Thursday, February 18, 2010

వాస్తు దోషం వున్నట్లు అనుభవంలో ఎలా తెలుసుకోవచ్చు?

Thursday, February 18, 2010



ఇల్లు చూస్తే వాస్తు శాస్త్ర ప్రకారం ఏ దోషం కనబడదు.  కానీ ఆ ఇంట్లోకి మారిన దగ్గరనుంచీ  అకారణ చికాకులూ, అనారోగ్యాలూ, లేనిపోని టెన్షన్లూ, యాక్సిడెంట్లూ ఇలా ఏదో ఒకటి జరుగుతూ వుండవచ్చు.  వారి జాతకం ప్రకారం ఏ దోషం లేని సమయంలో కూడా ఇలాంటివి జరుగుతూంటే ఆ ఇంటి వాస్తులో లోపం వున్నదని చెప్పుకోవచ్చు.  మన శరీరంలో అయస్కాంత శక్తి వుంటుంది.  మనకి సరిపడని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రభావం మన శరీరం మీద పడి తల తిరగటం, తలనొప్పి, చికాకు మొదలయినవి బాధపెడతాయి.

అలాగే పెంపుడు కుక్క అస్తమానం ఒకే దిశకి తిరిగి అరవటంకూడా ఒక సూచనే.  ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావటం, కాకులు ఎక్కువగా వాలటం, ఆ ఇంటి చట్టూ మాత్రమే కాకులు ప్రదక్షణ చేయటం కూడా కనబడని వాస్తు లోపాలకి సూచనలు.

కొన్ని ఇళ్ళు చూడటానికి కళావిహీనంగా కనబడతాయి.  అలాగే కొన్నిచోట్లకి వెళ్ళగానే అకారణ భయం వేస్తుంది. కొన్ని ఇళ్ళల్లో ఆత్మ హత్యలో, హత్యలో జరిగి వుండవచ్చు  అలాంటి సంఘటనలు జరిగినచోట కొన్ని ఇబ్బందులుపడవలసి రావచ్చు.  అంటే ఆ పిశాచాలు అక్కడ తిష్ట వేసుకు కూర్చున్నాయనికాదు, అవి లేకపోయినా కొన్ని చికాకులు వుంటాయి.  ఆ ఇంట్లో అంతకు ముందు జరిగిన సంఘటనలు మనకు తెలిసే అవకాశం వుండదు.  అయినా మనలో అంతర్లీనంగా వున్న శక్తులు కొన్ని మనకి సూచిస్తాయి.

అయితే వంశపారంపర్యంగా వచ్చిన ఇళ్ళని ఇలాంటి చికాకులవల్ల వదిలి వెళ్ళలేము.  అందుకని శాస్త్రజ్ఞులకు చూపించి, లోపాలేమిటో తెలుసుకుని తగిన శాంతి చేయిస్తే సరిపోతుంది.  కొత్త ఇల్లు కట్టుకోబోతున్నా, కొనుక్కోబోతున్నా ముందే సరైన పరీక్షలు చేయిస్తే తర్వాత ఏ ఇబ్బందీ పడక్కరలేదు.

అయితే మన దశ బాగా లేనప్పుడు ఎంత మంచి ఇంట్లోవున్నా మన జాతక దోషాలవల్ల వచ్చే చికాకులు మనమే అనుభవించాలి...వాస్తు శాస్త్రాన్ని నిందించి లాభం లేదు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



7 comments:

Anonymous said...

లక్ష్మి గారికి, నమస్కారములు.

"ఇల్లు చూస్తే వాస్తు శాస్త్ర ప్రకారం ఏ దోషం కనబడదు.... ఆ ఇంటి వాస్తులో లోపం వున్నదని చెప్పుకోవచ్చు. వారి జాతకం ప్రకారం ఏ దోషం లేని సమయంలో కూడా...; అయితే మన దశ బాగా లేనప్పుడు ఎంత మంచి ఇంట్లోవున్నా మన జాతక దోషాలవల్ల వచ్చే చికాకులు మనమే అనుభవించాలి...వాస్తు శాస్త్రాన్ని నిందించి లాభం లేదు."

మీరు వ్రాసిన దాంట్లొ పరస్పర విరుద్ధమైన అంశాలు వున్నాయి. వాస్తు ప్రకారం, జాతకం ప్రకారం ఏ దోషమూ లేదంటున్నారు. కానీ, ఆ ఇంటిలో వాస్తు దోషం వున్నది అని చెప్పవచ్చును అని వ్రాస్తున్నారు. "దశ" గురించి చెబుతున్నారు. ఇది ఏ శాస్త్రానికి సంబంధించినది? వివరించగలరా?

భవదీయుడు,
మాధవరావు.

రవి said...

మా ఇంట్లో మీరు చెప్పినట్లుగానే నడుస్తూంది. చాలా రోజులుగా ఏం చెయ్యాలో కూడా పాలుపోకండా ఉంది.

psm.lakshmi said...

