈ మధ్య గుళ్ళు కూడా ఆదాయ మార్గాలే అవుతున్నాయి. మేము ఆలయాలకు ఎక్కువగా వెళ్తాము. కొన్ని పురాతన ఆలయాల స్ధితి చూస్తే చాలా బాధ వేస్తుంది. ఆలయాలే అలా వుంటే అందులో పూజారుల సంగతి చెప్పక్కరలేదుగా.
psmlakshmi
వ్యాఖ్యలు టపాకి పైన ఉంటాయి. ఒక్కసారి అక్కడి వ్యాఖ్యలు కూడా చదవండి. అవి చదివితేనే ఆ టపా పరిపూర్ణం అవుతుంది. ధన్యవాదాలు :)
Post a Comment