మాధవరావుగారూ
వాస్తు దోషాలు ఏర్పడటానికి కారణాలు దీనికి ముందు పోస్టులో రాశాను. వాటిలో కేవలం ఇల్లు కట్టటంలో వచ్చే దోషాలే కాకుండీ, అక్కడ అంతకు ముందు జరిగిన సంఘటనలవల్లగానీ, మన ప్రవర్తనవల్లగానీ వచ్చే దోషాలు కూడా వీటికి కారణం కావచ్చన్నారు. ఇంక దశ అన్నది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మన గ్రహ బలాన్నిబట్టి వుంటుంది.

ఇంకొక్క విషయం. నేను ఏ శాస్త్రంలోనూ పండితురాల్నికాదు, ఏ శాస్త్రం విషయంలో సలహాలిచ్చే శాస్త్ర జ్ఞానం వున్నదాన్నికూడాకాదు. మూఢ నమ్మకాలను మూఢంగా నమ్మేదాన్ని అంతకన్నాకాదు. అందుకనేనేమో జీ తెలుగు రోజూ ఉదయం 8 గం. లకు ప్రసారం చేసే గోపురం అనే కార్యక్రమంలో కొన్ని విషయాలు నాకు నచ్చుతున్నాయి. ఈ కార్యక్రమం చూసే అవకాశంలేని చాలామందికోసం నాకు నచ్చిన విషయాలు ఇక్కడ రాస్తున్నాను. ఈ కార్యక్రమం ఆధారంగా రాసే ప్రతి పోస్టుకిందా, లేబుల్ లోనూ ఆ విషయం పేర్కొంటున్నాను.
psmlakshmi

psm.lakshmi said...

రవిగారూ,
నమ్మకం వుంటే వాస్తు చూపించండి. అద్దె ఇల్లు అయితే మారి చూడండి. వాస్తు దోష నివారణోపాయాలు, గోపురం ద్వారా నేను విన్నవి, ఈ రోజు పోస్టులో రాస్తున్నాను.
నేనయితే ఒక్క విషయాన్ని నమ్ముతానండీ. ఏ వ్యక్తి జీవితంలోనైనా ఒడుదుడుకులు, మంచీ చెడూ లు సహజం. ఎవరి జీవితమైనా ఎప్పుడూ ఒకేలా వుండదు. సంతోషంగా వున్నప్పుడు ఎవరి సలహాలూ అవసరం లేదుగానీ, చికాకులు వున్నప్పుడు మన విజ్ఞత, ఆలోచన, ఆత్మ ధైర్యం, ఆత్మీయుల సలహా ఇవ్వన్నీ తప్పక సహాయ పడతాయి. ఏమంటారు
psmlakshmi

సత్యాన్వేషి said...

మూఢ నమ్మకాలను నమ్మే వాల్లెవరూ వాటిని మూఢనమ్మకాలు అనుకోరు. అలా అనుకునే వారు వాటిని ఎప్పుడూ నమ్మరు. మీరు ఒక వైపు నుంచి నేను మూఢనమ్మకాలను నమ్మేదాన్ని అస్సలు కాదు అని చెబుతూ తిరిగి వాస్తు గురించి చెబుతున్నారు. మీ దృష్టిలో ఏవు మూఢనమ్మకాలు, ఏవి కాదు?

psm.lakshmi said...

కుంబకర్ణగారూ
నేను దేనినీ పిచ్చిగా నమ్మను. అంటే నాకు జ్వరం వచ్చినంత మాత్రాన వాస్తులోపం అనను. కానీవాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు సౌకర్యవంతంగా వుంటుందని నమ్ముతాను. ఉదాహరణకి ఇంటి చుట్టూ ఎంత స్ధలం వదలాలో చెప్పిన పధ్ధతి పాటిస్తే ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి.
పూర్వీకులు చెప్పిన విషయాలు ఎంతో అనుభవం ద్వారా చెప్పినవని నమ్ముతాను. కానీ కుల మతాల లాంటి విషయాలలో వాళ్ళెందుకు చెప్పారో, మధ్యలో విపరీతార్ధాలు ఎక్కడ వచ్చాయో నమ్మను. మనుష్యులంతా ఒక్కటే అని నా అభిప్రాయం.
ఇంకో విషయం. నా అభిప్రాయాలను ఇంకొకళ్ళమీద రుద్దను..ఇలాగే పాటించండి అని ఒత్తిడి తేను. ఎవరి ఇష్టం వారిది. మనిషన్న ప్రతివారికీ వాళ్ళ వాళ్ల ఇష్టాలు వుంటాయి. అవి హానికరంకానంతమటుకూ గౌరవిస్తాను.
psmlakshmi

astrojoyd said...

lakshmi jee/maadhavrao gaaru--sandharbham vachhindikaabatti idi vraasttunnaanu..vastavaaniki vaastu anedi jyothir-saastramlo oka upa vibhagam maatramae.jyothishyamloni astakavargula pattila aadhaaramgaanae vaastuloni "vargula"vibhajana jaruputaaru.ది సో కాల్డ్,న్యూ వాస్తు పండిట్స్ ప్రకారం మాస్టర్ బెడ్-రూం,నిరుతి లో ఉండాల్సిన పనే లేదు.జాతకంలో శుక్రుని దిస్నీ అనుసరించి దీనిని నిర్మించాలి /జయదేవ్